ETV Bharat / politics

దళితుల పథకాలను రద్దు చేస్తే ఊరుకుంటారా? : టీడీపీ నేతలు - TDP Leaders on Jagan

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 11, 2024, 5:22 PM IST

TDP Leaders on Jagan Name Removal From Ambedkar Statue: అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జగన్ పేరు నచ్చని కొంత మంది దాన్ని తొలగిస్తే వైఎస్సార్​సీపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. దళితులకు చెందిన 27 పథకాలను రద్దు చేసిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. ప్రజాధనంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన జగన్‌ అధికారం లేకుండా 3 నెలలు ఉండలేకపోతున్నారని విమర్శించారు.

tdp_leaders_on_jagan
tdp_leaders_on_jagan (ETV Bharat)

TDP Leaders on Jagan Name Removal From Ambedkar Statue: విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ సీఎం జగన్ పేరు తొలగింపుపై వైఎస్సార్​సీపీ రాద్దాంతం చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహం పెడితే అంబేద్కర్ పేరు పెడతారా లేక జగన్ పేరు పెట్టుకుంటారా అని ఆయన నిలదీశారు. తాటికాయ అంతా అక్షరాలతో విగ్రహం ముందు జగన్ పేరు రాసుకుంటే అంబేద్కర్ అభిమానులు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. అంబేద్కర్ అభిమానులే జగన్ పేరు తొలగించి ఉంటారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న: అంబేద్కర్ విదేశీ విద్య పథకానికి ఆయన పేరును తొలగించి జగనన్న విదేశీ విద్యగా నామకరణం చేసిన జగన్​కు అంబేద్కర్ పేరు పలికే అర్హత లేదని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైఎస్సార్​సీపీ పాలనలో దళితులకు అమలు చేస్తున్న 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను జగన్మోహన్ రెడ్డి మళ్లించారని గుర్తు చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో బుద్ధ వెంకన్న మాట్లాడుతూ ప్రజాధనంతో జగన్మోహన్ రెడ్డి విలాసవంతమైన జీవితాన్ని గడిపారని విమర్శించారు.

అధికారం లేకుండా కనీసం మూడు నెలలు కూడా జగన్ మోహన్ రెడ్డి ఉండలేకపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా అలజడలు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్​సీపీ పాలనలో రాష్ట్రం నుంచి అనేక పరిశ్రమలను తరిమేసారని ఆగ్రహం వ్యక్తం చేశఆరు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు అభివృద్ధిని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందన్నారు.

దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో మరో ట్విస్ట్ - దివ్వల మాధురికి ప్రమాదం - Madhuri Road Accident

జగన్ తీరుపై ఆగ్రహం: గత అయిదేళ్ల వైఎస్సార్​సీపీ పాలనలో దళితులపై జరిగిన దాడులు, దౌర్జన్యాలపై విచారణ చేపట్టాలని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ డిమాండ్ చేశారు. నెల్లూరు బీజేపీ కార్యాలయంలో ఎస్సీ మోర్చా కోస్టల్ ఆంధ్ర జోనల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవానంద్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్​సీపీ హయాంలో దళితులపై 740కి పైగా దాడులు జరిగాయని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండు నెలల కూడా గడవకముందే ఏదో జరిగిపోతున్నట్లు వైఎస్సార్​సీపీ ఆరోపణలు చేయడం అర్ధరహితమన్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్ పేరు తొలగిస్తే ఆందోళనలు చేయడం సరికాదన్నారు. జగన్ హయాంలో జరిగిన అరాచకాలపై గవర్నమెంట్ కలిసి న్యాయ విచారణ కోరనున్నట్లు వెల్లడించారు.

గాలి వానలో, వాగు నీటిలో పడవ ప్రయాణం- రహదారి తెలియదు పాపం! - Pudilanka peoples problem

వైఎస్సార్సీపీ భూదందాలపై ప్రభుత్వం సీరియస్- రెవెన్యూ సదస్సులతో నిగ్గు తేల్చాలని అదేశాలు - Revenue Meetings in AP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.