YS Sharmila Comments on YSRCP and Jagan: వైఎస్సార్సీపీకి, ఆ పార్టీని మోసే సంస్థలకు పచ్చకామెర్ల రోగం తగ్గినట్లు లేదంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్వయం శక్తితో రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుంటే అది చూసి ఓర్వలేక, అసత్యపు ఆరోపణలతో నిందలు వేయడం వైఎస్సార్సీపీ చేతకానితనానికి నిదర్శనమని మండిపడ్డారు. గడిచిన ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చినా మీ నీచపు చేష్టలు మారలేదంటూ జగన్‌ను ఉద్దేశించి షర్మిల అన్నారు.
వైఎస్సార్సీపీ నేతలు అసత్యాలు చెప్పడం మానుకోలేదని షర్మిల మండిపడ్డారు. నిజాలు జీర్ణించుకోలేని వారు ఈ జన్మకు మారరని రాష్ట్ర ప్రజలకు మరోసారి అర్థమైందని అన్నారు. ఇంతకాలం ఎవరి సేవలో ఎవరు తరించారో అందరికీ తెలుసని తండ్రి ఆశయాలకు తూట్లు పొడిచి, రాష్ట్ర ప్రయోజనాలను ప్రధాని మోదీకి తాకట్టు పెట్టి, స్వలాభమే పరమావధిగా రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని అన్నారు.
ఐదేళ్లపాటు 'మోదాని' సేవలో: అధికారంలో ఉన్నప్పడు ప్యాలెస్‌లు కట్టుకుని సొంత ఖజానాలు నింపేశారని షర్మిల ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చి ప్రజల ఆస్తులు కాజేయాలని చూశారని విమర్శించారు. రుషికొండను కబ్జా చేయాలని చూశారని అలానే మోదీకి మద్దతుగా నిలిచి ఐదేళ్లపాటు 'మోదాని' సేవలో తరలించినట్లు ప్రజలకు అర్థమైందని అన్నారు. వారి నీచపు యుక్తులతో, పాపపు సొమ్మును ఎరగా చూపి కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయాలనే కుట్ర తప్ప ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీకి ఏమాత్రం శ్రద్ధ లేదని తెలిపారు. కాంగ్రెస్ ఎదగడం చూసి వైఎస్సార్సీపీ భయపడుతోందన్నది పచ్చి నిజం అని షర్మిల అన్నారు.
సునీతను ఏమైనా చేస్తారేమో - అందుకే న్యాయం జరగడం లేదు: వైఎస్ షర్మిల
ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ చరిత్రకెక్కుతారు: వైఎస్ షర్మిల