ETV Bharat / offbeat

టేస్టీ టేస్టీ "గోధుమ రవ్వ బన్​ దోశ" - పప్పులు నానబెట్టాల్సిన పనిలేదు - నిమిషాల్లో రెడీ!

-అతి తక్కువ పదార్థాలతో రుచికరమైన టిఫెన్​ రెడీ -కేవలం నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్​ చేసుకోవచ్చు!

Wheat Rava Bun Dosa
Wheat Rava Bun Dosa (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 5, 2025 at 5:11 PM IST

3 Min Read
Choose ETV Bharat

Wheat Rava Bun Dosa: గోధుమ రవ్వ చాలా మంది ఇళ్లలో ఉంటుంది. ఈ రవ్వతో మెజార్టీ పీపుల్​ ఉప్మా , ఇడ్లీ, దోశలు అంటూ రకరకాల వెరైటీలు చేసుకుంటుంటారు. అయితే కేవలం ఇవి మాత్రమే కాకుండా బన్​ దోశలు కూడా వేసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. బ్రేక్​ఫాస్ట్​ చేయడానికి ఇడ్లీ లేదా దోశ పిండి లేనప్పుడు ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది. కేవలం నిమిషాల్లో దీనిని ప్రిపేర్​ చేసుకోవచ్చు. మరి లేట్​ చేయకుండా ఈ గోధుమరవ్వ బన్​ దోశను ఎలా ప్రిపేర్​ చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

Wheat Rava
Wheat Rava (ETV Bharat)

కావలసిన పదార్థాలు:

  • గోధుమరవ్వ - 1 కప్పు
  • పెరుగు - 1/2 కప్పు
  • నూనె - 2 టేబుల్​ స్పూన్లు
  • ఆవాలు - అర టీ స్పూన్​
  • జీలకర్ర - 1/2 టీ స్పూన్
  • మినప్పప్పు - అర టీ స్పూన్​
  • శనగపప్పు - అర టీ స్పూన్​
  • ఉల్లిపాయ - 1 చిన్నది
  • పచ్చిమిర్చి - 2
  • కొత్తిమీర - కొద్దిగా
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • వంట సోడా - చిటికెడు
  • ఉప్పు - రుచికి తగినంత
  • నూనె లేదా నెయ్యి - దోశలు వేయడానికి తగినంత
Curd
Curd (Getty Images)

తయారీ విధానం:

  • ఓ బౌల్​లోకి గోధుమరవ్వ, పెరుగు, కప్పు నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి కనీసం పావు గంట సేపు నానబెట్టాలి.
  • 15 నిమిషాల తర్వాత మిక్సీజార్​ తీసుకుని నానిన రవ్వ, కొద్దిగా వాటర్​ పోసి వీలైనంత మెత్తగా గ్రైండ్​ చేసుకుని మిక్సింగ్​ బౌల్​లోకి తీసుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి పాన్ పెట్టి​ నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పపు, శగనపప్పు వేసి దోరగా వేయించుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసి ఓ నిమిషం పాటు వేయించి స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • ఈ తాలింపును గోధుమ రవ్వ మిశ్రమంలో వేసుకుని, రుచికి తగినంత ఉప్పు, వంటసోడా వేసి బాగా కలపాలి.
  • పిండిని దోశల పిండిలాగా జారుడుగా కలుపుకోవడానికి తగినంత నీరు పోయాలి. పిండి మరీ గట్టిగా లేదా మరీ పలుచగా ఉండకూడదు. బాగా కలిపిన తర్వాత 15-20 నిమిషాలు పక్కన పెట్టండి.
  • స్టవ్​ ఆన్​ చేసి లోతు ఎక్కువగా ఉన్న పెనం పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత స్టవ్​ను మీడియం ఫ్లేమ్​లో పెట్టి ఒక గరిటెడు పిండిని తీసుకొని పెనం మధ్యలో మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా గుండ్రంగా వేయండి. బన్ దోశ సాధారణ దోశల కంటే కొంచెం మందంగా ఉంటుంది.
  • దోశ చుట్టూ కొద్దిగా నూనె లేదా నెయ్యి వేయండి. మూత పెట్టి బంగారు రంగులోకి వచ్చేవరకు కాల్చుకోవాలి. ఆ తర్వాత రెండో వైపుకు తిప్పి కాల్చండి. దోశను ఎక్కువసేపు కాల్చకుండా రెండు వైపులా కొద్దిగా రంగు మారగానే తీసేయండి. ఎక్కువసేపు కాల్చితే గట్టిగా వచ్చే అవకాశం ఉంది.
  • వేడి వేడి గోధుమరవ్వ బన్ దోశలను సాంబార్, చట్నీ లేదా మీకు ఇష్టమైన ఇతర సైడ్ డిష్​లతో సర్వ్ చేసుకుంటే సరి.
Bun Dosa
Bun Dosa (ETV Bharat)

టిప్స్​:

  • లావుగా ఉండే గోధుమరవ్వ బదులు సన్నగా ఉండేది ఎంచుకుంటే బన్​ దోశలు మరింత రుచిగా వస్తాయి.
  • పుల్లటి పెరుగును వాడటం వల్ల దోశలు సాఫ్ట్​గా రావడంతో పాటు ప్రత్యేకమైన రుచి లభిస్తుంది.
  • కొన్నిసార్లు కొద్దిగా శనగపిండి లేదా మైదా కలపడం వల్ల దోశలకు మంచి బైండింగ్ వస్తుంది.
  • దోశ వేసిన తర్వాత మూత పెట్టడం వల్ల అది లోపల బాగా ఉడుకుతుంది. మెత్తగా ఉంటుంది.
Wheat Rava Bun Dosa
Wheat Rava Bun Dosa (ETV Bharat)

పాల్వంచ టిఫెన్ సెంటర్​​ "పల్లీ చట్నీ" - చట్నీ కోసమే అక్కడ టిఫెన్ తింటారు! - ఇలా ప్రిపేర్ చేసుకోండి!

చల్లచల్లని "మామిడికాయ మజ్జిగ పులుసు" - ట్రెడిషనల్ టేస్ట్, ట్రెండీ లుక్​లో - 5 నిమిషాల్లో రెడీ!