అమ్మమ్మల పద్ధతిలో కమ్మని "కందికట్టు" చేసుకోండి - పప్పుచారు కంటే కూడా భలే రుచిగా ఉంటుంది!
నోటికి కమ్మగా, పొట్టకి చల్లగా ఉండే సూపర్ రెసిపీ - వేడి వేడి అన్నంలో అమృతమే!

Published : May 19, 2025 at 12:13 PM IST
Kandikattu Making Process : ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం కర్రీ చేయాలని ఆలోచిస్తుంటాం. అలాగే, కొన్నిసార్లు బయటకు వెళ్లి వెజిటబుల్స్ తెచ్చుకునే ఓపిక ఉండదు. అలాంటి టైమ్‌లో ఇంట్లో ఉండే ఒకట్రెండు ఇంగ్రీడియంట్స్‌తో ఈజీగా, రుచికరంగా చేసుకునే ఒక మంచి రెసిపీ తీసుకొచ్చాం. అదే, అమ్మమ్మల నాటి "కందికట్టు". మంచి రుచితో ఎంతో సింపుల్‌గా చేసుకోగలిగే దీన్ని వేడి వేడి అన్నంలో పోసుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుంది. సాంబార్, పప్పుచారు వంటి వాటికంటే కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నోటికి కమ్మగా ఉండడమే కాకుండా పొట్టకి లైట్గానూ ఉంటుంది! పిల్లలు కూడా దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. మరి, ఈ పాతకాలం నాటి కందికట్టుని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
తీసుకోవాల్సిన పదార్థాలు :
- కందిపప్పు - ఒక గ్లాసు
- పసుపు - పావుటీస్పూన్
ఈ పొడితో "టమాటా రసం" చేసుకోండి - కమ్మని రుచితో తినడమే కాదు గ్లాసుల్లో పోసుకుని తాగేస్తారు!
తయారీ విధానం :
- ఈ పాతకాలం నాటి కందికట్టు కోసం ముందుగా స్టవ్ మీద కుక్కర్లో కందిపప్పుని తీసుకొని లో ఫ్లేమ్‌లో మంచి వాసన వచ్చి, రంగు మారేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి.
- తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారనిచ్చి ఆపై తగినన్ని నీళ్లు పోసుకొని ఒకసారి శుభ్రంగా కడగాలి.
- అనంతరం కడిగిన కందిపప్పుని మళ్లీ కుక్క్ర్లో వేసుకొని నాలుగు నుంచి ఐదు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి.
- ఆపై అందులో పసుపు వేసుకొని కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్‌లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
- ఒకవేళ ఇక్కడ మీరు పప్పుని నానబెట్టి చేసుకున్నట్లయితే రెండు విజిల్స్‌కే పప్పు చక్కగా ఉడికిపోతుంది.
- అయితే, కందిపప్పు అనేది మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకులుగా ఉండేలా ఉడికించుకుంటే సరిపోతుంది.
- అనంతరం ఉడికించిన పప్పులో నుంచి పైన ఉన్న తేటని మాత్రమే ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి.
తాలింపు కోసం :
- నూనె - రెండు టేబుల్‌స్పూన్లు
- నెయ్యి - అరటేబుల్‌స్పూన్
- మెంతిగింజలు - పది
- ఆవాలు - పావుటీస్పూన్
- జీలకర్ర - పావుటీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు
- పచ్చిమిర్చి - రెండు
- ఎండుమిర్చి - నాలుగు
- కరివేపాకు - కొద్దిగా
- ఇందుకోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్, నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగి ఆ మిశ్రమం కాస్త వేడయ్యాక మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించాలి.
- అవి కాస్త వేగాక కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి తుంపలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి.
- చివర్లో కరివేపాకు వేసి కాస్త వేయించాక ముందుగా ఉడికించి గిన్నెలోకి తీసుకున్న కందిపప్పు నీళ్లను పోసుకొని ఒకసారి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించి దింపేసుకోవాలి.
- ఆపై రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిపి, చల్లారిన తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి.
- ఆఖర్లో కాస్త కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే పాతకాలం నాటి కమ్మని "కందికట్టు" రెడీ!
- అయితే, కందికట్టు అనేది కాస్త పలుచగానే ఉంటుంది. అదే, కొద్దిగా చిక్కగా ఉండాలనుకునేవారు ఉడికించుకున్న కందిపప్పుని మెత్తగా మెదిపి వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది.
టిప్స్ :
- కొందరు ఈ రెసిపీని పప్పు వేయించకుండానూ ప్రిపేర్ చేసుకుంటుంటారు. కానీ, పప్పుని వేయించి చేసుకుంటే మంచి స్మోకీ ఫ్లేవర్‌తో, కమ్మగా చాలా బాగుంటుంది కందికట్టు.
- ఈ కందికట్టు కోసం ప్రిపేర్ చేసుకునే తాలింపులో పచ్చిమిర్చి, ఎండుమిర్చిలను మీ రుచికి సరిపడా వేసుకోవాలి.
ఈ సమ్మర్లో చారు ఉండాల్సిందే - ఈ పద్ధతిలో చేయండి - ఏకంగా రసం తాగేస్తారు!
వేసవిలో ఒంటికి చలువ చేసే "టిఫెన్" - బరువు తగ్గాలనుకునేవారు, షుగర్ ఉన్నోళ్లు హాయిగా తినొచ్చు!

