ETV Bharat / politics

మీ రాజకీయాల కోసం కుటుంబ బంధాల మధ్య చిచ్చుపెట్టారు : హరీశ్​రావు - Harish Rao sensational comments - HARISH RAO SENSATIONAL COMMENTS

Harish Rao Fires on Congress : రోజుకో మాటగా రేవంత్​ రెడ్డి సర్కార్​ పాలన సాగుతోందని బీఆర్​ఎస్​ నేత, మాజీ మంత్రి హరీశ్​రావు విమర్శలు చేశారు. రైతు సురేందర్​ రెడ్డి మృతికి కారణం రుణమాఫీ కాకపోవడమేనని స్పష్టం చేశారు. తామేప్పుడు రాజకీయాల కోసం కుటుంబాల మధ్య చిచ్చు పెట్టలేదని అన్నారు.

Harish Rao Fires on Congress
Harish Rao Fires on Congress (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2024, 1:53 PM IST

Updated : Sep 8, 2024, 2:19 PM IST

BRS Leader Harish Rao Comments on Congress : రైతు సురేందర్​ రెడ్డి మృతికి కారణం రుణమాఫీ కాకపోవడమేనని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. రుణమాఫీకి రేషన్​ కార్డుతో సంబంధం లేదనటం అవాస్తవమని తెలిపారు. రుణమాఫీ పేరుతో రేవంత్​ రెడ్డి రాజకీయ క్రీడకు సురేందర్​ రెడ్డి బలయ్యారని పేర్కొన్నారు. ఆయన మృతి కాంగ్రెస్​ 9 నెలల పాలనకు పరాకాష్ఠ అని ధ్వజమెత్తారు. హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ 'మేము లిస్ట్​ ఇచ్చినా ఒక్క రైతును కూడా ఆదుకోలేదు. రోజుకో మాటగా రేవంత్​ పాలన సాగుతోంది. ఊసరవెల్లి కన్నా దారుణంగా రేవంత్​ తీరు ఉంది. రుణమాఫీ చేసింది రూ.15 వేల కోట్లే. ఇది రైతులను మోసం చేయడం కాదా? మీ రాజకీయాల కోసం కుటుంబ బంధాల మధ్య చిచ్చు పెట్టారు. పింఛన్​ రూ.2000 చేసి కుటుంబాలను బలోపేతం చేశారు కేసీఆర్​' అని తెలిపారు.

సురేందర్​ రెడ్డి సూసైడ్​ నోట్​లో తల్లి కూడా కారణం అని రాయడానికి దారి తీసింది రుణమాఫీ సమస్య అని మాజీ మంత్రి హరీశ్​రావు వివరించారు. ఒక రేషన్​ కార్డుపై తల్లీకుమారులు ఉంటే ఒక్కరికే రుణమాఫీ ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా? అని నిలదీశారు. వ్యవసాయ శాఖ అధికారులకు ఫేస్​ 3 లబ్ధిదారుల వివరాలు ఇవ్వలేదని, నేరుగా బ్యాంక్​కు ఇచ్చారని అన్నారు. పాస్​బుక్​, రుణ ఖాతా ఆధారంగా రుణమాఫీ చేయాలి కదా అని ప్రశ్నించారు.

నమ్మి ఓటేసినందుకా ఈ కోతలు : క్రాప్​ లోన్​ రెన్యూవల్​ చేయకపోతే రుణమాఫీ చేయకపోవడం దారుణమని మాజీ మంత్రి హరీశ్​రావు దుయ్యబట్టారు. నమ్మి ఓట్లు వేసినందుకు కోతలు పెడుతోంది ఈ ప్రభుత్వమని విమర్శించారు. గిరిజనేతర రైతులకు కూడా రుణమాఫీ అవ్వలేదని చెప్పారు. రూ.2 లక్షల రుణమాఫీపై అసలు సరిగా క్లారిటీ లేదని అన్నారు. సురేందర్​ రెడ్డిని కాంగ్రెస్​ ప్రభుత్వమే చంపిందని మాజీ మంత్రి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

"రుణమాఫీ కాకపోవడమే రైతు సురేందర్​ రెడ్డి మృతికి కారణం. రుణాఫీకి రేషన్​కార్డ్​తో సంబంధం లేదనటం అవాస్తవం. సురేందర్​ రెడ్డి మృతి మీ తొమ్మిది నెలల పాలనకు పరాకాష్ఠ. మేము లిస్ట్​ ఇచ్చినా ఒక్క రైతుని కూడా ఆడుకోలేదు. రుణమాఫీ చేసింది రూ.15 వేల కోట్లే. గిరిజనేత రైతులకు కూడా రుణమాఫీ అవ్వలేదు. రూ.2 లక్షల రుణమాఫీపై అసలు క్లారిటీ లేదు ఇప్పటికైనా రైతులకు క్షమాపణ చెప్పి రుణమాఫీ చేయండి. మా కాల్​ సెంటర్​కు లక్షకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఆ వివరాలు గవర్నర్​, ప్రభుత్వానికి అందిస్తాం." - హరీశ్​రావు, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే

నాడు ఎల్‌ఆర్‌ఎస్ ఉచితమని చెప్పి - నేడు ఫీజు వసూలు చేయడం దుర్మార్గం : హరీశ్​రావు - Harish Rao Letter To CM Revanth

"కాంగ్రెస్​ పాలనలో కర్షకులకు కష్టాలు - పంటలు పండించడం, విక్రయం కత్తిమీద సామే" - Harish Rao Letter to CM Revanth

Last Updated : Sep 8, 2024, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.