ETV Bharat / press-releases

చెత్తలో కూర్చోని ఎమ్మెల్యే ధర్నా - దుర్వాసనను భరిస్తూ 2 గంటల పాటు - MARRI RAJASEKHAR REDDY PROTEST

డంపింగ్ యార్డును ఎత్తివేయాలంటూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ధర్నా - దుర్వాసనను భరిస్తూ 2 గంటల పాటు అక్కడే బైఠాయించిన మర్రి - సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని స్థానికులకు హామీ

Malkajgiri MLA Marri Rajashekar Reddy Protest Against Dumping Yard
Malkajgiri MLA Marri Rajashekar Reddy Protest Against Dumping Yard (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 17, 2025 at 9:46 AM IST

1 Min Read

Malkajgiri MLA Marri Rajashekar Reddy Protest Against Dumping Yard : మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా మచ్చబొల్లారంలోని డంపింగ్ యార్డును ఎత్తివేయాలంటూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదివారం చెత్తలో కూర్చొని ధర్నా చేశారు. పరిసర కాలనీ వాసులు ఆయనకు మద్దతు తెలిపారు. ధర్నా విరమించాలని పోలీసులు కోరినా పట్టించుకోకుండా సుమారు రెండు గంటల పాటు దుర్వాసనను భరిస్తూ ఆయన అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో దాత వెంకట రెడ్డి 15 ఎకరాల భూమిని శ్మశానం కోసం ఇచ్చారని, ఆ స్థలాన్ని డంపింగ్​ యార్డుగా మార్చడంతో కాలుష్యం పెరిగి ప్రజలు వ్యాధులు బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

డంపింగ్‌ యార్డు ప్రాంతంలో కొందరు నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని స్థానికులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చి వెళ్లిపోగా కాలనీవాసులు మాత్రం రాత్రి వరకు ధర్నా కొనసాగించారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్టుచేసి, తరువాత వదిలిపెట్టారు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అభ్యంతరం ఏంటంటూ 30 కాలనీల ప్రతినిధులు పోలీసులను ప్రశ్నించారు.

బీజేపీ నేతల సంఘీభావం : మహిళల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. అనుమతి లేకుండా ధర్నా చేయడంతో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఆందోళనకు బీజేపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. ధర్నాలో కార్పొరేటర్‌ విజయశాంతి, ఎంబీసీ మాజీ ఛైర్మన్‌ నందికంటి శ్రీధర్, జేఏసీ నేతలు పాల్గొన్నారు.

'మాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వద్దు మేడం' - కలెక్టర్​కు దండం పెట్టి వేడుకున్న గ్రామస్థులు

హైదరాబాద్​లో చెత్త శుద్ధి కేంద్రాలపై జీహెచ్ఎంసీ కసరత్తు - జవహర్​నగర్​పై తగ్గనున్న ఒత్తిడి - Ghmc Planning To Dumping Yards

చెరువులోకి డంపింగ్​ యార్డు కాలుష్య జలాలు - మృత్యువాతపడిన లక్షలాది చేపలు - Fish Dies toxic From dumpingyard

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.