ETV Bharat / offbeat

పుచ్చకాయతో జ్యూస్ రొటీన్ - ఇలా "స్లష్" చేసుకొని తాగండి! - ఒక్కో గుటక వేస్తుంటే మజా వస్తుంది! - HEALTHY SUMMER DRINK

పుచ్చకాయతో అద్దిరిపోయే సమ్మర్​ రిఫ్రెషింగ్ డ్రింక్ - ఇలా చేసి ఇస్తే పిల్లలు ఒకటికి రెండు గ్లాసులు తాగుతారు!

Watermelon Slush
Watermelon Slush (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 29, 2025 at 4:13 PM IST

3 Min Read

How to Prepare Chat Pata Watermelon Slush : రోజురోజుకి ఎండలు పెరిగిపోతున్నాయి. ఉదయం 9 దాటకముందే ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడం కోసం శరీరానికి చలువనిచ్చే ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకుంటుంటారు. మెజార్టీ పీపుల్ కొబ్బరి నీళ్లు, మజ్జిగ తాగడంతో పాటు పుచ్చకాయను తింటుంటారు. అయితే, వేసవిలో విరివిగా లభించే పుచ్చకాయని ఎప్పటిలా నేరుగా తినడం, జ్యూస్ చేసుకొని తాగడం కాకుండా ఈసారి వెరైటీగా ట్రై చేయండి. అదే, "చట్ పటా వాటర్ మెలన్ స్లష్". ఇదొక బెస్ట్ సమ్మర్​ రిఫ్రెషింగ్ డ్రింక్. నార్మల్​గా చేసుకునే జ్యూస్ కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్లష్​ని ఒక్కో గుటక సిప్ చేస్తుంటే ఆ కిక్కే వేరబ్బా! స్లష్ ఇచ్చే అనుభూతి జ్యూస్​తో రాదంటే నమ్మండి. పైగా దీన్ని సింపుల్​గా తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

Watermelon Slush
Watermelon (Getty Images)

తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ :

  • పుచ్చకాయ ముక్కలు - మూడు కప్పులు
  • ఐస్ క్యూబ్స్ - 8 నుంచి 10
  • చాట్ మసాలా - అరటీస్పూన్
  • వేయించిన జీలకర్ర పొడి - అరటీస్పూన్
  • ఉప్పు - పావుటీస్పూన్
  • తేనె - 4 టీస్పూన్లు
  • పుదీనా ఆకులు - 10 నుంచి 15
  • నిమ్మరసం - ఒక టేబుల్​స్పూన్

ఇదొక్కటి వేసి "పుచ్చకాయ జ్యూస్" చేసుకోండి - జ్యూస్ సెంటర్​ని మించిన టేస్ట్​తో భలేగా ఉంటుంది!

Watermelon Slush
Honey (Getty Images)

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా బాగా పండినటువంటి ఒక తాజా పుచ్చకాయను ఎంచుకోవాలి. ఆపై దాన్ని సగానికి కట్ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఓ భాగాన్ని తీసుకుని మళ్లీ రెండు ముక్కలుగా కోసుకోవాలి. ఆ తర్వాత పుచ్చకాయ లోపలి భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీలైనంత వరకు గింజలను తీసేసుకోవాలి.
  • మూడు కప్పుల పరిమాణంలో చిన్న సైజ్​లో పుచ్చకాయ ముక్కలను కట్ చేసుకొని, గింజలు తీసేసుకోవాలి.
  • ఆపై వాటిని ఒక బౌల్​లోకి తీసుకొని కనీసం 2 నుంచి 3 గంటల పాటు డీఫ్రిడ్జ్​లో ఉంచాలి.
Chat Pata Watermelon Slush
Watermelon Slush (ETV Bharat)
  • అనంతరం బ్లెండర్ తీసుకొని అందులో ఐస్​ క్యూబ్స్, డీఫ్రిడ్జ్​లో ఉంచిన పుచ్చకాయ ముక్కలు, చాట్ మసాలా, వేయించిన జీలకర్ర పొడి, ఉప్పు, తేనె, పుదీనా ఆకులు, నిమ్మరసం ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని హై స్పీడ్​లో బ్లెండ్ చేసుకోవాలి.
  • ఇలా బ్లెండ్ చేసుకోవడం వల్ల పుచ్చకాయ ముక్కలు మంచు ముక్కల్లా కొంతమేర చితుకుతాయి. మరికొంత జ్యూస్ అవుతుంది.
  • మిశ్రమం మొత్తం చక్కగా బ్లెండ్ అయ్యాక వెంటనే సర్వింగ్ గ్లాసులలోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కూల్​ కూల్​గా కమ్మని "పుచ్చకాయ స్లష్" రెడీ!
  • అనంతరం ఐసీ ఐసీగా ఉండే ఈ స్లష్​ని స్ట్రా వేసుకొని సిప్ బై సిప్ చేస్తుంటే అమేజింగ్​గా ఉంటుంది.
  • మరి, నచ్చితే మీరూ ఓసారి ఈ సమ్మర్​లో మధ్యాహ్నం వేళ ఇలా వాటర్ మెలన్ స్లష్ ప్రిపేర్ చేసుకొని తాగి చూడండి. సరికొత్త టేస్ట్​ని ఎంజాయ్ చేయడంతో పాటు మంచి రిఫ్రెష్​​నెస్​ పొందుతారు!
Watermelon Slush
Watermelon Slush (ETV Bharat)

టిప్స్ :

  • పుచ్చకాయ స్లష్ సీక్రెట్ టిప్ వచ్చేసరికి పుచ్చకాయ ముక్కలను ఫ్రీజ్ చేసుకోవడం. అలాకాకుండా నార్మల్​ పుచ్చకాయ ముక్కలు వేసి బ్లెండ్ చేసుకున్నారంటే జ్యూస్​లా అయిపోతుందని గుర్తుంచుకోవాలి.
  • ఇక్కడ తేనె, నిమ్మరసం తగినంత వేసుకొని బ్లెండ్ చేసుకునేటప్పుడు హై స్పీడ్​లో మిశ్రమం మొత్తాన్ని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది.

పిల్లలు స్వీట్ అడిగితే - ఇలా "తియ్యటి పూరీలు" చేసి పెట్టండి! - కనీసం 15 రోజులు నిల్వ!

ఊర మాస్​ ఫుడ్​తో మోడ్రన్​ జ్యూస్ - జొన్న, సజ్జ పిండితో అద్దిరిపోయే "స్మూతీలు"! - సమ్మర్​లో బాడీ ఫుల్​ కూలింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.