ETV Bharat / spiritual

ఆ రాశి వారు ఊహించని ఖర్చులతో ఉక్కిరిబిక్కిరి! శనీశ్వరుని ధ్యానం మేలు! - HOROSCOPE TODAY APRIL 11TH 2025

2025 ఏప్రిల్ 11వ తేదీ (శుక్రవారం) రాశిఫలాలు

Horoscope Today April 11th 2025
Horoscope Today April 11th 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 11, 2025 at 5:00 AM IST

3 Min Read

Horoscope Today April 11th 2025 : 2025 ఏప్రిల్ 11వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజుఅనుకూలంగా ఉంటుంది. అదృష్ట సమయం నడుస్తోంది. ఈ రోజు మిమ్మల్ని లక్ష్మీ దేవి విశేషంగా అనుగ్రహిస్తుంది. సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ అనుకూలత ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్ధికంగా ఈదగడానికి చేసే ప్రతి ప్రయత్నం లబ్ధి చేకూరుస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కీలకమైన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. ముఖ్యమైన సమావేశాల్లో మీ వాక్చాతుర్యంతో అందరినీ మెప్పిస్తారు. వృత్తి వ్యాపారాలలో ధనలాభాలు ఉంటాయి. వ్యాపారులు వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఫలితాలు ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు, వారసత్వపు ఆస్తి వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. వీలైనంతవరకూ ఈరోజు ప్రయాణం చెయ్యకండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సోదరవర్గం నుంచి లబ్ది పొందుతారు. కుటుంబ వాతావరణం అనుకూలిస్తుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. చేపట్టిన ప్రతి పనీ విజయవంతంగా పూర్తి చేస్తారు. సామాజికంగా పరపతి పెరుగుతుంది. విందు వినోదాల్లో, విహారయాత్రలో పాల్గొంటారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఫలితాలు రావడం ఆలస్యం కావచ్చు. ఫలితాలు కూడా నిరాశ పరుస్తాయి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపితే ప్రశాంతత కలుగుతుంది. డబ్బు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చవుతుంది. వృత్తి పరమైన చికాకులు ఆందోళన కలిగిస్తాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ అద్భుతమైన పనితీరుతో అందరిలో ప్రత్యేకంగా నిలుస్తారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కోపం, పరుష పదాల కారణంగా సంబంధాలు దెబ్బతింటాయి కాబట్టి వీలైనంత వరకు ఈ రోజు మౌనం వహించడం మంచిది. వృత్తి వ్యాపారాల్లోనూ ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎవరితోనూ ఘర్షణ పడకండి. న్యాయపరమైన లావాదేవీలు, కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. శివారాధన శ్రేయస్కరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుకుంటారు. చేపట్టిన ప్రతీ పనిలోనూ విజయం సాధిస్తారు. మీ పని తీరును ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి తారాబలం అనుకూలంగా ఉంది. ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రియమైనవారు, సన్నిహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. చేపట్టిన పనుల్లో సమస్యలు, ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆదాయంలో వృద్ధి లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. వ్యాపార లావాదేవీలు, మేదోపరమైన విషయాలకు అనుకూలమైన సమయం. కుటుంబ కలహాలతో మనశ్శాంతి లోపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. వృథా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. దుర్గాదేవి దర్శనంతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రోజంతా చాలా ఇబ్బందులు, ఒత్తిడి వుండే అవకాశం వుంది. తత్ఫలితంగా కోపం, చిరాకు పెరుగుతాయి. చట్టవిరుద్దమైన పనులు చేయవద్దు. ఇతరులను బాధ పెట్టేలా ప్రవర్తించవద్దు. ఇంట్లో శుభకార్యం వలన ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యపై శ్రద్ధ పెట్టండి. అభయ ఆంజనేయస్వామి ఆరాధనతో సత్ఫలితాలు ఉంటాయి.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో మీకు అప్పగించిన బాధ్యతలు పూర్తి చేసేందుకు చాలా ఇబ్బందిపడతారు. ఆర్ధిక ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఊహించని ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. శనీశ్వరుని ధ్యానంతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.