ETV Bharat / offbeat

కమ్మటి "టమాటా ఎండుమిర్చి పచ్చడి" - ఈ పద్ధతిలో చేస్తే కడుపునిండా తింటారు - రుచి వేరే లెవల్​!

- అమోఘమైన రుచితో కమ్మని టమాటా పచ్చడి - ఈ పద్ధతిలో చేస్తే అస్సలు వదిలిపెట్టరు!

Tomato Yendu Mirchi Pachadi
Tomato Yendu Mirchi Pachadi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 5, 2025 at 7:04 PM IST

3 Min Read
Choose ETV Bharat

Tomato Yendu Mirchi Pachadi: టమాటా పచ్చడి పేరు వింటేనే ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురుచూస్తుంటారు చాలా మంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి చేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం. ఆ రుచి అంత గొప్పగా ఉంటుంది. అయితే టమాటా పచ్చడిని కూడా చాలా మంది చాలా పద్ధతుల్లో చేస్తుంటారు. కొందరు సంవత్సరానికి సరిపడా నిల్వ పచ్చడి పెడితే మరికొందరు అప్పటికప్పుడు టమాటాలు, పచ్చిమిర్చి ఉపయోగించి రోటి పచ్చడి పెడతారు. ఎలా పెట్టినా వాటి రుచి అమోఘం.

అయితే ఎప్పుడూ తినే పద్ధతిలో కాకుండా, మీరు ఇప్పటి వరకు రుచి చూడని స్టైల్​లో ఒక బ్రహ్మాండమైన టమాటా రోటి పచ్చడిని తీసుకొచ్చాం. దీన్ని ఒక్కసారి రుచి చూశారంటే ఎప్పుడూ పచ్చడి చేసుకున్నా ఇదే తీరును ఫాలో అవ్వడం పక్కా! పైగా తయారీ విధానం కూడా ఈజీగానే ఉంటుంది. కాబట్టి, ఎవరైనా చాలా సింపుల్​గా ఈ పచ్చడిని రెడీ చేసుకోవచ్చు. మరి ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

Tomato
Tomato (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • టమాటాలు - 4
  • నూనె - సరిపడా
  • ధనియాలు - 2 టీస్పూన్లు
  • జీలకర్ర - అర టీస్పూన్​
  • మెంతులు - చిటికెడు
  • ఆవాలు - అర టీస్పూన్​
  • ఎండుమిర్చి - 15 నుంచి 20
  • చింతపండు - ఉసిరికాయ సైజ్​
  • ఉప్పు- సరిపడా
  • పసుపు- అర టీస్పూన్​

తాలింపు కోసం:

  • నూనె - 2 టేబుల్​స్పూన్లు
  • తాలింపు గింజలు - 2టీస్పూన్లు
  • ఎండుమిర్చి - 2
  • ఇంగువ - పావు టీస్పూన్​
  • వెల్లుల్లి రెబ్బలు - 7
  • కరివేపాకు - 2 రెమ్మలు
Dry Chilli
Dry Chilli (Getty Images)

తయారీ విధానం:

  • టమటాలను శుభ్రంగా కడిగి పొడుగ్గా, సన్నని ముక్కలు కట్​ చేసి ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి. అలాగే ఎండుమిర్చి తొడియాలు తీసేసి పక్కన పెట్టాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి 2 టీస్పూన్ల నూనె పోసి వేడి చేసుకోవాలి. అందులోకి ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి వేసి మంచి కలర్​ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి.
Tomato Yendu Mirchi Pachadi
Tomato Yendu Mirchi Pachadi (ETV Bharat)
  • ఆవాలు, మెంతులు మగ్గి ఎండుమిర్చి వేగిన తర్వాత ఓ ప్లేట్​లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
  • ఇప్పుడు అదే పాన్​లో మరో 2 టీస్పూన్ల నూనె వేసి టమాటా ముక్కలు, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్​లో ముక్కలు మెత్తగా ఉడికేవరకు మగ్గించాలి.
  • టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి చల్లారనివ్వాలి.
Tomato Yendu Mirchi Pachadi
Tomato Yendu Mirchi Pachadi (ETV Bharat)
  • మిక్సీజార్​లోకి చల్లారిన ఎండు మిర్చి మిశ్రమం వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఉడికించిన టమాటా మిశ్రమం వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • తాలింపు కోసం స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు(ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు) వేసి ఆవాలను చిటపటలాడించాలి.
Tomato Yendu Mirchi Pachadi
Tomato Yendu Mirchi Pachadi (ETV Bharat)
  • తాలింపు గింజలు వేగిన తర్వాత ఎండుమిర్చి, ఇంగువ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. అనంతరం వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకుని చివరగా కరివేపాకు వేసి చిట్లనివ్వాలి.
  • తాలింపు మిశ్రమం మంచిగా వేగిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి గ్రైండ్​ చేసిన పచ్చడిని కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరంగా, నోటికి కమ్మగా ఉండే టమాటా ఎండుమిర్చి పచ్చడి రెడీ. నచ్చితే మీరూ ఓసారి ఈ పద్ధతిలో పచ్చడి ట్రై చేయండి.
Tomato Yendu Mirchi Pachadi
Tomato Yendu Mirchi Pachadi (ETV Bharat)

చిట్కాలు:

  • ఈ పచ్చడి కోసం పండిన టమాటాలు అయితే రుచి మరింత బాగుంటుంది. అలా అని మరీ పండినవి వాడొద్దు.
  • మెంతులు సరిగా వేగితేనే పచ్చడి రుచి బాగుంటుంది. లేదంటే చేదు వచ్చే అవకాశం ఉంటుంది.
  • ఎండుమిర్చిని మీరు తినే కారానికి అనుగుణంగా వేసుకోవాలి.

టిఫెన్స్​లోకి అద్దిరిపోయే "పెరుగు పులస పచ్చడి" - నిమిషాల్లో రెడీ - టేస్ట్​ సూపర్​!

పాతకాలం నాటి "చక్రాంతం రోటి పచ్చడి" - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు! - టేస్ట్ అద్భుతమే!