BJP Public Meeting At Saroornagar : తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యం అవుతుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలపై కిషన్ రెడ్డి సారథ్యంలోని బీజేపీ పోరాటం చేసిందని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతు, మహిళా, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని నడ్డా ఆక్షేపించారు. హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ తలపెట్టిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పలు అంశాలపై మాట్లాడారు. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
"రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తోంది. ప్రాంతీయ పార్టీలపై ఆధారపడిన పార్టీ హస్తం పార్టీ. బీజేపీతో నేరుగా తలపడ్డ ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. రేవంత్ సర్కారు ఏడాది పాలనలో అన్ని వర్గాలను మోసం చేసింది. ఆటో డ్రైవర్లకు 12 వేల రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసింది. ఎన్నికల సమయంలో ఆ పార్టీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. అన్నదాతలకు ఇవ్వాల్సిన రూ.15వేల రైతు భరోసా ఇవ్వలేదు. రైతు కూలీలకు 12 వేలు ఇస్తామని చెప్పి మాట తప్పింది. ప్రతి మహిళకు రూ.2500 ఇస్తామని చెప్పి ఇవ్వలేదు"- జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు
'దేశంలో నెహ్రూ తరవాత మూడోసారి ప్రధాని అయ్యింది నరేంద్ర మోదీ. నెహ్రూ మూడోసారి ప్రధాని అయినప్పుడు ప్రతిపక్షాలు లేవు. ప్రజల ఆశలను నిరాశకు గురి చేసి కాంగ్రెస్ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. 13రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. ఆరు రాష్ట్రాల్లో ఎన్డీఏ సార్ధ్యంలోని ప్రభుత్వాలు ఉన్నాయి. బీజేపీ ఆరు సార్లు గుజరాత్, నాలుగు సార్లు మధ్యప్రదేశ్, గోవా, హరియాణాల్లో హ్యాట్రిక్ కొట్టింది. ప్రతిపక్ష పార్టీలు ఏకమైనప్పటికీ జమ్మూ కశ్మీర్ లో బీజేపీ మంచి ఓట్లు, సీట్లు సాధించింది. కాంగ్రెస్ పరాన్న జీవి పార్టీ తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, బీహార్‌లో ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది. హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది' అని జేపీ నడ్డా తెలిపారు.
ప్రధానమంత్రితో రాష్ట్ర బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల భేటీ - అందరూ కలిసి అలా చేయాలని చెప్పిన మోదీ
అత్యధిక సభ్యత్వ నమోదు చేయించిన వారికే పదవులు : జేపీ నడ్డా - JP Nadda Review On BJP Membership