Horoscope Today 20th September 2024 : 2024 సెప్టెంబర్ 20వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజంతా స్నేహితులతో సరదాగా గడుపుతారు. శుభకార్యాల్లో, వేడుకలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఈ రోజు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి. చేపట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది. ఉద్యోగుల హోదా పెరుగుతుంది. నూతన బాధ్యతలను చేపడతారు. సంతానం కారణంగా సంపద వృద్ధి చెందుతుంది. శ్రీలక్ష్మీ దేవి ఆలయ సందర్శన శుభప్రదం.
వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులకు శుభకరంగా ఉంటుంది. గతంలో చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతంగా ముగుస్తాయి. ఉన్నతాధికారుల మద్దతు, సహోద్యోగుల సహకారం ఉంటుంది. ప్రమోషన్లకు అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. కుటుంబంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కాలం కలిసివస్తుంది. నూతన బాధ్యతలను చేపడతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. రావలసిన బకాయిలు అన్నీ వసూలు అవుతాయి. కళాకారులకు, సాహిత్యకారులకు శుభసమయం నడుస్తోంది. బిరుదులు, సత్కారాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.
కర్కాటకం (Cancer) : ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ రోజు వృత్తి, వ్యాపారాలలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా సమయస్ఫూర్తితో అందరినీ సంప్రదించి దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇతరులకు సాయం చేయబోయి చిక్కుల్లో పడతారు. పని ఒత్తిడి కారణంగా శారీరక శ్రమ పెరుగుతుంది. తగిన విశ్రాంతి అవసరం. కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. గురుధ్యాన శ్లోకాలు పఠిస్తే ప్రశాంతత కలుగుతుంది.
సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. శత్రుభయం, ధననష్టం ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు పనులకు ఆటంకాలుగా తయారవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారికి చేసే పనిలో ఎదుగుదల లేక నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. నిరుత్సాహాన్ని, నిరాశావాదాన్ని దూరంగా ఉంచితే మీకు మంచిది. ఊహించని ఖర్చులు ఉండవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. కుటుంబ సభ్యులతో ఘర్షణలు మానుకోండి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు శుభకరంగా ఉంటుంది. మిత్రుల సహాయంతో నూతన వ్యాపారాలు మొదలు పెడతారు. సమాజానికి మేలు చేసే పనులు చేయడం ద్వారా కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన ఆర్థిక వనరులను సమకూర్చుకుంటారు. కుటుంబంలో వేడుకలు, విందు వినోదాలు జరుగుతాయి. గణపతి ప్రార్థన శ్రేయస్కరం.
తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. సర్వత్రా విజయం, ఆర్థికవృద్ధి, శత్రుజయం ఉంటాయి. సన్నిహితులతో కలిసి పర్యటక ప్రదేశాలలో పర్యటిస్తారు. దైవం మీద విశ్వాసం ఉంచి కొత్త ప్రాజెక్టులు మొదలు పెడితే అఖండ విజయం చేకూరుతుంది. కుటుంబ వ్యవహారాలు, ఆస్తి వ్యహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.
వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపార సంబంధిత పనులపై ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. కాబట్టి అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకొని ప్రశాంతంగా మాట్లాడండి. లేకుంటే అనవసర కలహాలు ఉంటాయి. దైవసంబంధ పూజల కోసం ధనవ్యయం చేస్తారు. శివారాధన శ్రేయస్కరం.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో విందు, వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రులను కలుసుకుంటారు. రోజంతా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.
మకరం (Capricorn) : ఈ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. నూతన ప్రాజెక్టులు, అసైన్మెంట్లు తీసుకోవడానికి శుభప్రదమైన రోజు. వ్యాపారపరంగా, వృత్తిపరంగానూ లాభించవచ్చు. సామాజికంగా మంచి కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు. వృత్తికి సంబంధించి ఒక అనుకూల సంకేతం రావడం వల్ల సంతోషంగా ఉంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని సరదాగా గడుపుతారు. కుటుంబ సభ్యుల పురోగతికి సంబంధించి శుభవార్తలు వింటారు. శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.
కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్దత నెలకొంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి పనిభారం పెరుగుతుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు రావచ్చు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. విద్యార్థులు చదువు పైన దృష్టి సారించాలి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం కావడానికి కొంత సమయం పడుతుంది. కాస్త ఓపిక పట్టాలి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.
మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. పాత, మధురమైన జ్ఞాపకాలతో ఈ రోజు మీ మనస్సంతా నిండి ఉంటుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. వ్యాపారులు బిజినెస్ నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. సంపాదన పెరుగుతుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.