సూపర్ హెల్దీ "టమాటా మసాలా ఓట్స్" - 10 నిమిషాల్లోనే రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్!
-హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌గా మసాలా ఓట్స్ - పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు

Published : March 11, 2025 at 2:44 PM IST
How to Make Tomato Masala Oats: మనం రోజంతా ఉత్సాహంగా ఉండటానికి బ్రేక్‌ఫాస్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల చాలా మంది ఇంట్లో చేయడం మానేస్తుంటారు. బయట హోటల్స్, టిఫెన్ సెంటర్స్ వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే అలా బయట తినే ఫుడ్‌తో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్ చేసే టైమ్ లేదంటారా? కేవలం 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ అండ్ హెల్దీ టమాటా మసాలా ఓట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. రుచి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా వద్దనకుండా తినేస్తారు. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- ఉల్లిపాయ - 1
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఉప్పు - రుచికి సరిపడా
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్
- పసుపు - పావు టీ స్పూన్
- నాటు పండిని టమాటాలు - 200 గ్రాములు
- కారం - 1 టీ స్పూన్
- ఓట్స్ - 110 గ్రాములు
- మిరియాల పొడి - పావు టీ స్పూన్
- గరం మసాలా - పావు టీ స్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
తయారీ విధానం:
- ఉల్లిపాయ, టమాటాలను సన్నగా కట్ చేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించాలి.
- ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత కరివేపాకు వేసి మరో నిమిషం పాటు ఫ్రై చేయాలి.
- ఉల్లిపాయలు లైట్‌గా రంగు మారిన తర్వాత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలిపి అల్లం పచ్చివాసన పోయే వరకు మరిగించుకోవాలి.
- టమాటా ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి.
- టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత పావు లీటర్ నీళ్లు పోసుకోవాలి. నీళ్లను ఓ సారి కలిపి మూత పెట్టి మరిగించుకోవాలి.
- నీరు బాగా మరుగుతున్నప్పుడు కారం వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత ఓట్స్ వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.
- మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఓట్స్ దగ్గరకు అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి. ఓట్స్ బాగా ఉడికిన తర్వాత మిరియాల పొడి, గరం మసాలా వేసి కలుపుకోవాలి.
- చివరగా కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టమాటా మసాలా ఓట్స్ రెడీ.
- కేవలం 10 నిమిషాల్లోనే ఈ రెసిపీ రెడీ అవుతుంది. నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి.
రెగ్యులర్ దోశ తిని బోర్ కొట్టిందా? - ఇలా "పంచరత్న దోశ" ట్రై చేయండి - సూపర్‌గా ఉంటుంది!
"మఖానా గుంత పొంగనాలు" - ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్ - పైగా ఆరోగ్యం బోనస్!

