ETV Bharat / spiritual

గణపతి ఉత్సవాల్లో 'మోరియా' అని ఎందుకంటారో తెలుసా? - Ganpati Bappa Morya Meaning

Ganpati Bappa Morya Meaning In Telugu : గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి చోట గణపతి బప్పా మోరియా అనే నినాదం మారుమోగుతూ ఉంటుంది. 'గణపతి బప్పా మోరియా' అనే నినాదానికి అర్థమేంటో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2024, 1:00 PM IST

Ganpati Bappa Morya Meaning
Ganpati Bappa Morya Meaning (ETV Bharat)

Ganpati Bappa Morya Meaning In Telugu : వినాయక చవితి వేడుకల్లో 'గణపతి బప్పా మోరియా' అంటూ అందరూ ఉత్సాహంగా నినాదాలు చేస్తుంటారు. అయితే ఈ మోరియా అనే మాటకు అర్థం ఎవరికీ తెలియదు. అసలు ఈ మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది? ఆ పదానికి గల అర్థం ఏమిటి ? దాని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం.

మోరియా అసలు కథ
15వ శతాబ్దంలో 'మోరియా గోసాని' అనే సాధువు ఉండేవాడు. అతను మహారాష్ట్రలోని పుణెకు 21 కి.మీ. దూరంలో చించ్ వాడి అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చించ్ వాడి నుంచి మోరే గావ్ వరకు రోజూ కాలినడకన వెళ్లేవాడు.

మోరియాకు గణపతి స్వప్న సాక్షాత్కారం
ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందనీ, ఆ విగ్రహాన్ని తీసుకు వచ్చి ప్రతిష్టించమని చెప్పాడట. కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవడానికి మోరియా అక్కడున్న నదికి వెళ్లాడు. కలలో గణపతి చెప్పినట్టుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది.

మోరియా దర్శనానికి బారులు తీరిన జనం
మోరియాకు గణపతి దొరికాడన్న విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట. మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అనడం మొదలుపెట్టారు. మోరియా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ మొక్కారట. నది నుంచి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించాడు.

ఇందుకే గణపతి బప్పా మోరియా!
గణపతికి గొప్ప భక్తుడైన మోరియా పేరు ఆనాటి నుంచి గణపతి ఉత్సవాల నినాదంలో భాగమైపోయింది. ఆనాటి నుంచి 'గణపతి బప్పా మోరియా 'అనే నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది. భక్త వల్లభుడైన వినాయకుడి సేవలలో మోరియా గోసావి తరించిపోయాడు అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు 'గణపతి బప్పా మోరియా' అని మరాఠీలో నినదిస్తాం. ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియాకు మహారాష్ట్రలోని పూణె సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి. దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటాడు అని అనడానికి మోరియా గోసావి జీవిత కథనే నిదర్శనమని చెబుతుంటారు.

మనం చేసే పూజలకు, ప్రార్ధనలు, నినాదాలకు వెనుక ఉన్న సత్యం ఏమిటో తెలుసుకొని ఆచరించడం వలన చేసే పూజలో భక్తి విశ్వాసాలు దృఢం అవుతాయని, దేవునిపై విశ్వాసం మరింత పెరుగుతుందని శాస్త్రవచనం.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఘనంగా గణేశ్​ చతుర్థి- లాల్​బాగ్ గణపతికి రూ.15కోట్ల కిరీటం- 20కిలోల గోల్డ్​తో చేయించిన అనంత్ అంబానీ - Vinayaka Chavithi Celebrations

"వినాయక నిమజ్జనం చేసేటప్పుడు ఈ పూజా నియమాలు పాటిస్తే - మీకు ఏడాదంతా శుభ ఫలితాలే!" - Ganesh Visarjan 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.