ETV Bharat / spiritual

ప్రసాదంగా ఇచ్చే పూలను ఏం చేయాలి? - ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి? - సంపద తగ్గడానికి కారణాలివేనట! - AVOID BAD LUCK MISTAKES

- ఈ పొరపాట్లు చేయొద్దంటున్న జ్యోతిష్యులు!

Mistakes to Avoid for Luck
Flowers (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : April 11, 2025 at 4:57 PM IST

4 Min Read

Mistakes to Avoid for Luck : మానవ జీవితంలో తరచూ వినిపించే రెండు మాటలు అదృష్టం, దురదృష్టం. అన్నీ సవ్యంగా జరిగి శుభ ఫలితాలు పొందినప్పుడు "అదృష్టం బాగుంది" అని అంటారు. అదే, కొందరు ఎంతో శ్రమించినా ఫలితం దక్కకుండా పోతుంది. ఇలాంటప్పుడు "దురదృష్టం" అని సంబోధిస్తుంటారు. ఇలా అదృష్టం కలిసిరాకపోవడానికి నిత్యం జీవితంలో చేసే కొన్ని పొరపాట్లు కూడా కారణం కావొచ్చంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు. ఈ క్రమంలోనే అదృష్టం కలిసొచ్చి, సకల శుభాలు చేకూరాలంటే డైలీ లైఫ్​లో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  • రోజూ ఇంట్లో పొయ్యిని కర్పూరంతో వెలిగిస్తే చాలా మంచిదని సూచిస్తున్నారు. అలా చేయడం ద్వారా అగ్ని దేవుడి అనుగ్రహం లభించి సంపదలు త్వరగా సిద్ధిస్తాయంటున్నారు జ్యోతిష్యుడు మాచిరాజు.
  • ఎవరైనా బయటకు వెళ్లి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్లు చేతులు కడుక్కోకుండా అలాగే లోపలికి వచ్చేస్తుంటారు. కానీ, ఈ పొరపాటు అస్సలు చేయకూడదు. ఎప్పుడు బయటికెళ్లి ఇంట్లోకి వచ్చినా సింహద్వారం బయటే కాళ్లు చేతులు కడుక్కొని లోపలికి రావడం మంచిదంటున్నారు.
  • శుభ కార్యక్రమాల​ టైమ్​లో మెజార్టీ పీపుల్ ఇంటికొచ్చిన బంధువులకు నూతన వస్త్రాలు పెట్టి పంపిస్తుంటారు. అయితే, ఇలాంటి సమయంలో అంచు ఉన్న బట్టలు వారికి పెట్టడం శ్రేయస్కరం అంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు. అదేవిధంగా, కొత్త బట్టలు పెట్టేటప్పుడు వాటికి బొట్టు అంటించడం మర్చిపోవద్దంటున్నారు.
Mistakes to Avoid for Luck
Flowers (Getty Images)
  • చాలా మంది బీచ్​లు, సముద్ర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ స్నానం చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో సూర్యాస్తమయం తర్వాత ఎప్పుడూ సముద్ర స్నానం చేయకపోవడం బెటర్. ముఖ్యంగా మంగళ, శుక్రవారాల్లో సముద్ర స్నానానికి దూరంగా ఉండాలి.
  • కొంతమంది తడి బట్టలతో ఆహారం స్వీకరిస్తుంటారు. కానీ, అలా ఎప్పుడూ చేయకూడదంటున్నారు. ఎప్పుడైనా సరే పొడి బట్టలు ధరించి మాత్రమే ఆహారం స్వీకరించడం మంచిదని చెబుతున్నారు.
  • నిత్య జీవితంలో చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, ఎవరైనా తెలిసిన వారు కనిపించినప్పుడు నమస్తే అంటూ ఒక చెత్తో నమస్కారం పెడుతుంటారు. కానీ, ఇది కూడా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం తప్పు అంటున్నారు. కాబట్టి, ఎవరికైనా సరే రెండు చేతులతో నమస్కారం చేయడం మంచి పద్ధతి అంటున్నారు.
  • అదేవిధంగా పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించే క్రమంలో ఈ పద్ధతి పాటించాలంటున్నారు. అప్పుడే వారి ఆశీస్సులతో శుభ ఫలితాలు పొందుతారట. అదేంటంటే, ముందుగా లెఫ్ట్ హ్యాండ్ నమస్కరించే వారి ఎడమ పాదం మీద ఉంచి ఆపై రైట్ హ్యాండ్​ని ఎడమ చేతి మీద నుంచి తీసుకెళ్లి వారి కుడి పాదాన్ని తాకి నమస్కరించాలి.

"కుటుంబ గొడవలు తట్టుకోలేకపోతున్నారా? - గోమాతకు ఇవి తినిపిస్తే మీ ఇంట్లో సంపూర్ణ శాంతి!"

Mistakes to Avoid for Luck
Mistakes to Avoid for Luck (Getty Images)
  • లక్ష్మీదేవి అనుగ్రహం పొంది అదృష్టం కలిసిరావాలంటే మార్నింగ్ నిద్ర లేవగానే ఈ పని చేయాలంటున్నారు. అదేంటంటే, ఉదయం మేల్కొన్నాక సింహద్వారం వద్దకు వెళ్లి గొళ్ళెం లేదా గడిని మూడు సార్లు సౌండ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి సులభంగా ప్రవేశిస్తుందని చెబుతున్నారు జ్యోతిష్యులు.
  • మనలో చాలా మందికి గుడికి వెళ్లే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలోనే అక్కడ భగవత్ ప్రసాదంగా పుష్పాలు, పత్రాలు వంటివి ఇస్తుంటారు. అలా ఇచ్చినప్పుడు వాటిని నేరుగా కవర్​లో వేసుకోకుండా పుష్పాలు ఇస్తే తల మీద పెట్టుకోవడం, పత్రాలు ఇస్తే చెవిలో ఉంచుకోవడం చేయాలంటున్నారు.
  • ఎక్కువ మంది చేసే మరో పొరపాటు ఏంటంటే, కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఎక్కువగా చూపుడు వేలుని యూజ్ చేస్తుంటారు. కానీ, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అది మంచిది కాదట. ఎప్పుడు కూడా మధ్య వేలు లేదా ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకోవడం మంచిదంటున్నారు.
Mistakes to Avoid for Luck
Main Entrance (Getty Images)
  • జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శని బాధలు ఎక్కువగా ఉన్నవారు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు. అదేంటంటే, ఈవెనింగ్ టైమ్​లో చెప్పులు లేకుండా నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ కొద్ది దూరం వాక్ చేయాలట.
  • అప్పుల సమస్యలు ఉన్నవారు మంగళవారం రోజు ఈ చిన్న పరిహారం పాటిస్తే మంచి రిజల్ట్​ని పొందుతారంటున్నారు. మీరు చేయాల్సిన ఆ పరిహారం ఏంటంటే, కొద్దిగా కుంకుమను తీసుకొని ముత్తైదువులకు ఇవ్వాలి. ఇలా చేయడం ద్వారా అప్పుల సమస్యలు తగ్గుముఖ పడతాయంటున్నారు.
  • గృహ దోషాలు లేదా జాతక దోషాలు ఉండి కుటుంబంలో అభివృద్ధి లేక ఇబ్బందిపడుతన్నట్లయితే మంగళవారం పూట ఈ చిన్న చేయండి. అదేంటంటే మీ చేతులతో ఎవరికైనా పుల్లటి అటుకులు దానం చేయాలి.
  • వ్యాపార సంస్థలో అమ్ముడు కాని వస్తువులు ఎక్కువ రోజులు ఉంటే అప్పుడు ఈ చిన్న పరిహారం పాటిస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు. అదేంటంటే, అమ్ముడు కాకుండా ఎక్కువ రోజుల ఉన్న వాటిపై కొద్దిగా పసుపు వాటర్ చల్లి చూడండి. అవి తొందరగా అమ్ముడవుతాయి.
  • అదేవిధంగా, దంపతుల మధ్య గొడవలు ఎక్కువ చోటుచేసుకుంటుంటే కొన్ని బియ్యపు ఒక క్లాత్​లో మూటకట్టి బెడ్​రూమ్​లోని పరుపు కింద పెట్టండి. అది కూడా నైరుతి దిశలో పెడితే ఉత్తమ ఫలితాలు పొందవచ్చంటున్నారు.
  • ఎవరికైనా పాలు, పెరుగు వంటివి దానం ఇచ్చేటప్పుడు సగం పాత్రలో ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. వీలైనంత వరకు మీరు ఇచ్చే బౌల్​ నిండా ఇవ్వాలి. అది చిన్నది లేదా పెద్దది అవ్వొచ్చు.
  • నిత్య జీవితంలో ఈ నియమాలు పాటించండి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సమస్త శుభాలను సిద్ధించుకోండని సూచిస్తున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

"కస్తూరి కాయతో ఈ చిన్న పరిహారం చేస్తే - మీ సంపద పెరిగి దశ మారిపోతుంది!"

మీ పుట్టిన తేదీ ప్రకారం ఈ మొక్కలు నాటితే - దరిద్రం పోయి అదృష్టం కలుగుతుందట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.