Retired IPS Officer Venkateswara Rao Fires On YS Jagan: రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తున్నట్టు భవిష్యత్తులో ఏ పార్టీలో చేరతానో చెప్పలేనని విశ్రాంత ఐపీఎస్ అధికారి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. అమలాపురం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ అధికారంలోకి రాకముందే కోడి కత్తి శ్రీనివాస్ బలైపోయారని ఈ సందర్భంగా తెలియజేశారు.
అతని జీవితాన్ని అన్యాయంగా చిదిమేశారని, భవిష్యత్తులో జగన్ బాధితులందరి తరఫున పోరాటం చేస్తానని వెంకటేశ్వరరావు వెల్లడించారు. జగన్ లాంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి మళ్లీ రాకూడదని ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. జగన్ అవినీతి, అరాచకాలు, విధ్వంసకర పాలనపై ప్రజలకు అవగాహన కల్పిస్తానని ఆయన అన్నారు.
రాష్ట్రానికి జగన్ ఓ ఉపద్రవం వంటివాడని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఎప్పటికీ అధికారంలోకి రాకుండా ప్రజలందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు జగన్ గురించి మాట్లాడుతూ ''నెవర్ ఎగెయిన్'' (never Again) అంటూ వ్యాఖ్యానించారు. జగన్‌తో సహా ఆ పార్టీలో మరికొంత నేతలు సైతం సభ్యతా సంస్కారాలు లేకుండా గతంలో విచక్షణారహితంగా ప్రవర్తించారని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఏబీ వెంకటేశ్వరరావు
'జగన్ రెడ్డీ నోరు అదుపులో పెట్టుకో - నేనేంటో 5 ఏళ్లలో నువ్వే చూశావ్'