Pratidwani: రోజురోజుకీ ఆసక్తిగా మారుతోంది తమిళ రాజకీయ రంగం. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా రాజకీయ కాక తారస్థాయికి చేరుతోంది. ఒకవైపు త్రిభాష విధానం, డిలిమిటేషన్‌పై వాదోపవాదాలు. మరోవైపు కేంద్రం -రాష్ట్రం మధ్య టెన్షన్ టెన్షన్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తోంది తమిళనాడు. డీఎంకే, అన్నాడీఎంకే, భాజపాతో పాటు సినీహీరో విజయ్ ప్రారంభించిన తమిళగ వెట్రి కళగం - టీవీకే కొత్తలెక్కలు తెరపైకి తెస్తున్నాయి. పొత్తులు, సామాజిక సమీకరణాలు, సంక్షేమ పథకాలు, యువతను ఆకర్షించే ప్రకటనలతో రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది. తమిళనాడు ఇంత ముందుగానే రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల రంగంలోకి దిగిపోవడానికి కారణాలు ఏమిటి? ద్రవిడగడ్డపై కమల వికాసానికి భాజపా ప్రయత్నాలు ఎంతవరకు ఫలించే అవకాశముంది? అసలు తమిళ ప్రజలు ఎన్నికల గురించి ఏం అనుకుంటున్నారు? ఇదేఅంశంపై నేటి ప్రతిధ్వని చర్చ చేపట్టింది.
1) మిళనాడు రాజకీయాలు ఎన్నికలకు ఏడాది ముందుగానే ఎందుకు ఇంత వేడెక్కిపోయాయి? ఈ ముందస్తు హడావిడిలో ఏ పార్టీ ముందంజలో ఉంది?
2) అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు 2026లో డీఎంకేకి ధీటైన పోటీ ఇవ్వగలదా? ఈ కూటమి కూడికలతో అన్నాడీఎంకే తిరిగి బలపడే అవకాశం ఎంతవరకు ఉంది?
3) ఈసారి తమిళనాట ఆకర్షిస్తోన్న కొత్తపార్టీ హీరో విజయ్ స్థాపించిన టీవీకే. యువ ఓటర్లు భారీగానే అటుచూస్తున్నారని అంటన్నారు. ఆ పార్టీ ప్రభావం ఎలా ఉండొచ్చని మీ అంచనా?
4) తమిళనాడు అసెంబ్లీ సీట్ల సంఖ్య 234. అందులో మ్యాజిక్ మార్క్‌కు కావాల్సింది... 118. DMK , AIDMK, TVK వీళ్లలో ఎవరినైనా ఈసారి ఈ నంబర్‌ను చేర్చే అంశాలు ఏమిటి?
5) హిందీ వర్సెస్ తమిళం, డిలిమిటేషన్ వివాదం.. గవర్నర్‌తో ఫైట్... ఇవన్నీ స్టాలిన్ సర్కార్‌కు 2026 ఎన్నికల్లో ఏ మేరకు లాభిస్తాయి?
6) వ్యక్తులపరంగా చూస్తే ఈసారి ఎన్నికల్లో ఫేస్ ఆఫ్ ది పాలిటిక్స్‌గా నిలవబోతున్న పర్సనాలటీస్ ఎవరు? అళగిరి పాత్ర ఏమిటి?
7) ప్రధానమంత్రి మోదీ అంటే... చాలామంది ప్రాంతీయ పార్టీల నాయకులు భయపడుతున్నారు. కొంతమంది సయోధ్య చేసుకుంటున్నారు. కానీ... తమిళనాడులో పెద్దగా బలమే లేని BJPతో స్టాలిన్ ఎం దుకు తలపడుతున్నట్లు? దాని వెనక ఏమైనా వ్యూహం ఉందా?
8) హీరో విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ విడిగా, అన్నాడీఎంకే-BJP కూటమి విడిగా పోటీ చేస్తే ఓట్లచీలిక DMKకి లాభించే అవకాశం లేదా? తమిళులు BJPని ఏమేరకు ఆదరించే అవకాశముంది ?
ఈ అంశాలపై సీనియర్ పాత్రికేయులు గాలి నాగరాజ, రాజకీయ విశ్లేషకులు మామిడి గిరిధర్ తమ అభిప్రాయాలు వెల్లడించారు.