ETV Bharat / offbeat

చింతపండు లేకుండా కమ్మని "పులిహోర" - 10 నిమిషాల్లో రెడీ - లంచ్​ బాక్స్​కు పర్ఫెక్ట్​! - VAMAKU PULIHORA RECIPE

- వామాకులతో ఆరోగ్యానికి ఎంతో మేలు - ఇలా ఓసారి పులిహోర చేసుకుని తినండి!

Vamaku Pulihora
Vamaku Pulihora (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 25, 2025 at 1:19 PM IST

2 Min Read

Vamaku Pulihora: పులిహోర అంటే అందరికీ ఇష్టమే. పండగలు, పూజలు, వ్రతాల సమయంలో ప్రిపేర్​ చేస్తుంటారు. ఇక పులిహోర అంటే మెజార్టీ పీపుల్​ చింతపండు, నిమ్మకాయతో చేస్తుంటారు. కానీ మీకు తెలుసా? కేవలం వీటితో మాత్రమే కాకుండా వామాకుతో కూడా పులిహోర చేసుకోవచ్చు. టేస్ట్​ చాలా అద్భుతంగా ఉంటుంది. అన్నీ ఉంటే కేవలం 10 నిమిషాల్లో ఇది తయారవుతుంది. పైగా స్కూల్​కు వెళ్లే పిల్లలకు, ఆఫీసులకు వెళ్లే పెద్దవారికి లంచ్​బాక్స్​గా కూడా దీనిని పెట్టొచ్చు. ఇక వామాకుతో కలిగి లాభాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జలుబు, దగ్గు సహా జీర్ణ సంబంధిత సమస్యలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి లేట్​ చేయకుండా ఈ వామాకు పులిహోర ఎలా చేయాలో చూసేయండి.

Vamaku
Vamaku (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • వాము ఆకులు - 1 కప్పు
  • ఉడికించిన అన్నం - 1 కప్పు
  • సైంధవ లవణం - సరిపడా
  • నిమ్మరసం - అర చెక్క
  • పల్లీలు - అర కప్పు
  • శనగపప్పు - 1 టీస్పూన్​
  • మినప్పప్పు - 1 టీస్పూన్​
  • ఆవాలు - అర టీస్పూన్​
  • జీలకర్ర - అర టీస్పూన్​
  • ఎండుమిర్చి - 2
  • పచ్చిమిర్చి - 2
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • పసుపు - పావు టీస్పూన్​
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • ఇంగువ - చిటికెడు
  • నూనె - పావు కప్పు
Vamaku Pulihora
Vamaku Pulihora (ETV Bharat)

తయారీ విధానం:

  • ముందుగా వాము ఆకులను శుభ్రంగా కడిగి వీలైనంత సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే అన్నాన్ని కూడా రెడీగా ఉంచాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక పల్లీలు వేసి లో ఫ్లేమ్​లో వేయించాలి.
  • పల్లీలు సరిగా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచాలి. అదే పాన్​లో శనగపప్పు, మినప్పపు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేయాలి.
Vamaku Pulihora
Vamaku Pulihora (ETV Bharat)
  • తాలింపు గింజలు వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి మిక్స్​ చేసుకోవాలి.
  • పచ్చిమిర్చి వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న వామాకు వేసి మగ్గించాలి.
  • వామాకు నూనెలో మగ్గిన తర్వాత ఉడికించిన అన్నాన్ని వేసి కలుపుకోవాలి. వామాకు మిశ్రమం, అన్నం బాగా కలిసిన తర్వాత రుచికి సరిపడా సైంధవ లవణం వేసి మిక్స్​ చేసుకోవాలి.
Vamaku Pulihora
Vamaku Pulihora (ETV Bharat)
  • ఆ తర్వాత నిమ్మరసం వేసి మిక్స్​ చేసుకుని స్టవ్​ ఆఫ్​ చేయాలి. చివరగా కొత్తిమీర తరుగు, వేయించిన పల్లీలు వేసి మిక్స్​ చేసుకుని సర్వ్​ చేసుకుంటే సూపర్​ టేస్టీ వామాకు పులిహోర రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Vamaku Pulihora
Vamaku Pulihora (ETV Bharat)

చిట్కాలు:

  • లేతవి, తాజా వామాకులు అయితే ఈ పులిహోర టేస్ట్​ బాగుంటుంది. ఉడికించిన అన్నం ఉంటే ఇది 5 నిమిషాల్లో రెడీ అవుతుంది.
  • పల్లీలు వేయించుకుని పక్కకు తీసుకుని లాస్ట్​లో కలపడం వల్ల తినేటప్పుడు పంటికి తగిలి అదో టేస్ట్​ ఉంటుంది. అదే అన్నింటితో కలిపి వేయించుకుంటే కాస్త మెత్తబడే అవకాశం ఉంటుంది.
  • వామాకు నూనెలో సరిగ్గా వేగకపోతే పులిహోర రుచి మారుతుంది. కాబట్టి వీలైనంత వరకు మగ్గించుకోవాలి.
Vamaku Pulihora
Vamaku Pulihora (ETV Bharat)

ఘుమఘుమలాడే "చేపల పచ్చడి" - ఈ కొలతలతో చేస్తే పక్కా మూడు నెలలు నిల్వ!

IRCTC బ్యాంకాక్​ టూర్​​ - బీచ్​లో ఎంజాయ్​మెంట్​తో పాటు సఫారీ వరల్డ్​ టూర్ కూడా​ - ధర తక్కువే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.