ETV Bharat / spiritual

భాగ్యనగరంలో మొదలు కానున్న బోనాల సంబురాలు- పూర్తి షెడ్యూల్​ ఇదే! - BONALU 2025

బోనాలు గురించి పూర్తి వివరాలు మీ కోసం!

Bonalu 2025
Bonalu 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : June 24, 2025 at 12:00 AM IST

2 Min Read

Bonalu 2025 : తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భావించే బోనాలు పండుగకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే బోనాలు ఉత్సవాలు నెలరోజుల పాటు జరుగనున్నాయి. ఈ సందర్భంగా బోనాలు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి? ఎప్పుడు ముగియనున్నాయి? ఏ రోజు ఏ ప్రాంతంలో ఉత్సవాలు జరుగనున్నాయి? తదితర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆషాఢంలో అతి పెద్ద జాతర
ఆషాఢమాసం మొదలవగానే తెలంగాలో బోనాలు సంబురాలు మొదలవుతాయి. ఈ సందర్భంగా ఈ ఏడాది బోనాలు ఉత్సవాలు జూన్ 26న ప్రారంభమై, జూలై 24న ముగుస్తాయని దేవదాయ శాఖ అధికారులు తెలియజేసారు.

తొలిపూజకు వేదిక కానున్న గోల్కొండ కోట
జూన్‌ 26వ తేదీ గురువారం చారిత్రక గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించడంతో బోనాలు సంబురాలు మొదలవుతాయి.

రెండో వారం ఇక్కడే
బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండో వారం జూలై 6వ తేదీ ఆదివారం బల్కంపేట రేణుక ఎల్లమ్మ గుడిలో, బోనం ఎత్తుతారు. మూడో వారం జూలై 13వ తేదీ ఆదివారం సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనం ఎత్తుతారు. నాలుగో వారం జూలై 20వ తేదీ ఆదివారం లాల్ దర్వాజాలోని శ్రీ మహంకాళి ఆలయంలో బోనం ఎత్తుతారు.

తొమ్మిది రోజుల బోనాలు
ఆషాఢమాసంలో ప్రతి ఆదివారం, గురువారం మొత్తంగా తొమ్మిది రకాల పూజలను అమ్మవారు అందుకుంటారు. బోనాలు సందర్భంగా జూన్‌ 26వ తేదీ గురువారం మొదటి బోనం, జూన్ 29వ తేదీ ఆదివారం రెండవ బోనం, జూలై 3 వ తేదీ గురువారం మూడవ బోనం, జూలై 6వ తేదీ ఆదివారం నాల్గవ బోనం, జూలై 10వ తేదీ గురువారం ఐదవ బోనం, జూలై 13వ తేదీ ఆదివారం ఆరవ బోనం, జూలై 17వ తేదీ గురువారం ఏడవ బోనం, జూలై 20వ తేదీ ఆదివారం 8వ బోనం, జూలై 24 వ తేదీ గురువారం తొమ్మిదో బోనం నిర్వహించనున్నారు. ఈ రోజుతో బోనాలు ఉత్సవాలు ముగుస్తాయి.

తెలంగాణ ప్రజలు నెల రోజులపాటు జరుపుకునే బోనాలు ఉత్సవాలకు ప్రభుత్వం పకడ్భంది ఏర్పాట్లు చేస్తోంది.

బోనాలు ఉత్సవాలలో అమ్మవారి దర్శనం సకల శుభకరమని విశ్వాసం.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.