ETV Bharat / offbeat

టేస్టీ అండ్​ హెల్దీ "వాటర్​ యాపిల్​ మిల్క్​షేక్​" - ఒక్క గ్లాస్​ తాగితే ఎండల నుంచి ఫుల్​ రిలీఫ్​! - WATER APPLE MILKSHAKE

-ఆరోగ్యానికి మేలు చేసే వాటర్​ రోజ్​ యాపిల్ -ఈ సమ్మర్​లో ఇలా మిల్క్​షేక్​ చేసుకోండి!

Water Apple Milkshake
Water Apple Milkshake (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 30, 2025 at 4:51 PM IST

2 Min Read

Water Apple Milkshake : రోజురోజుకి ఎండలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది శరీరాన్ని హైడ్రేట్​గా ఉంచడం కోసం మజ్జిగ, నిమ్మరసం, పండ్ల రసాలు వంటివి తీసుకుంటుంటారు. అలాగే ఇంట్లో మిల్క్​షేక్స్​ ప్రిపేర్​ చేసుకుంటుంటారు. ఇక మిల్క్​షేక్స్​ అనగానే బనానా, యాపిల్​, సపోటా ఇలా రెగ్యులర్​గా లభించే పండ్లతో ప్రిపేర్​ చేస్తుంటారు. కానీ మీకు తెలుసా నీటి శాతం ​అధికంగా ఉండే వాటర్​ యాపిల్​తో కూడా సూపర్​ టేస్టీ మిల్క్​షేక్​ చేసుకోవచ్చు. దీని టేస్ట్​ సూపర్​గా ఉంటుంది. కేవలం టేస్ట్​ మాత్రమే కాదు ఈ పండులోని పోషకాలు ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. మరి లేట్​ చేయకుండా ఈ వాటర్​ యాపిల్​ మిల్క్​షేక్​ ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో చూసేయండి.

Water Apple
Water Apple (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • రోజ్​ యాపిల్స్​ - 5
  • పాలు - 2 కప్పులు
  • గసగసాలు - 1 టేబుల్​స్పూన్​
  • తేనె - 2 టేబుల్​స్పూన్లు
  • ఉప్పు - చిటికెడు
  • ఐస్​క్యూబ్స్​ - 4
Honey
Honey (Getty Images)

తయారీ విధానం:

  • ముందుగా వాటర్​ యాపిల్స్​ను శుభ్రంగా కడిగి తుడవాలి. ఆ తర్వాత రెండు చివర్లు కొద్దిగా తీసేసి స్లైస్​లుగా కట్​ చేసుకుని అందులో ఏమైనా గింజలు ఉంటే తీసేయాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి పాలు పోసి మరిగించుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చి మరుగుతున్నప్పుడు గసగసాలు వేసి కలిపి మరో 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి.
Milk
Milk (Getty Images)
  • గసగసాలు ఉడికిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
  • పాలు పూర్తిగా చల్లారిన తర్వాత మిల్క్​షేక్​ ప్రిపేర్​ చేసుకోవాలి.
  • మిక్సీజార్​లోకి కట్​ చేసిన వాటర్​ యాపిల్స్ ముక్కలు, పూర్తిగా చల్లారిన పాలు, తేనె, ఉప్పు, ఐస్​క్యూబ్స్​ వేసి మెత్తగా బ్లెండ్​ చేయాలి.
  • ఇలా గ్రైండ్​ చేసిన మిశ్రమాన్ని ఓ గ్లాస్​లోకి తీసుకుని పైన సన్నగా తరిగిన వాటర్​ యాపిల్​ ముక్కలు, గసగసాలతో గార్నిష్​ చేసుకుని సర్వ్​ చేసుకుంటే సూపర్​ టేస్టీగా ఉండే వాటర్​ యాపిల్​ మిల్క్​షేక్​ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Poppy Seeds
Poppy Seeds (Getty Images)

టిప్స్​:

  • తాజాగా, గట్టిగా ఉన్న వాటర్ యాపిల్స్​ను ఎంచుకోవాలి. మెత్తగా లేదా పాడైపోయిన వాటిని ఉపయోగిస్తే మిల్క్​షేక్​ రుచి మారుతుంది.
  • మిల్క్​షేక్ మరింత క్రీమీగా ఉండాలంటే, కొన్ని జీడిపప్పు పలుకులను నానబెట్టి బ్లెండ్ చేసేటప్పుడు వేసుకోవచ్చు.
  • మిల్క్​ను బ్లెండ్​ చేసేటప్పుడు అవసరమైతే యాలకుల పొడి లేదా కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసుకుంటే మిల్క్​షేక్​ రుచి మరింత బాగుంటుంది.
  • తేనె బదులు పంచదార లేదా పటిక బెల్లాన్ని కూడా ఉపయోగించవచ్చు. అయితే ఈ స్వీట్​ను మీరు తీసుకునే వాటర్​ యాపిల్స్​కు అనుగుణంగా వేసుకోవాలి.
Water Apple Milkshake
Water Apple Milkshake (ETV Bharat)

మండు వేసవిలో మజానిచ్చే "లెమన్​ పంచ్​" - ఒక్కో సిప్​ తాగుతుంటే ఆ కిక్కే వేరు!

పుచ్చకాయతో జ్యూస్ రొటీన్ - ఇలా "స్లష్" చేసుకొని తాగండి! - ఒక్కో గుటక వేస్తుంటే మజా వస్తుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.