ETV Bharat / spiritual

ఆ రాశుల వారికి ఈ వారం హెల్త్ పరంగా నో ఇష్యూస్​! కానీ ఖర్చులే ఎక్కువగా!! - Weekly Horoscope

15th Sep to 21st September 2024 Weekly Horoscope : 2024 సెప్టెంబర్ 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు మీ రాశిఫలం ఎలా ఉందంటే ?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2024, 1:44 AM IST

Weekly Horoscope
Weekly Horoscope (ETV Bharat)

15th Sep to 21st September 2024 Weekly Horoscope : 2024 సెప్టెంబర్ 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు మీ రాశిఫలం ఎలా ఉందంటే ?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం పనులన్నీ నెమ్మదిగా సాగుతాయి. అయితే అన్ని పనులు సకాలంలోనే పూర్తవుతాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు సహోద్యోగుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కానీ అవన్నీ తాత్కాలికమే! మీ పని తీరుతో అందరిని మెప్పించి పదోన్నతులు పొందుతారు. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాగ్వివాదాలకు దూరంగా ఉండడం తెలివైన పని. వ్యాపారులు, స్థిరాస్తి రంగం వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. శివారాధన మేలు చేస్తుంది.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి నిపుణులు, వ్యాపారులు తమ వృత్తి పట్ల అంకిత భావంతో ఉండాలి. వ్యక్తిగత దూషణలు కూడదు. వారం మధ్యలో ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన పోటీ ఉండవచ్చు. సంయమనం పాటిస్తూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తే గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తప్పనిసరి. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు సమయానుకూలంగా నడుచుకోవడం అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో సంబంధం దృఢ పరచుకోడానికి ప్రయత్నిస్తారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈశ్వర ఆరాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. వ్యక్తిగత జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. సమస్యల పరిష్కారానికి కుటుంబ సభ్యుల సలహా తీసుకుంటే మేలు. ఉద్యోగులు, వ్యాపారులు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులు వ్యాపార విస్తరణ పట్ల దృష్టి సారిస్తే మేలు. ఇంట్లోని పెద్దవారి ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ఆశించిన ప్రయోజనాలు పొందాలంటే తీవ్రమైన కృషి అవసరం. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. శనికి తైలాభిషేకం చేయిస్తే అనుకూలమైన ఫలితాలు పొందవచ్చు.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. సోమరితనంతో ఇతరుల మీద ఆధారపడి చిక్కులు కొని తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో పనిచేస్తే తప్ప విజయం చేకూరదు. వ్యాపారంలో గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి అయోమయంలో పడుతుంది. అవసరానికి డబ్బు చేతికి అందక ఇబ్బందులు పడతారు. ప్రయాణాలలో చోర భయం ఉండవచ్చు. ప్రమాదాలకు కూడా అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామితో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. దైవదర్శనాలు చేయడం, తీర్థయాత్రలకు వెళ్లడం వలన సానుకూల ఫలితాలు ఉంటాయి. నిరంతరం శ్రీరామనామ జపం చేయడం శ్రేయస్కరం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ వారం అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తిలో సంతృప్తి కరమైన పురోగతి ఉంటుంది. ఊహించిన దానికన్నా ఎక్కువ ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేస్తారు. ఉద్యోగులు సహోద్యోగుల సాయంతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు వ్యూహాత్మకంగా పనిచేసి సంస్థని అభివృద్ధి చేస్తారు. మీ ప్రయత్నాన్ని సీనియర్లు మెచ్చుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు,ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. ఎంతో కాలంగా భూమి, ఇల్లు కొనాలన్నా కోరిక ఈ వారం నెరవేరుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. జీవితభాగస్వామితో బంధాలు దృఢపడతాయి. విహార యాత్రలు, విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

కన్య (Virgo) : కన్య రాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. అదృష్టం వరిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారం కెరీర్ పరంగా శుభ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం వృత్తి వ్యాపారాలలో కార్యసిద్ధి, లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ప్రారంభించిన పనులు ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి. ఉద్యోగులు ముఖ్యమైన బాధ్యతలు చేపడతారు. వ్యాపారులు పెరుగుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాన్ని వృద్ధి చేసి విజయం సాధిస్తారు. మార్కెట్‌లో మీ విశ్వసనీయత కూడా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి వారం చివరలో పెద్ద కంపెనీ నుంచి ఆఫర్ రావచ్చు. గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విలాసవంతమైన వస్తువుల కొనుగోలు కోసం అధిక ధనవ్యయం ఉంటుంది. శ్రీలక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.

.

తుల (Libra) : తుల రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం, విజయం ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు చేపట్టిన ప్రతిపనిలోను విజయాన్ని సాధిస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు, ప్రమోషన్ పొందుతారు. నూతన బాధ్యతలను చేపడతారు. స్థానచలనం సూచన కూడా ఉంది. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ కోసం దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణాలు భవిష్యత్ లో ప్రయోజనకరంగా ఉంటాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాలు కూడా అవసరం. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంతో ఆనందకరమైన క్షణాలను ఆస్వాదిస్తారు. జీవిత భాగస్వామితో విహార యాత్రలకు వెళతారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగాలి. వృత్తిలో ఎదురయ్యే సవాళ్లు జీవితంలో ఎదగడానికి ఒక అవకాశంగా మలచుకుంటే విజయం మీదే! అందరితో స్నేహపూర్వకంగా, సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధించాలంటే తీవ్రమైన కృషి అవసరం. వృత్తి నిపుణులు, వ్యాపారస్తులు సమిష్టి కృషితోనే విజయాలు సాధిస్తారు. అందరినీ కలుపుకొని పోవడం మంచిది. అధికారంతో దేన్నైనా సాధించవచ్చు అనుకుంటే పొరపాటు. ఇది మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా, మీ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు కూడదు. శివారాధన శ్రేయస్కరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ శక్తియుక్తులను పూర్తి స్థాయిలో వెచ్చిస్తే ఊహించిన దానికంటే ఎక్కువ విజయాన్ని, ఆర్ధిక లాభాలను పొందవచ్చు. సమాజంపై గొప్ప ప్రభావాన్ని చూపిన వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. ఈ పరిచయం మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. వర్కింగ్ మహిళలు వృత్తి పరంగా గొప్ప విజయాలు సాధిస్తారు. కుటుంబంలో, సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రేమికులు వివాహ బంధంతో ఒక్కటవుతారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు. ప్రయాణాలలో జాగ్రత్తగా వహించాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృతి వ్యాపారాలలో మెరుగైన ప్రయోజనాలు పొందాలంటే తీవ్ర కృషి అవసరం. పని పట్ల సోమరితనం, నిర్లక్ష్య వైఖరి కారణంగా తీవ్రంగా నష్టపోతారు. బద్దకాన్ని వీడి సంస్థ ప్రయోజనాల కోసం పనిచేస్తే గౌరవం ఉంటుంది. వ్యాపారులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. ఆర్ధిక సంబంధిత విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మేలు. ఖర్చు చేసేటప్పుడు తెలివిగా వ్యవహరించాలి. స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా మేలు చేస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కుటుంబంలో పెద్దల పట్ల బాధ్యతతో మెలగండి. కుటుంబ వ్యవహారాల్లో హుందాగా ఉంటే మంచిది. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. శివపార్వతుల ఆలయ సందర్శనం శుభకరం.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొల్పడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయ వనరులు సమకూరుతాయి. కుటుంబంలో జరిగే శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు ముఖ్యమైన బాధ్యతలు చేపడతారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. ఊహించని లాభాలను కూడా అందుకుంటారు. జీవిత భాగస్వాముల మధ్య పరస్పర అవగాహన విశ్వాసం పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ఆశ్చర్యకరమైన బహుమతులను అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కొన్ని కీలక వ్యహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే అవాంతరాలు తొలగిపోయి శుభ ఫలితాలు ఉంటాయి.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. వృత్తివ్యాపారాలలో అడ్డంకులు తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. నూతన ఆలోచనావిధానంతో పనిచేసి విశేషమైన ఫలితాలను అందుకుంటారు. ఆర్ధికంగా ఎదుగుతారు. సంపద వృద్ధి చెందుతుంది. వ్యాపారస్తులకు రుణబాధ తొలగుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. మంచి లాభాలను పొందుతారు. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణం, లాభదాయకంగా ఉంటుంది. భూమి, ఇల్లు వంటి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. ఆరోగ్య సమస్యలు తగ్గు ముఖం పడతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.