ETV Bharat / offbeat

సరికొత్త టమాటా పచ్చడి - మిక్సీ పట్టకుండా, తాలింపు లేకుండానే - రుచి అదుర్స్ అంతే!

- తక్కువ పదార్థాలతో ఎక్కువ రుచినిచ్చే టమాటా చట్నీ - కేవలం నిమిషాల్లోనే సిద్ధం

TOMATO PACHADI
Tomato Chutney Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 3, 2025 at 4:10 PM IST

2 Min Read
Choose ETV Bharat

Easy and Variety Tomato Chutney Recipe : తెలుగు వారికి ఎన్ని రుచికరమైన కూరలు, ఫ్రైలు ఉన్నా వాటితో పాటు ఏదో ఒక పచ్చడి లేనిదే భోజనం పూర్తి కాదు. అంతేకాదు, బయట హోటల్లో భోంచేసినప్పుడు కూడా ఏదో ఒక చట్నీని వడ్డించడం మనం చూస్తూనే ఉంటాం. అందులోనూ చాలా మంది టమాటా పచ్చడిని ఎక్కువ ఇష్టంగా తింటుంటారు.

ఈ క్రమంలోనే రకరకాలుగా, వివిధ రుచుల్లో ఈ చట్నీని ప్రిపేర్ చేసుకుంటుంటారు. అలాంటి వారికోసం ఒక అద్భుతమైన "టమాటా పచ్చడి"ని తీసుకొచ్చాం. దీన్ని మిక్సీ పట్టకుండా(రుబ్బకుండా), తాలింపు అవసరం లేకుండా నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఎప్పుడూ టమాటా చట్నీ చేసుకున్నా ఇదే తీరు ఫాలో అవుతారు. అంతరుచికరంగా ఉంటుంది టేస్ట్! పైగా చాలా తక్కువ పదార్థాలు అవసరం. బ్యాచిలర్స్​ కూడా ఈ చట్నీని చాలా సింపుల్​గా తయారు చేసుకోవచ్చు. మరి, ఈ వెరైటీ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • టమాటాలు - 3 (మీడియం సైజ్​వి)
  • నూనె - కొద్దిగా
  • పచ్చిమిర్చి - తగినన్ని
  • వెల్లుల్లి రెబ్బలు - 10
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఉల్లిపాయ - 1 చిన్న సైజ్​ది
  • కొతిమీర తరుగు - కొద్దిగా

మీరు ఎన్నడూ తిని ఉండరు - "పచ్చి టమాటా పచ్చడి" - టేస్ట్​ నెక్స్ట్​ లెవల్ అంతే!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి, సగానికి రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే, పచ్చిమిర్చి, ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి, మూతపెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత అందులో సన్నని పచ్చిమిర్చి తరుగు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కలిపి, మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద టమాటాలపై స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. అలా మగ్గించుకునేటప్పుడు మధ్యమధ్యలో గరిటెతో కలుపుతుండాలి. లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక టమాటాల స్కిన్ తీసేసి ఆ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి. ఆపై అందులో ఉప్పు వేసుకొని గరిటె లేదా పప్పుగుత్తితో మెత్తగా మాష్ చేసుకోవాలి.
  • అనంతరం అందులో ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర తరుగు వేసుకొని మిక్స్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే "టమాటా పచ్చడి" రెడీ!
  • మరి, నచ్చితే మీరూ ఓసారి ఇలా టమాటా పచ్చడి ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.

బ్యాచిలర్స్ స్పెషల్ కమ్మని "టమాటా పచ్చడి" - ఉడకబెట్టకుండా పదే పది నిమిషాల్లో రెడీ!