ETV Bharat / spiritual

విష్ణువుకు ప్రీతికరమైన 'వైశాఖ మాసం'- పర్వదినాలు, విశిష్టత ఇదే! - VAISAKHA MASAM 2025

వైశాఖ మాసం విశిష్టత మీకోసం

Vaisakha Masam 2025
Vaisakha Masam 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 28, 2025 at 4:44 AM IST

3 Min Read

Vaisakha Masam 2025 : ఆధ్యాత్మిక సాధనకి అద్భుతమైన మాసాలలో వైశాఖ మాసం కూడా ఒకటి. వసంతఋతువులో రెండవ మాసం అయిన వైశాఖ మాసం ఆధ్యాత్మికంగా భగవదనుగ్రహం పొందడానికి అన్ని విధాలా అనుకూలమైనది. వైశాఖ మాసానికి వైదిక నామం మాధవ నామము. మాధవుడు అంటే శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం కాబట్టి వైశాఖ మాసానికి మాధవ మాసమని పేరు కూడా ఉంది. ఈ కథనంలో వైశాఖ మాసం విశిష్టతను తెలుసుకుందాం.

విష్ణువు మెచ్చిన వైశాఖం
వరుస పర్వదినాలు, విశేష పూజా కార్యక్రమాలు , దానధర్మాలకు అనువైన కాలమంటూ ఏదైనా ఉందంటే అది వైశాఖ మాసమే! మాధవ మాసంగా పిలిచే వైశాఖమంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమని పురాణాలు చెబుతున్నాయి.

వైశాఖమనే పేరు ఇందుకే!
వసంత ఋతువులో చైత్రం తరువాత వచ్చే మాసం వైశాఖ మాసంలో చంద్రుడు విశాఖ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసమని పేరు వచ్చింది.

వైశాఖ మాసం విశిష్టత
వైశాఖ మాసంలో లక్ష్మీదేవి సమేత నారాయణుని తులసి దళాలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రవచనం. వైశాఖం మొదలుకొని మూడు నెలల కాలం వరకు శ్రీ మహావిష్ణువు భూసంచారానికి వస్తాడని, అందుకే ఈ మాసం విష్ణువు ఆరాధనకు శ్రేష్టమైనదని పురాణ వచనం.

వరుస పర్వదినాలు
వైశాఖ మాసంలో వచ్చే వరుస పర్వదినాలు వివిధ దేవతారాధనలు సూచిస్తాయి.

వైశాఖ శుద్ధ తదియ
వైశాఖ శుద్ధ తదియ రోజు కృత యుగం ప్రారంభమైనది పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు పరశురామ జయంతి పేరిట విష్ణుమూర్తి పరశురామ అవతారాన్ని పూజిస్తారు. అలాగే అక్షయ తృతియగా జరుపుకునే ఈ రోజున లక్ష్మీదేవి ఆరాధన కూడా విశేషంగా చేస్తారు. సింహాద్రి అప్పన్న చందనోత్సవం కూడా ఈ రోజునే జరుగుతుంది. ఈ రోజు సింహాచలంలో స్వామి నిజరూప దర్శనం వీక్షించిన వారికి అభీష్టసిద్ధి కలుగుతుందని శాస్త్రవచనం.

గురువుల జయంతి
వైశాఖ శుద్ధ పంచమి రోజు శంకర జయంతి, రామానుజ జయంతి కూడా జరుపుకుంటాం.

పద్మావతి పరిణయోత్సవాలు
వైశాఖ శుద్ధ దశమి రోజు ఆకాశరాజు పద్మావతి దేవిని శ్రీనివాసునికి ఇచ్చి కళ్యాణం జరిపించాడని బ్రహ్మాండపురాణంలో వివరించి ఉంది. ఈ సందర్భంగా తిరుమలలో మూడు రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

నృసింహ జయంతి
వైశాఖ శుద్ధ త్రయోదశి రోజు శ్రీ మహావిష్ణువు నరసింహస్వామిగా అవతరించిన పర్వదినం. ఈ రోజు నృసింహ జయంతిని జరుపుకుంటాం.

బుద్ధ పౌర్ణమి
వైశాఖ శుద్ధ పౌర్ణమిని మహా వైశాఖి అని అంటారు. ఇదే రోజు బుద్ధ పౌర్ణమి కూడా జరుపుకుంటాం.

హనుమజ్జయంతి
వైశాఖ బహుళ దశమిని హనుమజ్జయంతిగా జరుపుకుంటాం.

దానాల మాసం
వైశాఖ మాసంలో దానాలు చేయడం శ్రేష్టమని అంటారు. సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే లక్ష్మీదేవికి వైశాఖ మాస మహత్యాన్ని గురించి వివరించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో చేసే స్నాన దాన పూజ జపతపాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని శాస్త్రం చెబుతోంది. సూర్యుడు మేషరాశిలో సంచరించే వైశాఖ మాసంలో వేడిమి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మాసంలో వేడి నుంచి ఉపశమనం కలిగించే వాటిని దానం ఇవ్వడం శ్రేష్టం.

విశేషాల సమాహారం
విశేషాల సమాహారమైన వైశాఖ మాసంలో ఇవి మాత్రమే కాకుండా వాసవి కన్యకాపారమేశ్వరి జయంతి, జొన్నవాడ శ్రీ కామాక్షి దేవి కల్యాణోత్సవం, కోటప్పకొండలో మల్లెల అర్చన వంటి కార్యక్రమాలు కూడా విశేషంగా జరుగుతాయి.

ప్రతినిత్యం వేడుకలు జరిగే ఈ వైశాఖ మాసం నిత్యకల్యాణం, పచ్చతోరణం వలే అందరికీ సకల శుభాలు అందించాలని కోరుకుందాం.

శుభం భూయాత్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.