ETV Bharat / opinion

సోషల్ మీడియా పోస్టులు - ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - SOCIAL MEDIA POSTS

డేంజర్‌బెల్స్ మోగిస్తున్న సోషల్‌ మీడియా పోస్ట్‌లు - సోషల్ మీడియా పోస్టుల వల్ల అమెరికాలో రద్దవుతున్న వీసాలు

Prathidwani  Debate on Social Media posts
Prathidwani Debate on Social Media posts (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 11, 2025 at 8:48 PM IST

2 Min Read

Prathidwani : సోషల్‌ మీడియా పోస్ట్‌లు డేంజర్‌బెల్స్ మోగిస్తున్నాయి. ఇకపై పోస్ట్‌లు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే మేలు. స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పడంలో తప్పులేదు. గ్రామ సర్పంచ్‌ నుంచి అమెరికా అధ్యక్షుడి వరకు, అనకాపల్లి నుంచి అట్లాంటిక్ వరకు అందరినీ ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. కానీ అది హద్దు మీరితే మాత్రం ఇప్పుడు ఇబ్బందులు తప్పవు. కారణాలు కళ్లముందే కనిపిస్తున్నాయి. అమెరికాలో కేవలం సోషల్ మీడియా పోస్టుల వల్ల వీసాలు రద్దవుతున్నాయి. దారితప్పిన, ఫేక్‌, ప్రాపగాండ పోస్టులపై తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు, అరెస్టులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనకు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సోషల్‌ మీడియాలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ చేపట్టింది.

1) సోషల్‌మీడియా పోస్టులు పెట్టే ముందు కూడా ఆలోచించుకోవాలా? ఇంతవరకు ఏమో గానీ, ఇకపై ఒకటికి రెండుసార్లు ఆలోచించడం ఎందుకు ముఖ్యం ఇప్పుడు?

2) అమెరికాలో సోషల్ మీడియా పోస్టుల వల్ల వీసాలు రద్దవడం సాధారణ నెటిజన్లు అందరికి ఒక హెచ్చరిక అనుకోవచ్చా? ఇది స్వీయ నియంత్రణ గురించి ఏం చెబుతుంది?

3) అమెరికాలో కావొచ్చు. తెలుగురాష్ట్రాల్లో కావొచ్చు. ఏవో చిన్నచిన్న సోషల్‌మీడియా పోస్టులు ఇప్పుడు పెద్దపెద్ద విషయాలుగా ఎందుకు మారుతున్నాయి?

4) ప్రభుత్వ పరమైన , దర్యాప్తు సంస్థలు మన సోషల్‌మీడియాను అకౌంట్‌లను ఎలా జల్లెడ పడ తాయి. ఒక పోస్ట్‌ మూలాల్ని ఎలా ట్రాక్ చేస్తారు. ఏ అంశాలు వారు పరిశీలిస్తారు?

5) రెండు తెలుగురాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఫేక్, ప్రోపగాండ పోస్టులు కూడా చర్చ, వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటున్నాయి. వాటికి సంబంధించి సైబర్ చట్టాలు, సెక్షన్లు ఏం చెబుతున్నాయి?

6) సోషల్‌మీడియాలో అపరిమితమైన స్వేచ్ఛ ఉంది అనుకునే వారికి కాస్త సంయమనం అవసరం అని చెప్పడంలో అమెరికా, భారత్‌ల విధానాల నుంచి మనం ఏ గుణపాఠాలు నేర్చుకోవచ్చు?

7) ఈ మధ్య AIతో ఫేక్‌పోస్టులు, ప్రచారాలు కూడా కలవర పెడుతున్నాయి. ఇలాంటి వాటి విష యంలో సోషల్‌మీడియా వేదికల బాధ్యత ఏమిటి? వాళ్లు ఏం చేయాలి?

8) సోషల్‌మీడియా అకౌంట్‌లు ఉన్నాయి కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరించి కేసుల పెడితే నోమో భావప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు అనడం ఎంత వరకు సబబు?

ఈ మధ్య AIతో ఫేక్‌పోస్టులు, ప్రచారాలు కూడా కలవర పెడుతున్నాయి. ఇలాంటి వాటి విష యంలో సోషల్‌మీడియా వేదికల బాధ్యత ఏమిటి? వాళ్లు ఏం చేయాలి? ఏ అంశాలు వారు పరిశీలిస్తారు? అనే విషయాలపై సైబర్‌ టెక్నాలజీ నిపుణులు నలమోతు శ్రీధర్, సీడాక్ కోల్‌కతా సెంటర్ విభాగాధిపతి డా. సీహెచ్‌ మూర్తిలు పాల్గొని వారి అభిప్రాయాలు వెల్లడించారు.

పిల్లల శారీరక, మానసికారోగ్యంపై టెక్ ట్రెండ్​ ప్రభావాలు

ప్రపంచం, మార్కెట్ల సంగతి సరే - సగటు అమెరికా పౌరుడి పరిస్థితేంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.