ETV Bharat / offbeat

కమ్మని "టమాటా పచ్చడి" - పక్కా కొలతలతో పెడితే సంవత్సరం నిల్వ - టేస్ట్​ సూపర్​!

-వేడి వేడి అన్నంలో అదుర్స్​ అనిపించే టమాట పచ్చడి -ఇలా చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ, పైగా టేస్ట్​ సూపర్​

How to Make Tomato Nilva Pachadi
How to Make Tomato Nilva Pachadi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 14, 2025 at 5:43 PM IST

3 Min Read
Choose ETV Bharat

How to Make Tomato Nilva Pachadi: ప్రతి ఇంట్లో టమాటాలు కచ్చితంగా ఉంటాయి. ఇక వీటితో మెజార్టీ జనం నిల్వ పచ్చళ్లు పెడుతుంటారు. కొద్దిమంది ఉడకబెట్టి పెడితే, మరికొద్దిమంది ఎండబెట్టి ప్రిపేర్​ చేస్తుంటారు. అయితే ఏ పద్ధతిలో పెట్టినా రుచి మంచిగా రాలేదనో, లేకుంటే తొందరగా పాడవుతుందనో బాధపడుతుంటారు. దీంతో టమాటలతో పచ్చళ్లు పెట్టడమే మానేస్తుంటారు. అయితే అలాంటి వారు ఈసారి మేము చెప్పే పక్కా కొలతలతో పచ్చడి పెట్టండి. రుచి సూపర్​గా ఉంటుంది. పైగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మరి లేట్​ చేయకుండా ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

  • నాటు టమాటాలు - 1 కేజీ
  • మెంతులు - 1 టీ స్పూన్​
  • ఆవాలు - 2 టీ స్పూన్లు
  • జీలకర్ర - 1 టీ స్పూన్​
  • చింతపండు - 100 గ్రాములు
  • రాళ్ల ఉప్పు - అర కప్పు (100 గ్రాములు)
  • వెల్లుల్లి రెబ్బలు - పావు కప్పు
  • పసుపు - అర టీ స్పూన్​
  • కారం - 100 గ్రాములు

తాలింపు కోసం:

  • నూనె - 400 ml
  • శనగపప్పు - 1 టేబుల్​ స్పూన్​
  • మినప్పప్పు - 1
  • ఆవాలు - 2 టీస్పూన్లు
  • జీలకర్ర - 1 టీ స్పూన్​
  • ఎండుమిర్చి - 6
  • ఇంగువ - పావు టీ స్పూన్​
  • కరివేపాకు - గుప్పెడు
  • వెల్లుల్లి రెబ్బలు - 15

తయారీ విధానం:

  • టమాటాలను శుభ్రంగా కడిగి నీళ్ల తడి లేకుండా తుడుచుకోవాలి. ఆ తర్వాత మీడియం సైజ్​లో ముక్కలుగా కట్​ చేసుకుని పక్కన పెట్టాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ దినుసులన్నీ వేగిన తర్వాత ఓ గిన్నెలోకి తీసుకుని చల్లార్చుకోవాలి.
  • అదే పాన్​లో టీ స్పూన్​ నూనె, కట్​ చేసిన టమాటా ముక్కలు వేసి మధ్యమధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికించుకోవాలి.
  • టమాటా ముక్కలు మెత్తగా ఉడికి, నీరు పూర్తిగా ఇంకిపోయిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి పక్కన పెట్టాలి.
  • మిక్సీజార్​లోకి వేయించిన దినుసులు, ఉప్పు, చింతపండు వేసి మెత్తగా గ్రైండ్​ చేయాలి. అందులోనే కారం, వెల్లుల్లి రెబ్బలు, పసుపు వేసి మరోసారి గ్రైండ్​ చేసి మూత పెట్టి పక్కన ఉంచాలి.
  • తాలింపు పెట్టుకోవాలి. అందుకోసం స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్​ కాగిన తర్వాత శనగపప్పు, మినపప్పు వేసి వేయించుకోవాలి.
  • ఈ పప్పులు దోరగా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి పూర్తిగా వేయించుకోవాలి.
  • ఇవి వేగిన తర్వాత ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేయాలి. ముఖ్యంగా కరివేపాకును క్రిస్పీగా వేయించుకోవాలి. కరివేపాకు సరిగా వేగకపోతే పచ్చడి తొందరగా పాడవుతుంది.
  • తాలింపు రెడీ అయిన తర్వాత అందులోకి ఉడికించిన టమాటా మిశ్రమం వేసి ఓ 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల టమాటాల్లో ఏమైనా తేమ ఉంటే పోతుంది.
  • 5 నిమిషాల తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్​ చేసుకున్న కారం వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇలా కలిపిన మిశ్రమాన్ని తడి లేని, గాలి చొరబడని డబ్బాలో స్టోర్​ చేసుకుని ఓ రోజు మొత్తం ఊరనివ్వాలి. అంతే ఎంతో కమ్మగా ఉండే టమాటా నిల్వ పచ్చడి రెడీ.
  • మరుసటి రోజు వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడిని వేసుకుని తింటే అమృతమే. కేవలం అన్నంలోకి మాత్రమే కాకుండా టిఫెన్స్​లోకి కూడా పర్ఫెక్ట్​. నచ్చితే మీరూ ఈ పద్ధతిలో ఓసారి ట్రై చేయండి.

సూపర్​ హెల్దీ "టమాటా మసాలా ఓట్స్"​ - 10 నిమిషాల్లోనే రుచికరమైన బ్రేక్​ఫాస్ట్​!

సూరత్ స్పెషల్ "టమాటా బజ్జీలు" - మిర్చి బజ్జీలను మించిన టేస్ట్​!!