ETV Bharat / politics

జగన్‌ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది- కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుంది: పురందేశ్వరి - Purandeshwari Speech in NDA Meeting

Purandeshwari Speech in NDA Meeting: ఎన్డీఏ కూటమి 100 రోజుల్లో చేసిన పనులను ప్రజలకు తెలియజేయాలని బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తైన సందర్భంగా నిర్వహించిన సమీక్షలో ఆమె పాల్గొన్నారు. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు ఈ వంద రోజుల్లో ఎంతమేరకు నెరవేర్చామో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 18, 2024, 7:14 PM IST

purandeshwari_speech_in_nda_meeting
purandeshwari_speech_in_nda_meeting (ETV Bharat)

Purandeshwari Speech in NDA Legislative Party Meeting Meeting: ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం నెరవేర్చిన హామీలను ప్రజల్లోకి సోషల్ మీడియా, ద్వారా మరింతగా తీసుకువెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి (BJP State President Purandeshwari) అన్నారు. ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధిని కావాలని ఉద్దేశంతో ఎన్డీఏ కూటమిని గెలిపించారని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో వైఎస్సార్​సీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు, అక్రమాలు ప్రజలకు గుర్తు చేస్తూ మనం ప్రజలకు ఏం చేస్తున్నామో తెలియజేస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు. గడిచిన 100 రోజులు ఆర్థిక శాఖ ఏ విధంగా బలోపేతం చేయాలో సీఎం చంద్రబాబు 100 రోజులు నుంచి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.కేంద్రం కూడా రాష్ట్రానికి సహకరించడానికి అన్ని విధాలా ముందుకు వస్తుందని పురంధేశ్వరి స్పష్టం చేసారు.

జగన్‌ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది - కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుంది: పురందేశ్వరి (purandeshwari_speech_in_nda_meeting)

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశం జరిగింది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్​లో సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan), బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సహా కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతున్నందున చేపట్టాల్సిన కార్యక్రమాలపై భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 20 నుంచి 26 వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లి 100 రోజుల పాలనను వివరించేలా కార్యాచరణ రూపొందించారు.

చంద్రబాబు ఓపిక ఆశ్చర్యపరుస్తోంది - సీఎం నాయకత్వంలో పని చేయడం సంతోషం: పవన్​ కల్యాణ్​ - PAWAN KALYAN ABOUT CM CHANDRA BABU

కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఈ వంద రోజుల్లో ఎంత వరకు నెరవేర్చామో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ కూటమి 100 రోజుల్లో చేసిన పనులను ప్రజలకు తెలియజేయాలి. ఒక వైపు జగన్‌ రాష్ట్రాన్ని ఇబ్బందిపెట్టిన తీరు ప్రజలకు గుర్తు చేస్తూ మరో వైపు కూటమి చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎన్నికల్లో ప్రజలు అందించిన అద్భుతమైన విజయానికి రుణం తీర్చుకుంటాం. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తుంది.- పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు

వెయ్యి కోట్లతో అమరావతి రైల్వే లైన్ - పనులు వేగవంతం - New Amaravati Railway Line

వైఎస్సార్సీపీకి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా - జనసేనలో చేరనున్నట్లు వెల్లడి - BALINENI SRINIVAS REDDY RESIGN

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.