యాదగిరి గుట్టలో పునఃప్రారంభమైన స్వామి వారి సేవలు - LAKSHMI NARASIMHA SWAMI POOJALU

తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో జయంతి ఉత్సవాలు నిన్నటితో ముగిశాయి. నేటి నుంచి స్వామి వారి సేవలు పునఃప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి సుదర్శన నరసింహ హోమం, శాశ్వత కల్యాణం, నిత్య, శాశ్వత బ్రహ్సోత్సవాలు, జోడుసేవలను పునరుద్ధరించారు. ఇవాళ ఆలయానికి వివిధ ప్రాoతాల నుంచి వచ్చిన భక్తులు ఆర్జిత సేవల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
(ETV Bharat)

Published : May 12, 2025 at 5:33 PM IST
1 Min Read