Pratidwani: వర్షాలు దంచి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. భారత వాతావరణ విభాగం -ఐఎండీ ఈసారి జోరు వానలంటూ పదేపదే చెబుతునే ఉంది. కానీ వర్షాలతో పాటు వచ్చే వరద ముంపు ఎదుర్కోవడాని కి మనం సిద్ధంగా ఉన్నామా? గతేడాది ఉభయ తెలుగురాష్ట్రాల్లో వర్షాకాలం బీభత్సాలు, చేసిన గాయాల నుంచి ఎంత వరకు పాఠాలు నేర్చుకున్నాం? వ్యక్తిగతంగా అయితే పగిలిన ఇంటిగోడల కు సిమెంట్ వేసుకుంటాం. తేమ చేరే ప్రాంతాల్లో వాటర్ ప్రూఫింగ్, దోమల బెడద లేకుండా అనేక జాగ్రత్త లు తీసుకుంటాం. కానీ వ్యవస్థలపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల మాటేంటి? డ్రెయన్లు, నాలాల పూడిక తీత, వరద నివారణ నిర్మాణాలు ఎంత వరకు వచ్చా యి? గతేడాది హైదరాబాద్, విజయవాడ పరిస్థితులు చూసిన నిపుణులు ఈ వర్షాకాలం సన్నద్ధతపై ఏం అంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
ముమ్మరమైన వర్షకాలం ముందున్నాం. ఐఎండీ అంచనాలు, గతేడాది వర్షాకాలం అనుభవాలు అన్నీ కళ్లముందే ఉన్నాయి. ఐతే ఈ వర్షాకాలాన్నిఎదుర్కొనే సన్నద్ధతలో మనం ఎక్కడున్నాం? వర్షాకాలం అనే కాదు గట్టిగా ఓ పావుగంటో, అరగంటో వాన కొట్టిందంటేనే హైదరాబాద్‌లో ఎప్పుడూ హైరానానే. భారీవర్షాలైతే ఇక చెప్పక్కర్లేదు. ఈసారైనా సన్నద్ధత ఎలా కనిపిస్తోంది?
బుడమేరు వద్ద సిసివాల్, మున్నేరు వద్ద రిటైనింగ్ వాల్స్ నిర్మాణం ఎంతవరకు పూర్తయింది, వరదలను పూర్తిస్థాయిలో నియంత్రించడంలో వాటి పాత్ర ఏమిటి? అది హైదరాబాద్ కావొచ్చు.. విజయవాడ కావొచ్చు.. మరోచోటు కావొచ్చు.. వర్షాకాలంలో స్థానిక సంస్థలు, ప్రభుత్వాలు వరద నిర్వహణకు తప్పనిసరిగా పాటించాల్సిన చర్యలేంటి?
వర్షకాలం సన్నద్ధత నుంచి వరదల నిర్వహణ వరకు వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వ యం ఎలా ఉండాలి? ఈ విషయంలో మెరుగుదలకు ఏం చేయవచ్చు? వర్షాకాలం, వరదల నిర్వహణలో ప్రపంచవ్యాప్తంగా అలానే మన దేశంలో నగరాలకు సంబంధించి ఉత్తమ నమూనాలు ఏమైనా ఉన్నాయా? వాటి నుంచి ఏం స్వీకరించవచ్చు?
వర్షాకాలం అనగానే విజయవాడకు ముంపు సమస్యతో పాటు కొండచరియల విరిగిపడే ఘటనలు కళ్లకు ముందు కదలాడతాయి? వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం? విపత్తు నిర్వహణలో ప్రజల భాగస్వామ్యాన్ని ఎలా పెంపొందించాలి? వర్షాకాలంలో ప్రతిఇంటిలో వరదలు, ముంపువంటి విపత్తుల్ని ఎదుర్కోవడానికి ఎలాంటి సన్నద్ధత ఉండాలి?
ఈ చర్చలో ప్రముఖ పర్యావరణవేత్త ప్రొ. టి. శ్రీకుమార్, ప్రముఖ ఇంజినీరింగ్ నిపుణులు, జేఎన్‌టీయూ -హెచ్ విశ్రాంత ఆచార్యులు ప్రొ. కేఎం లక్ష్మణరావులు పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
పసిమొగ్గల పాలిట మృత్యుపాశంగా మారుతున్న కన్నవారు - ఎందుకు?
ఏళ్లు గడుస్తున్నా - వ్యవసాయోత్పత్తుల ధరలపై సరైన నియంత్రణ ఎక్కడ?