ETV Bharat / politics

'అంబేడ్కర్ జయంతి - ఆ మహానుభావుని సేవను స్మరించుకుందాం' - AMBEDKAR JAYANTI

అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పించిన చంద్రబాబు, పవన్ సహా పలువురు మంత్రులు- అంబేడ్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామన్న సీఎం

Ambedkar Jayanti
Ambedkar Jayanti (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 14, 2025 at 9:41 AM IST

2 Min Read

Ambedkar Jayanti Today: భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వంతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా, స్వాతంత్రోద్యమ వీరుడిగా, ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన భారతరత్న అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశసేవను స్మరించుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎప్పుడూ అప్రమత్తులై, విద్యావంతులై ఆత్మగౌరవంతో, ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుందిని చెప్పారన్నారు.

ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషిచేద్దామని విజ్ఞప్తి చేశారు. అంబేడ్కర్ కలలుగన్న సమాజాన్ని సాధించుకుందామన్నారు. దళితాభ్యుదయానికి అందరం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు.

అంబేడ్కర్ స్ఫూర్తిని భావితరాలకు అందిస్తాం: అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అంజలి ఘటించారు. మోదీ నేతృత్వంలో అంబేడ్కర్ స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారని వెల్లడించారు. కూటమి పాలనలో అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తామని పవన్ స్పష్టం చేశారు.

అసమానతలు లేని సమాజం కోసం: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. భారతీయ సమాజానికి అంబేడ్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుందన్నారు. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేడ్కర్ కృషి అమోఘమని కొనియాడారు. దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానమన్నారు. అసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం పరితపించారని గుర్తుచేశారు. అంబేడ్కర్ స్ఫూర్తితో ప్రజాసంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

అంబేడ్కర్ చేసిన కృషి చిరస్మరణీయం: సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, హక్కుల సాధనకు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని మంత్రులు డా. డోలా బాల వీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్ అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం, సమాజంలోని రుగ్మతలపై అంబేడ్కర్ తన చివరి శ్వాస వరకు పోరాడారని మంత్రి డోలా వీరాంజనేయస్వామి కొనియాడారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగ ఫలాలతో బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు.

అంబేడ్కర్ కలలు కన్న సమాజం కూటమి పాలనతోనే సాధ్యమన్నారు. భారత దేశ అగ్రగణ్య మేధావుల్లో ఒకరు బీఆర్ అంబేడ్కర్ అని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చెప్పారు. ఆధునిక భారత దేశ నిర్మాణంలో ఆయనది చాలా కీలక పాత్ర అని తెలిపారు. దేశంలోని పౌరులందరికీ సమానత్వం, గౌరవం కల్పించాలని అంబేడ్కర్ పరితపించారని గుర్తుచేశారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం నిరంతం పోరాటం చేసిన యోధుడు అంబేడ్కర్ అని కొనియాడారు. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా గళమెత్తిన ఉద్యమకారుడని చెప్పారు. అంబేడ్కర్ ఆశయాలు, ఆదర్శాలు నేటికీ ఎంతో ఆచరణీయమన్నారు.

'ఈ తరం బుద్ధుడు బీఆర్ అంబేడ్కర్' - అణగారిన వర్గాల ప్రతినిధిగా సమాజ సేవ!

RSSను 'ఆత్మీయంగా' చూసిన అంబేడ్కర్​ - గాంధీజీ కూడా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.