ETV Bharat / offbeat

ఎండల్లో తాగాల్సింది కూల్ డ్రింక్స్ కాదు - ఒంటికి చలువ చేసే "సొరకాయ మజ్జిగ పులుసు"! - రుచి అద్భుతం, అమోఘం!​ - TRENDY SORAKAYA MAJJIGA PULUSU

- ఆరోగ్యానికి మేలు చేసే మజ్జిగ చారు - ఈ టిప్స్ పాటిస్తే సూపర్ టేస్ట్ పక్కా!

Trendy Sorakaya Majjiga Pulusu
Trendy Sorakaya Majjiga Pulusu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 26, 2025 at 2:01 PM IST

2 Min Read

Trendy Sorakaya Majjiga Pulusu: ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా చాలా మంది ఒంటికి చలువు చేసే ఆహారాలను తమ డైట్​లో చేర్చుకుంటారు. ముఖ్యంగా మజ్జిగ పులుసు ఈ సమ్మర్​లో అధికంగా చేసుకుని తింటుంటారు. పుల్లటి మజ్జిగలో ఉల్లిపాయలు, తాలింపు మిశ్రమాన్ని వేసి చేసుకునే ఈ పులుసును తింటుంటే తినబుద్ధి అవుతుంది. అయితే ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఓసారి సొరకాయతో మజ్జిగ పులుసు చేసుకోండి. ఏంటీ సొరకాయతో కూర, పచ్చడి మాత్రమే కాకుండా పులుసు కూడా చేసుకుంటారా అని సందేహమా? కానీ నిజమే. ఈ కూరగాయతో రుచికరమైన పులుసు చేసుకోవచ్చు. టేస్ట్​ చాలా బాగుంటుంది. పైగా ఇందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి అవసరం లేదు. మరి లేట్​ చేయకుండా ఈ సొరకాయ మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో ఓ లుక్కేయండి.

కావాల్సిన పదార్థాలు:

పేస్ట్​ కోసం:

  • పచ్చి శనగపప్పు - 1 టేబుల్​ స్పూన్​
  • ధనియాలు - 1 టీస్పూన్​
  • జీలకర్ర - అర టీస్పూన్
Sorakaya
సొరకాయ (Getty Images)

పులుసు కోసం:

  • నూనె - 1 టేబుల్​ స్పూన్​
  • తాలింపు గింజలు(ఆవాలు, మినపప్పు, మెంతులు) - 1 టేబుల్​స్పూన్​
  • ఎండుమిర్చి - 2
  • సొరకాయ ముక్కలు - 200 గ్రాములు
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • ఇంగువ - పావు టీ స్పూన్​
  • ఉప్పు - సరిపడా
  • పసుపు- అర టీస్పూన్​
  • అల్లం తురుము - 1 టీస్పూన్​
  • పచ్చిమిర్చి - 4
  • పచ్చి కొబ్బరి ముక్కలు - 2 టేబుల్​స్పూన్లు
  • చిక్కటి పెరుగు - అరకేజీ​
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
Curd
పెరుగు (Getty Images)

తయారీ విధానం:

  • ఓ గిన్నెలోకి ​పచ్చి శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, పావు కప్పు వాటర్​ పోసి సుమారు 20 నిమిషాల పాటు నానబెట్టాలి.
  • పులుసులోకి అవసరమయ్యే సొరకాయను పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్​ చేసి పక్కన ఉంచాలి. అలాగే ఓ గిన్నెలోకి పెరుగు తీసుకుని చిలికి సరిపడా నీళ్లు పోసి కలిపి పక్కన ఉంచాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి ఆయిల్​ పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి.
  • అవి మగ్గిన తర్వాత సొరకాయ ముక్కలు, కరివేపాకు, ఇంగువ, ఉప్పు, పసుపు వేసి ఓసారి కలపాలి.
Sorakaya Majjiga Pulusu
సొరకాయ మజ్జిగ పులుసు (ETV Bharat)
  • ఆ తర్వాత అల్లం తరుగు వేసి కలిపి మూత పెట్టి ముక్కలను నూనెలో మగ్గించుకోవాలి.
  • ముక్కలు మగ్గేలోపు నానిన పప్పును గ్రైండ్​ చేసుకోవాలి. అందుకోసం మిక్సీజార్​లోకి నానిన శనగపప్పు మిశ్రమాన్ని వాటర్​తో సహా వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి పచ్చిమిర్చి, పచ్చికొబ్బరి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్​ చేసి పక్కన ఉంచాలి.
  • ఈ పేస్ట్​ను ముందే తయారు చేసుకున్న మజ్జిగలో వేసి బాగా మిక్స్​ చేసుకోవాలి.
Sorakaya Majjiga Pulusu
సొరకాయ మజ్జిగ పులుసు (ETV Bharat)
  • సొరకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి మజ్జిగలో కలుపుకోవాలి.
  • ఇలా కలుపుకున్న తర్వాత మజ్జిగ ఉన్న గిన్నెను స్టవ్​ మీద పెట్టి లో ఫ్లేమ్​లో సుమారు 5 నుంచి 10 నిమిషాలు మగ్గించుకోవాలి.
  • మజ్జిగ పులుసు మగ్గిన తర్వాత చివరగా కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే సొరకాయ మజ్జిగ పులుసు రెడీ.
Sorakaya Majjiga Pulusu
సొరకాయ మజ్జిగ పులుసు (ETV Bharat)

చిట్కాలు:

  • ఈ రెసిపీ కోసం పుల్లటి పెరుగు వాడితే రుచి మరింత బాగుంటుంది.
  • మజ్జిగ పులుసు అనేది కొద్దిగా చిక్కగానే ఉండాలి. ఒకవేళ మీకు పల్చగా కావాలనుకుంటే నీళ్లు యాడ్​ చేసుకోవచ్చు.
  • కావాలనుకుంటే తాలింపులో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు.

ఒంట్లో వేడిని తగ్గించే "మజ్జిగ చారు" - ఈ పద్ధతిలో చేస్తే ఘుమఘుమలాడే రుచి! - తినడమే కాదు తాగేస్తారు!

ఘుమఘుమలాడే "చికెన్​ మజ్జిగ పులుసు" - ఈ పద్ధతిలో చేస్తే మెతుకు కూడా మిగల్చరు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.