ETV Bharat / opinion

పిల్లల శారీరక, మానసికారోగ్యంపై టెక్ ట్రెండ్​ ప్రభావాలు - CHILDREN SOCIAL MEDIA

సోషల్ మీడియాతో కొత్త అవకాశాలు, సృజనాత్మకతకు పదును పెట్టడం సరే - ఆ సాలెగూడులో దారితప్పుతోన్న పసివాళ్లు ఎందరో

Pratidhwani
pratidhwani-on-children-social-media (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 5, 2025 at 1:34 PM IST

2 Min Read

Pratidhwani : ఫోన్‌ లేకుండా పొద్దు పోవడం లేదు. సోషల్‌ మీడియాలో విహరించకుండా రోజు గడవడం లేదు. రోజురోజుకీ అంతటా ఇదే ట్రెండ్. ఈ విషయంలో పెద్దల సంగతి ఏమో గానీ పిల్లల విషయమే ఇప్పుడు ఆలోచనలో పడేస్తోంది. సోషల్ మీడియా వారికి దోస్త్‌లా మారుతోందా డేంజర్‌లోకి నెడుతోందో అర్థం కావడం లేదు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, వంటి ఎన్నో యాప్‌లు వారి రోజువారీ జీవితంలో భాగమైపోయాయి.

నిజానికి ఇది కొందరికి కొత్త అవకాశాలు చూపిస్తోంది. సృజనాత్మకతకు పదును పెడుతోంది. మరోవైపు చూస్తే ఫోన్ ఇంటర్నెట్ సాలెగూడులో చిక్కి దారితప్పుతోన్న పసివాళ్లు ఎందరో ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? పిల్లలు, ఇంటర్నెట్, సోషల్‌మీడియాల విషయంలో తల్లిదండ్రులేం గమనించుకోవాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు ఇండియన్ సర్వర్స్ సీఈవో సాయి సతీష్‌, చిన్నపిల్లల మానసిక ఆరోగ్య నిపుణులు డా. మానస

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల వాడకం మన పిల్లల్ని మరింత స్మార్ట్‌గా చేస్తోందా? దారి తప్పి స్తోందా? ఈ విషయంలో ప్రస్తుత టెక్నాలజీ ట్రెండ్స్‌ ఏం చెబుతున్నాయి? దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చిన్నారులకు సోషల్‌మీడియాపై చర్చిస్తున్నారు. కొందరు నిషేధించాలని, అలాచేస్తే క్రియేటివిటీకి దెబ్బ అని మరికొందరు. మరి మానసిక వైద్యులు ఏ వైపు?

సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని 'వాలంటైన్స్ డే స్టంట్స్' - లవ్​బర్డ్స్ ఏం చేస్తున్నారంటే!

అవసరానికి సోషల్ మీడియా వాడకం మితిమీరి అతిగా ఆధారపడడం ఈ రెండిటి మధ్య తేడాను తల్లిదండ్రులు ఎలా గమనించుకోవాలి? దీనికి వాళ్లేం చేయవచ్చు? పిల్లలు సోషల్‌మీడియాలో ఇతరులతో కనెక్ట్ అవ్వడం వల్ల కలుగుతున్న ప్రయోజనాలు ఏంటి? అది స్థాయి దాటినప్పుడు వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? చిన్న పిల్లల సోషల్‌మీడియా వినియోగంలో మరో 2 కీలక సమస్యన్నాయి. ఒకటి గోప్యత కు ముప్పు, 2, సైబర్‌ బుల్లీయింగ్. ఈ విషయాల్లో ప్రస్తుతం ఏం జరుగుతోంది?

పిల్లలకు స్మార్ట్ ఫోన్‌, సోషల్‌మీడియా వాడకుండా ఆపలేని పరిస్థితుల్లో వాళ్లు అఫెండ్ కాకుండా జాగ్రత్తలు చెప్పడం, పరిమితులు విధించడం సాధ్యమేనా? అది ఎలా చేయాలి? ఈ పరిస్థితుల్లో పిల్లలు సోషల్ మీడియా పాజిటివ్‌గా వాడుకోవడం కోసం ఏం చేయవచ్చు. అందుకోసం ఏరకమైన టెక్ సాధనాలు లేదా యాప్‌లు సహాయపడతాయి? ఇప్పుడు వచ్చే వేసవి సెలవుల్లో ఈ వాడకం విపరీతంగా పెరిగే తరుణంలో పిల్లలకు సోషల్ మీడియా వాడకంలో ఆరోగ్యకరమైన అలవాట్లు ఎలా నేర్పించవచ్చు అనే అంశాల గురించి పూర్తి సమాచారం ఈ ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం.

పిల్లల చేతిలో ఫోన్​- యాప్స్​ వల్ల డబ్బులు మాయం- గందరగోళంలో పేరెంట్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.