ETV Bharat / offbeat

అమ్మమ్మలకాలం నాటి "తిమ్మనం" - నోట్లో వేసుకోగానే ఐస్​క్రీమ్​లా కరిగిపోతుంది! - TRADITIONAL RECIPE TIMMANAM SWEET

-అమ్మమ్మల కాలం నాటి స్వీట్ రెసిపీ "తిమ్మనం" -చాలా సింపుల్​గా తయారు చేసుకోవచ్చు!

Timmanam
Timmanam (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 19, 2025 at 8:33 PM IST

2 Min Read

Traditional Recipe Timmanam Sweet: స్వీట్స్ అంటే ఇష్టంలేనిది ఎవరికి చెప్పండి. లడ్డూ, జిలేబీ, పాలకోవా, బర్ఫీ, హల్వా, రసగుల్లా, గులాబ్​జామున్​ వంటి రకరకాల స్వీట్స్​ను ఎంతో ఇష్టంగా తింటారు. ప్రస్తుతం మిఠాయిలు కావాలంటే షాప్స్​కు వెళ్లి తెచ్చుకుంటున్నారు. కానీ ఒకప్పుడు ఇన్ని రకాల స్వీట్స్ లభించేవి కావు. ఇంట్లో ఉండే పదార్థాలతోనే రుచికరంగా, ఆరోగ్యకరంగా చేసుకునేవారు. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. అదే 'తిమ్మనం'. ఈ స్వీట్​నే కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి పాయసం అని కూడా పిలుస్తారు. ఇది క్రీమిగా ఉండి నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. పిల్లలు, పెద్దలందరూ ఇష్టంగా తింటారు. మరి లేట్​ చేయకుండా ఈ పాతకాలం నాటి తిమ్మనం ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

  • బియ్యం - అర కప్పు
  • పచ్చికొబ్బరి ముక్కలు - కప్పు
  • పాలు - రెండున్నర కప్పులు
  • బెల్లం తురుము - అరకప్పు
  • యాలకుల పొడి - అర టీస్పూన్​
  • నెయ్యి - తగినంత
  • ఎండుకొబ్బరి ముక్కలు - 2 టేబుల్​స్పూన్లు
  • కిస్​మిస్​ - 10
  • జీడిపప్పులు - 15
  • బాదం - 10

తయారీ విధానం:

  • ఓ​ బౌల్​లో బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి, సరిపడా వాటర్​ పోసి సుమారు గంటపాటు నానబెట్టుకోవాలి.
  • బియ్యం నానిన తర్వాత నీళ్లు వంపేసి మిక్సీజార్​లోకి వేసుకోవాలి. ఆపై అందులోకి పచ్చికొబ్బరి ముక్కలు, అరకప్పు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్​ చేసి పక్కన ఉంచాలి.
  • స్టవ్​ ఆన్ చేసి కడాయి పెట్టి పాలు పోసి మీడియం ఫ్లేమ్​లో మరిగించుకోవాలి.
  • పాలు బాగా మరుగుతున్నప్పుడు గ్రైండ్​ చేసుకున్న బియ్యం పేస్ట్​ వేసి కలుపుతూ సన్నని సెగ మీద సుమారు ​10 నిమిషాలు ఉడికించుకోవాలి.
  • బియ్యం మిశ్రమం చక్కగా ఉడికి, క్రీమ్​లాగా తయారైన తర్వాత దింపి పక్కన పెట్టాలి.
  • ఇప్పుడు అదే స్టవ్​పై మరో పాన్​ పెట్టి బెల్లం తురుము, అరకప్పు వాటర్​ పోసి మరిగించాలి.
  • బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
  • పాలు, బియ్యం మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు మరిగించిన బెల్లం వాటర్​ను వడకట్టి పోసుకుని బాగా కలిపి పక్కన ఉంచాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి నెయ్యి వేసి కరిగించాలి. వేడివేడి నెయ్యిలో జీడిపప్పు పలుకులు, సన్నగా తరిగిన బాదం, కిస్​మిస్​, ఎండుకొబ్బరి ముక్కలు వేసి మంచి కలర్​ వచ్చే వరకు సిమ్​లో ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మంచిగా వేగిన తర్వాత పాలు, బెల్లం మిశ్రమంలో వేసి కలుపుకోవాలి.
  • అంతే ఎంతో టేస్టీగా ఉండే పాతకాలం నాటి తిమ్మనం రెడీ. దీనిని గోరువెచ్చగా లేదా ఫ్రిడ్జ్​లో పెట్టుకొని అయినా తినొచ్చు. నచ్చితే మీరూ ఈరెసిపీ ట్రై చేయండి.

చిట్కాలు:

  • ఈ స్వీట్​ రెసిపీ కోసం ముడి బియ్యం అయితే బాగుంటుంది. మీ దగ్గర అవి లేకపోతే నార్మల్​ రైస్​ అయినా తీసుకోవచ్చు.
  • ఇక్కడ బెల్లం కరిగితే సరిపోతుంది. పాకం అవసరం లేదు. అలాగే బెల్లాన్ని మీరు తినే స్వీట్​కు అనుగుణంగా కలుపుకోవాలి. ఒకవేళ స్వీట్​ ఎక్కువ కావాలనుకుంటే మరికొంచెం బెల్లం కరిగించి మిక్స్​ చేసుకుంటే సరి.
  • పాలు, బియ్యం మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే బెల్లం నీళ్లు పోసుకోవాలి. వేడి మీద పోసుకుంటే పాలు విరిగే అవకాశం ఉంటుంది.

సేమియాతో పాయసం రొటీన్​ - ఇలా "దద్దోజనం" చేసుకోండి - 5 నిమిషాల్లో సిద్ధం - బ్రేక్​ఫాస్ట్​, లంచ్​, డిన్నర్​కు పర్ఫెక్ట్​!

అమ్మాయిలు, చిన్నారులకు బలాన్నిచ్చే 'తియ్యని స్నాక్'​ - ఈ రెసిపీకి పాకం అవసరం లేదు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.