MLC Bhumireddy comments on Jagan: కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సమస్యలను, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడంలో నియోజకవర్గ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలం చెందారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం వేంపల్లి ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు జగన్మోహన్ రెడ్డిను దాదాపు 60 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే జగన్ మాత్రం అసెంబ్లీకి వెళ్లి ప్రజల సమస్యల పట్ల చర్చించకుండా ఇంట్లో భీష్మించుకొని కూర్చోవడం కరెక్ట్ కాదని మండిపడ్డారు.
ఎలక్షన్లలో 11 సీట్లు వచ్చాయని జనాలను వదిలేయడం సమంజసమా అని ప్రశ్నించారు. శాసనసభకు రావడం ఇష్టం లేకపోతే శాసనసభ సభ్యత్వ గౌరవాన్ని వదులుకుంటే మరొకరు నియోజకవర్గ నుంచి ఎన్నికై శాసనసభలో నియోజకవర్గ సమస్యలపై మాట్లాడుతారని చెప్పారు. వేంపల్లి పట్టణంలో త్రాగునీటి సమస్య, రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కూడా ఆగిపోయాయని వీటన్నిటిని అసెంబ్లీలో జగన్ చర్చించినట్లయితే చంద్రబాబు సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేసే వారిని చెప్పారు. అలాగే వేంపల్లి పంచాయతీ ఈవో అవినీతికి పాల్పడ్డాడని చెప్పారు. గ్రామపంచాయతీ నిధులను దోచేశారని అన్నారు. ప్రజలు వీటన్నిటిని గమనించాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి చెప్పారు.
పులివెందులలోని సమస్యలు, పెండింగ్ పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటంలో ఎమ్మెల్యే జగన్ విఫలం చెందారు. సుమారు 60 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ఆయన అన్యాయం చేస్తున్నారు. ప్రజా సమస్యలను చర్చించకుండా ఇంట్లో భీష్మించుకొని కూర్చోవడం మంచిదికాదు. అసెంబ్లీకి వెళ్లటం ఇష్టం లేకపోతే శాసనసభ సభ్యత్వాన్ని గౌరవాన్ని వదులుకోవాలి. అన్ని విషయాలనూ ప్రజలు గ్రహిస్తున్నారు.- భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ
ఈ ఉగాది నుంచే పీ4 విధానం- అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం: సీఎం చంద్రబాబు
అమరావతి నిర్మాణాలకు మరో రూ.11 వేల కోట్లు! హడ్కో –సీఆర్డీఏ మధ్య ఒప్పందం