ETV Bharat / offbeat

పెరుగులో నానబెట్టి "వంకాయ మసాలా కర్రీ" చేసుకోండి - ఎన్నడూ తినని రుచితో భలే కమ్మగా ఉంటుంది!

రెగ్యులర్ వంకాయ కర్రీని మించిన టేస్ట్ - ఒక్కసారి తిన్నారంటే ఎప్పుడూ ఇలానే చేసుకుంటారు!

Vankaya Masala Curry at Home
Vankaya Masala Curry Recipe in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 20, 2025 at 3:39 PM IST

3 Min Read
Choose ETV Bharat

Easy Vankaya Masala Curry at Home : వంకాయను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ఇది చాలా మంది ఫేవరెట్ కర్రీ కూడా. ఈ క్రమంలోనే వంకాయతో మసాలా కర్రీ, పచ్చడి ఇలా రకరకాల వెరైటీలు ట్రై చేస్తుంటారు. అయితే, ఎప్పుడూ ఒకేలా తినాలన్నా కాస్త బోరింగ్​గా అనిపిస్తుంది. అందుకే, ఈసారి కాస్త వెరైటీగా పెరుగులో నానబెట్టి "వంకాయ మసాలా కర్రీని" చేసుకొని చూడండి. మంచి రుచితో నాన్​వెజ్ రెసిపీలను మించిన టేస్ట్​ని అందిస్తుంది. పైగా ఎవరైనా దీన్ని సింపుల్​గా రెడీ చేసుకోవచ్చు. కొత్తగా వంట చేసేవారు కూడా ఎక్కువ క్వాంటిటీతో ఏదైనా కర్రీ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్​గా చెప్పుకోవచ్చు. వంకాయ అంటే ఇష్టంలేని వారూ ఈ కర్రీని ఎంతో ఇష్టంగా తింటారు. మరి, ఇంకెందుకు ఆలస్యం అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Vankaya Masala Curry
Vankayalu (ETV Bharat)

తీసుకోవాల్సిన పదార్థాలు :

పెరుగు మిశ్రమం కోసం :

  • వంకాయలు - పావుకిలో
  • పెరుగు - ఒక కప్పు(200 గ్రాములు)
  • కారం - ఒకటీస్పూన్
  • ఉప్పు - కొద్దిగా
  • ధనియాల పొడి - ఒక టీస్పూన్
  • పసుపు - పావుటీస్పూన్
Easy Vankaya Masala Curry
Easy Vankaya Masala Curry (ETV Bharat)

పల్లీ పొడి కోసం :

  • పల్లీలు - మూడు టేబుల్​స్పూన్లు
  • ఎండుకొబ్బరి ముక్కలు - ఒక టేబుల్​స్పూన్
  • ధనియాలు - ఒక టేబుల్​స్పూన్
  • జీలకర్ర - అరటీస్పూన్
  • లవంగాలు - నాలుగైదు
  • యాలకులు - రెండు
  • దాల్చిన చెక్క - చిన్న ముక్క

కర్రీ కోసం :

  • నూనె - నాలుగు టేబుల్​స్పూన్లు
  • జీలకర్ర - అరటీస్పూన్
  • బిర్యానీ ఆకు - ఒకటి
  • పచ్చిమిర్చి - మూడు
  • ఉల్లిపాయ - ఒకటి
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒకటీస్పూన్
  • ఉప్పు, కారం - తగినంత
  • చింతపండు రసం - రెండు టేబుల్​స్పూన్లు

ఈ స్టైల్​లో "మునక్కాయ కర్రీ" చేసుకోండి - మసాలాలు​ లేకుండానే చిక్కని గ్రేవీతో కమ్మని రుచి!

Vankaya Masala
Vankaya Masala Making (ETV Bharat)

తయారీ విధానం :

  • ఈ సింపుల్ అండ్ టేస్టీ కర్రో కోసం ముందుగా తాజా రౌండ్ షేప్​లో తెల్లటి వంకాయలను తీసుకొని నీట్​గా కడిగి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగును తీసుకొని ఆపై అందులో కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు వేసుకొని ఉండలు లేకుండా అవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకొని పక్కనుంచాలి.
  • అనంతరం కడిగి పెట్టుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా తీసుకొని చాకుతో అడుగు వైపు నాలుగు భాగాలుగా(గుత్తొంకాయ కర్రీలా) ముప్పావు వంతు చీల్చుకోవాలి.
  • ఆపై వంకాయ బాగుందో లేదో చూసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో వేసుకోవాలి.
  • ఆవిధంగా అన్నింటిని కట్ చేసుకొని పెరుగు మిశ్రమంలో వేసుకున్నాక అది వంకాయలకు లోపలి వరకు చక్కగా పట్టేలా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
Vankaya Masala Curry Making
Masala Recipe (ETV Bharat)
  • అనంతరం స్టవ్ మీద కడాయి పెట్టుకొని పల్లీలను వేసి అవి లోపలి వరకు వేగేలా బాగా రోస్ట్ చేసుకోవాలి. అవి వేగిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఎండుకొబ్బరి ముక్కలు, ధనియాలు, జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందుల్లో చల్లారిన పల్లీల మిశ్రమం వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కనుంచాలి.
  • తర్వాత కర్రీ తయారీ కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి.
  • అవి కాస్త ఫ్రై అయ్యాక సన్నని ఉల్లిపాయ తరుగు వేసి రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయంత వరకు కాసేపు వేయించాలి.
Vankaya Masala
Easy Vankaya Masala Curry (ETV Bharat)
  • అనంతరం మంటను తగ్గించి ముందుగా వంకాయలను నానబెట్టుకున్న పెరుగు మిశ్రమం మొత్తాన్ని వేసుకొని నెమ్మదిగా కలుపుతూ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పొడి, ఉప్పు, కారం వేసుకొని కలిపి లో ఫ్లేమ్​లో అవి ముక్కలుగా కాస్త పట్టేలా మూతపెట్టి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • అలా ఉడికించిన అనంతరం ఆ మిశ్రమంలో చింతపండు రసం, గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపి మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్​లో వంకాయ ముక్కలు మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి
  • ఆరేడు నిమిషాలకు అవి చక్కగా ఉడుకుతాయి. అప్పుడు చివర్లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకుంటే చాలు. అంతే, ఘుమఘుమలాడే కమ్మని "వంకాయ మసాలా కర్రీ" రెడీ!
Vankaya Masala Curry
Vankaya Masala Curry in Telugu (ETV Bharat)

టిప్స్ :

  • ఇక్కడ మీరు గ్రేవీ కాస్త ఎక్కువ కావాలనుకుంటే పల్లీలను క్యాంటిటీని కాస్త పెంచి వేసుకోవచ్చు. అలాగే, పల్లీలను వేయించేటప్పుడు అవి మాడిపోకుండా నెమ్మదిగా వేయించుకోవాలి.
  • వంకాయలను కొద్దిసేపు పెరుగు మిశ్రమంలో నానబెట్టి ఆ తర్వాత కూర చేసుకోవడం ద్వారా టేస్ట్ చాలా బాగుంటుంది.

పాతకాలం పద్దతిలో "వంకాయ ఎండు నెత్తళ్ల కూర" - అద్దిరిపోయే రుచితో ముద్దకో ముక్క తినేస్తారు!

అమ్మమ్మల పద్ధతిలో కమ్మని "కందికట్టు" చేసుకోండి - పప్పుచారు కంటే కూడా భలే రుచిగా ఉంటుంది!