ETV Bharat / offbeat

ఎప్పుడూ మిరపకాయ బజ్జీలేనా - ఓసారి "గుంటూరు స్టైల్ వంకాయ బజ్జీలు" ప్రిపేర్​ చేయండి - టేస్ట్​కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే! - Vankaya Bajji Recipe

Vankaya Bajji Recipe: చిన్నాపెద్దా ఎవరికైనా.. స్నాక్స్‌ అనగానే ముందుగా గుర్తుకువచ్చేవి బజ్జీలే. అందునా.. మిరపకాయ బజ్జీలంటే మైమరచిపోవడం ఖాయం. కానీ.. మిర్చీ కన్నా రుచిలో మేమేం తక్కువ కాదంటున్నాయి.. "గుంటూరు స్టైల్ వంకాయ బజ్జీలు". మరి.. మీరూ ఎప్పుడైనా వీటిని టేస్ట్ చేశారా? లేదు.. అంటే మాత్రం ఇప్పుడే ఓసారి ఇలా ట్రై చేయండి!

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 11, 2024, 3:53 PM IST

How to Make Brinjal Bajji
Vankaya Bajji Recipe (ETV Bharat)

How to Make Brinjal Bajji in Telugu: చాలా మందికి సాయంత్రం అయిందంటే చాలు టీతో పాటు బజ్జీలు, సమోసాలు లేదా పకోడీలు తినే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలోనే ఎక్కువ మంది మిర్చీ బజ్జీలను టేస్ట్ చేస్తుంటారు. అయితే, ఎప్పుడూ అవే తింటే బోరింగ్ ఫీల్ వస్తుంది. కాబట్టి, ఈ సాయంకాలం కాస్త వెరైటీగా "గుంటూరు స్ట్రీట్ స్టైల్​ వంకాయ బజ్జీల"ను ట్రై చేయండి. టేస్ట్ అద్దిరిపోతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇంతకీ, ఈ సూపర్ టేస్టీ వంకాయ బజ్జీల(Brinjal Bajji) తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • శనగపిండి - 2 కప్పులు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • వంటసోడా - పావు టీస్పూన్ కంటే కాస్త ఎక్కువ
  • పసుపు - పావు టీస్పూన్
  • వాము పొడి - అరటీస్పూన్
  • వంకాయలు - 8 నుంచి 10
  • నూనె - సరిపడినంత

స్టఫింగ్ కోసం :

  • పల్లీలు - అర కప్పు
  • ఎండుమిర్చి - 4 నుంచి 5
  • జీలకర్ర - అరటీస్పూన్
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • చింతపండు - కొద్దిగా
  • వెల్లుల్లి రెబ్బలు - 2
  • ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం :

  • ముందుగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక మిక్సింగ్ బౌల్​లో శనగపిండి, ఉప్పు, వంటసోడా, పసుపు తీసుకొని కొద్దికొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం జారుడుగా కలుపుకోవాలి.
  • బజ్జీలకు ఎప్పుడూ పిండిని మరీ పల్చగా కాకుండా, గట్టిగా కాకుండా.. మీడియం థిక్​నెస్​తో పిండిలో ఎయిర్ గ్యాప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి.
  • ఆవిధంగా పిండిని కలుపుకున్నాక.. అందులో వాముపొడి వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే.. బజ్జీలను శనగపిండితో ప్రిపేర్ చేసుకుంటాం. కాబట్టి.. వాముపొడి వేసుకోవడం ద్వారా త్వరగా జీర్ణమవ్వడానికి తోడ్పడుతుంది. ఆ తర్వాత బౌల్​పై మూతపెట్టి 15 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టుకోవాలి.
  • ఆలోపు రెసిపీలోకి కావాల్సిన పొడవాటి వంకాయలను(Brinjal) తీసుకొని శుభ్రంగా కడిగి.. కాడలవైపు కాకుండా మరోవైపు కొద్దిగా కట్ చేసుకోవాలి. ఆపై వాటిని చాకుతో నాలుగు ముక్కలుగా మధ్యలోకి చీల్చుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి కట్ చేసుకున్న వంకాయలను అందులో వేసుకొని అవి కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆపై వాటిని ఒక ఫ్లేట్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం వంకాయ బజ్జీలోకి స్టఫింగ్ కోసం పల్లీ పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం.. స్టౌపై పాన్ పెట్టుకొని మంటను లో ఫ్లేమ్​లో ఉంచి పల్లీలను వేయించుకోవాలి. అవి వేగాక అందులోనే ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసుకొని మరోసారి మిశ్రమాన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి.
  • మిశ్రమం పూర్తిగా చల్లారాక మిక్సీ జార్​లోకి తీసుకొని చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఆవిధంగా ప్రిపేర్ చేసుకున్న పల్లీ పొడిని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న వంకాయల మధ్యలో కొద్ది కొద్దిగా తీసుకొని స్టఫ్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. అలా అన్నింటిని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు.. స్టౌపై పాన్ పెట్టుకొని వేయించడానికి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న శనగపిండిలో స్టఫ్ చేసి పెట్టుకున్న ఒక్కొక్క వంకాయను డిప్ చేసి వేడెక్కిన ఆయిల్​లో వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ఇలా వేయించుకునేటప్పుడు నూనెను బజ్జీల మీదికి వేస్తూ వేయించుకోవాలి. ఇలా చేయడం ద్వారా పిండి అనేది విడిపోకుండా ఉంటుంది. ఆవిధంగా బజ్జీలను మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్​లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • ఆపై వాటిని సర్వింగ్ బౌల్​లోకి తీసుకుని డైరెక్ట్​గా తినొచ్చు. లేదంటే.. నిమ్మకారం, పెరుగు, కొత్తిమీర, వేయించిన పల్లీలు, ఆనియన్స్​తో స్టఫింగ్ చేసుకొని తినొచ్చు.
  • నిమ్మకారం కోసం.. ఒక బౌల్​లో పావుకప్పు నిమ్మరసం, ఒకటిన్నర టీస్పూన్ కారం వేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కనపెట్టుకోవాలి. అలాగే.. కొద్దిగా పెరుగు తీసుకొని అందులో కాస్త ఉప్పు, వాముపొడి వేసుకొని బాగా బీట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక ప్లేట్​లో వేడి వేడి వంకాయ బజ్జీలను తీసుకొని మధ్యలోకి కట్ చేసి.. ముందుగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, కొత్తిమీర స్టఫ్ చేసి దానిపైన పెరుగు, నిమ్మకారం కొద్దిగా వేసుకొని ఆపై కొన్ని ఆనియన్స్, వేయించుకున్న పల్లీలు, కాస్త చాట్ మసాలా వేసి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "గుంటూర్ స్ట్రీట్ స్టైల్ వంకాయ బజ్జీలు" రెడీ!

ఇవీ చదవండి :

రోడ్ సైడ్ బండి రుచితో మిర్చీ బజ్జీ కావాలా? - ఈ టిప్స్ పాటిస్తే అద్దిరిపోయే టేస్ట్!

బ్రెడ్​తో ఇలా చిటికెలో బజ్జీలు చేయండి - పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.