Wheat Flour Mysore Bajji in Telugu : ఉదయాన్నే హోటల్స్‌లోకి వెళ్లినప్పుడు వేడివేడి మైసూర్ బజ్జీలు తినాలని చాలా మందికి అనిపిస్తుంది. కానీ, మైదాతో చేసినవి ఆరోగ్యానికి మంచివి కావనే ఆలోచనతో కొంతమంది తినకుండా ఉంటారు. అలాంటి వారు ఇక్కడ చెప్పిన విధంగా ఇంట్లో గోధుమ పిండితో మైసూర్ బజ్జీలు ట్రై చేయండి. ఈ మైసూర్ బోండాలు మైదాతో చేసిన వాటి కంటే ఎంతో రుచిగా ఉంటాయి. ఒక్కసారి ఇలా గోధుమ పిండితో బజ్జీలు చేస్తే మళ్లీ మళ్లీ ఇలానే తయారు చేస్తారు. మరి టేస్టీ గోధుమ పిండి బజ్జీలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
"మసాలా వడ" మ్యాజిక్ ఇదే! - ఇదొక్కటి కలిపితే క్రంచీగా వస్తాయి!

కావాల్సిన పదార్థాలు:
- గోధుమపిండి - 400 గ్రాములు
- పెరుగు - 1 కప్పు
- టీస్పూన్ - వంటసోడా
- ఉప్పు - రుచికి సరిపడా
- బొంబాయి రవ్వ - 2 టేబుల్‌స్పూన్లు
- పంచదార - 1 టీస్పూన్
- టీస్పూన్ - జీలకర్ర
- పచ్చిమిర్చి - 2
- 2 టేబుల్‌స్పూన్లు - పచ్చికొబ్బరి సన్నని పలుకులు
- కరివేపాకు - 2
- డీప్‌ఫ్రైకి సరిపడా - నూనె

తయారీ విధానం:
- ముందుగా ఓ బౌల్లోకి కప్పు పెరుగు, టీస్పూన్ వంటసోడా వేసి బాగా కలపండి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, పంచదార, 2 టేబుల్‌స్పూన్లు బొంబాయి రవ్వ (దీని వల్ల రుచి పెరుగుగుతుంది) వేసి బాగా కలపండి.
- ఆపై గోధుమపిండి వేసి తడిపొడిగా కలపండి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా జారుగా కలుపుకోవాలి. ఈ పిండిని 5 నిమిషాల పాటు బాగా బీట్ చేయండి. ఇలా బీట్ చేసిన పిండిని గంటపాటు పక్కన పెట్టుకోవాలి.

- అనంతరం పిండిలో టీస్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి సన్నని తరుగు, 2 టేబుల్‌స్పూన్లు పచ్చికొబ్బరి సన్నని పలుకులు, కరివేపాకు తరుగు వేసి 2 నిమిషాలపాటు బాగా బీట్ చేయండి. ఎక్కువసేపు బీట్ చేయడం వల్ల బజ్జీలు నూనెలో వేసినప్పుడు పేలవు.
- ఇప్పుడు స్టవ్ వెలిగించి లోతుగా ఉండే కడాయి పెట్టి డీప్‌ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. బోండాలు లోతుగా ఉండే కడాయిలో వేస్తేనే గుండ్రంగా వస్తాయి.

- ఆయిల్ బాగా కాగిన తర్వాత మంటను సిమ్‌లో పెట్టండి. ఇప్పుడు చేతిని నీళ్లలో ముంచి పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ బోండాలుగా వేయాలి.
- కడాయిలో సరిపడా బోండాలు వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి గరిటెతో రౌండ్‌గా తిప్పుతూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి.
- బోండాలు కాస్త దోరగా వేయించుకున్న తర్వాత హై ఫ్లేమ్‌లో అరనిమిషంపాటు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చివరిగా హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవడం వల్ల బజ్జీలకు ఎక్కువ ఆయిల్ పట్టదు.
- ఈ గోధుమపిండి బోండాలు కాస్త రంగు ఎక్కువగానే ఉంటాయని గుర్తుంచుకోండి. ఇలా పిండి మొత్తాన్ని మరొకసారి బోండాలుగా వేసుకుని కాల్చుకోవాలి.
- అంతే ఇలా ఈజీగా చేసుకుంటే సూపర్ టేస్టీ గోధుమపిండి బజ్జీలు మీ ముందుంటాయి.

- వేడివేడిగా ఈ బజ్జీలను పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే సరి!
- ఈ బజ్జీలు పైన క్రిస్పీగా, లోపల గుల్లగా ఎంతో రుచిగా ఉంటాయి. ఇంట్లో వాళ్లు ఒక్కసారి తింటే మళ్లీ ఇలానే చేయమని అడుగుతారు.
"పొరుగింటి పుల్లగూర" రుచి ఎక్కువ అంటారు కదా?! - ఆ రెసిపీ ఇదేనండీ - మీరూ ట్రై చేయండి!
హోటల్ పునుగుల టేస్ట్ సీక్రెట్ ఇదే! - ఈ టిప్స్ పాటిస్తూ పిండి కలిపితే రుచిగా ఉంటాయి!