Balineni Key Comments : మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పదవుల గురించి తాను ఆలోచించనని పేర్కొన్నారు. ఇక ఒంగోలు రావాల్సిన టైం వచ్చిందని తెలిపారు. ఇకపై ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు. తనపై విశ్వాసంతో తనతో పాటు నడవాలని నిర్ణయించుకున్న పార్టీ క్యాడర్ను వదులుకోనని చెప్పారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
అంతకుముందు ఒంగోలుకు వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాలినేని వారితో ముచ్చటించారు. అందరిని పేరుపేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తనను నమ్ముకున్న క్యాడర్ను కాపాడుకుంటానని వారికి అన్ని విధాలుగా అండగా ఉండేందుకు కృషి చేస్తానని బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
నన్ను నమ్ముకున్న కార్యకర్తలను వదిలిపెట్టను. అవసరమైతే వారికోసం ఒంగోలులోనే ఉంటాను. పదవుల విషయం తాను ఆలోచించను. ఒంగోలు రావాల్సిన టైం వచ్చింది. ఇక ఇక్కడే ఉంటాను. కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉండేందుకు కృషి చేస్తాను - బాలినేని శ్రీనివాసరెడ్డి, జనసేన నేత
జగన్ పాత్ర నిజమే అయితే క్షమించరానిది - మంత్రిగా చేసినందుకు బాధపడుతున్నా: బాలినేని