CPI NARAYANA ON YS JAGAN COMMENTS: పోలీసుల మనోధైర్యం దెబ్బతీసేలా వైఎస్ జగన్ మాట్లాడకూడదని సీపీఐ నారాయణ అన్నారు. తిరుపతిలో నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి పోలీసులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం తప్పు అని హితవు పలికారు. అదే విధంగా వక్ఫ్ బిల్లుపై వైఎస్సార్సీపీ దొంగాట ఆడిందని నారాయణ విమర్శించారు. వైఎస్సార్సీపీ రాజ్యసభలో ఒకలా, లోక్‌సభలో మరోలా మద్దతిచ్చిందని చెప్పారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన నిరసనలు చేపడుతున్నట్లు తెలిపారు.
'తప్పు చేసినవారి బట్టలూడదీస్తాం' - పోలీసులపై జగన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు