ETV Bharat / politics

'సీఎం రేవంత్‌ రెడ్డి ప్రోద్బలంతోనే - ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిపై దాడి జరిగింది' - Harish Rao about Koushik Reddy

Harish Rao on Koushik Reddy : ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై జరిగిన దాడిని ఖండించిన హరీశ్​రావు, ఎక్స్​ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రోద్బలంతో జరిగిన దాడి ఇది అని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2024, 2:28 PM IST

KTR on CM Revanth about Koushik Reddy
Harish Rao on CM Revanth about Koushik Reddy (ETV Bharat)

Harish Rao on CM Revanth about Koushik Reddy : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడిపై మాజీమంత్రి హరీశ్​రావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఎక్స్​ వేదికగా ట్వీట్​ చేశారు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం అంటూ ధ్వజమెత్తారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్​లోకి చేర్చుకోవడంతో పాటు, వారినే ఉసిగొల్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో జరిగిన దాడి ఇదని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని హరీశ్​రావు డిమాండ్​ చేశారు. రాళ్లు, గుడ్లు, టమాటాలతో తమ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద అరికపూడి గాంధీ మంది మార్బలంతో వెళ్లి దాడి చేయడం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందన్నది సుస్పష్టం ఉందని పేర్కొన్నారు.

ఇంటి మీదకు వస్తామని ప్రెస్​మీట్​లో ప్రకటించి, అనుచరులతో దాడి చేసినప్పటికీ నిలువరించడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ తీవ్రంగా విఫలమైందని విమర్శించారు. పట్టపగలు ప్రజాప్రతినిధి మీద జరిగిన ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరారు. దాడి చేసిన గాంధీని, అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

"ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం?. మా పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుని దాడి చేయడం దుర్మార్గం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గ చర్య. కాంగ్రెస్ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. సీఎం రేవంత్‌రెడ్డి ప్రోద్బలంతో జరిగిన దాడి ఇది. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలి. దాడిని నిలువరించడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ విఫలమైంది." - హరీశ్ రావు, మాజీ మంత్రి

ఇది కచ్చితంగా సీఎం చేయించిన దాడే : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయటాన్ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. పట్టపగలే ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి హత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారంటే రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డిని గృహ నిర్భంధంలో ఉంచి పోలీసుల సాయంతో అరికెపూడి గాంధీ గుండాలు రెచ్చిపోయి దాడులకు పాల్పడటమేమిటన్నారు. రాష్ట్రాన్ని ఫ్యాక్షనిజం, రౌడీయిజానికి అడ్డాగా మార్చేస్తుండటం చూస్తుంటే బాధేస్తుందన్నారు. ఇది కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన దాడేనని కేటీఆర్ మండిపడ్డారు.

గత కొన్ని రోజులుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై న్యాయపోరాటం చేస్తున్న కౌశిక్ రెడ్డిని ఈ ప్రభుత్వం టార్గెట్ చేసిందన్నారు. కావాలనే తనపై అక్రమ కేసులు, హత్యాయత్నాలకు పాల్పడి బెదిరించే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉడుత ఊపులకు బీఆర్ఎస్ బెదరదని కేటీఆర్ స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర చేస్తున్నారని ఆయనకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

పక్కా ప్లాన్​తోనే దాడి చేశారు : అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తానన్న కౌశిక్ రెడ్డిని గృహనిర్భంధంలో ఉంచిన పోలీసులు అరికెపూడి గాంధీని మాత్రం కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చేందుకు ఎలా అనుమతించారని కేటీఆర్ ప్రశ్నించారు. వందల మంది రౌడీలు కోడిగుడ్లు, రాళ్లతో దాడులు చేశారంటే పక్కా ముందస్తుగా ప్లాన్ చేసే ఈ దాడి చేశారని కేటీఆర్ అన్నారు. పూర్తిగా ప్రభుత్వం, పోలీసుల సహకారంతో కౌశిక్ రెడ్డిపై దాడి చేసే ప్రయత్నం జరిగిందన్నారు.

అక్రమ కేసులు, దాడులతో బెదిరించాలని ప్రయత్నిస్తే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదన్నారు. ఇందిరమ్మ పాలన, ప్రజా పాలన అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేపై ప్రభుత్వమే దాడి చేయించటమా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రశ్నిస్తే చాలు ప్రభుత్వం దాడులకు తెగబడుతోందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను కచ్చితంగా రాసి పెట్టుకుంటామని హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ఇంతకు మించి ప్రతిఘటన తప్పదని కేటీఆర్ స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.