How To Make Watermelon Juice at Home : వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది ఎండ, వేడి నుంచి ఉపశమనం పొందడానికీ, కడుపులో చల్లగా ఉండటానికీ చలువ చేసే పండ్లు తింటుంటారు. అందులో పుచ్చకాయ ముందు వరుసలో ఉంటుంది. దీన్ని ముక్కలుగా తిన్నా, జ్యూస్ చేసి తాగినా కడుపులో చల్లదనం మనసుకీ ఎంతో హాయినిస్తుంది. అయితే, చాలా మంది పర్ఫెక్ట్ టేస్ట్‌తో పుచ్చకాయ జ్యూస్ చేయడం రావట్లేదని ఫీల్ అవుతుంటారు. దాంతో పుచ్చకాయ తెచ్చుకున్నప్పుడు కట్ చేసుకొని ముక్కలుగానే తింటుంటారు.
అలాంటి వారికోసం ఇంట్లోనే సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునేలా ఒక "పుచ్చకాయ జ్యూస్" రెసిపీ తీసుకొచ్చాం. వాటర్ మెలన్‌తో ఇదొక్కటి కలిపి ప్రిపేర్ చేసుకున్నారంటే జ్యూస్ సెంటర్‌ని మించిన టేస్ట్‌తో అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు, ఇలా చేసి ఇచ్చారంటే పిల్లల నుంచి పెద్దల వరకు వద్దనకుండా రెండు మూడు గ్లాసులైనా లాగించేస్తారు. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మరి, లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ జ్యూస్ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- పుచ్చకాయ ముక్కలు - 3 పెద్ద కప్పులు
- కొబ్బరి నీళ్లు - 300ఎంఎల్
- పంచదార - 2 టీస్పూన్లు
- ఐస్ క్యూబ్స్ - అర కప్పు
స్వచ్ఛమైన "బాదం మిల్క్ పౌడర్" ఇంట్లోనే - 2 నెలలపాటు నిల్వ - కోరుకోగానే బాదం పాలు రెడీ!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా తాజా పుచ్చకాయను తీసుకొని శుభ్రంగా కడిగి, ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై వాటి తొక్కలను తీసేసి గింజలను తొలగించుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా మూడు కప్పుల పరిమాణంలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుచ్చ ముక్కలు వేసుకోవాలి. ఆపై అందులో కొబ్బరినీళ్లు, చక్కెర, ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి.
- అయితే, ఇక్కడ జ్యూస్‌కి పర్ఫెక్ట్ టేస్ట్ రావడం కోసం మనం తీసుకున్న ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొబ్బరినీళ్లు. ఇది వేసుకొని చేసుకోవడం ద్వారా జ్యూస్‌కి అద్భుతమైన టేస్ట్ వస్తుంది.
- అలాగే, ఇక్కడ మీరు పంచదార వద్దనుకుంటే దాని ప్లేస్‌లో తేనెని యాడ్ చేసుకొని జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు.
- జ్యూస్‌ని మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత వడకట్టుకొని గ్లాసుల్లోకి పోసుకోవాలి. ఆ తర్వాత అవసరమైతే గ్లాసుల్లో మరికొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో టేస్టీగా, కూల్ కూల్‌గా కమ్మని "పుచ్చకాయ జ్యూస్" రెడీ!
- మరి, ఆలస్యమెందుకు మీరూ సమ్మర్లో ఇంట్లో ఇలా పుచ్చకాయ ప్రిపేర్ చేసుకోండి. ఇంటిల్లిపాదీ దీన్ని తాగుతూ సరికొత్త టేస్ట్‌తో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.