ETV Bharat / offbeat

సూరత్ స్పెషల్ "టమాటా బజ్జీలు" - మిర్చి బజ్జీలను మించిన టేస్ట్​!!

మిర్చి బజ్జీల కంటే అద్దిరిపోయే స్నాక్ - ఇలా చేసి ఇచ్చారంటే పిల్లలు ఒక్కటీ మిగల్చరు!

Tomato Bajji
Tomato Bajji at Home (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 10, 2025 at 1:10 PM IST

2 Min Read
Choose ETV Bharat

How to Make Tomato Bajji at Home : ఎక్కువ మంది ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్​లో ముందు ప్లేస్​లో ఉంటుంది బజ్జీ. మనందరికీ బజ్జీ అనగానే మిర్చి బజ్జీనే గుర్తుకొస్తుంది. కానీ మీకు "మసాలా టమాటా స్లైస్ బజ్జీ" తెలుసా? ఇది సూరత్ స్పెషల్ స్ట్రీట్ ఫుడ్. బయట కరకరలాడుతూ, లోపల ఘుమాయించే కొత్తిమీర ఫ్లేవర్​తో భలే రుచికరంగా ఉంటాయి ఈ బజ్జీలు. ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పైగా ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ! మరి, ఈ క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • శనగపిండి - 1 కప్పు
  • టమాటాలు - 4
  • అల్లం - అంగుళం ముక్క
  • వెల్లుల్లి రెబ్బలు - 8
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పచ్చిమిర్చి - 3
  • కొత్తిమీర - పిడికెడు
  • నిమ్మకాయ - 1
  • పసుపు - చిటికెడు
  • వంటసోడా - చిటికెడు
  • నూనె - తగినంత

పెసరపప్పుతో ఇలా "కచోరి" చేసుకోండి - టేస్ట్ అద్దిరిపోతుంది! - పిల్లలైతే ఇష్టంగా తింటారు!

తయారీ విధానం :

  • ముందుగా కొత్తిమీర పేస్ట్​ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పచ్చిమిర్చి తుంపలు వేసుకొని నిమ్మరసం పిండాలి. ఆపై సాధ్యమైనంత తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్​లా మిక్సీ పట్టుకొని పక్కనుంచాలి.
  • ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్​లో జల్లించిన శనగపిండిని తీసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, 1 టీస్పూన్ నూనె వేసి విస్కర్ సహాయంతో మొత్తం కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ వేగంగా నాలుగైదు నిమిషాలపాటు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవడం ద్వారా శనగపిండి తేలికపడి బజ్జీలు చక్కగా వస్తాయి.
  • ఆ విధంగా పిండిని మిక్స్ చేసుకున్నాక వంటసోడా వేసి మరో నిమిషం పాటు బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు కొంచం పెద్ద సైజ్​ తోలు మందంగా ఉన్న టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. ఆ తర్వాత పావు అంగుళం పరిమాణంలో చిన్న చిన్న స్లైసులుగా కట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటా స్లైసులన్నీ ఒక్కొక్కటిగా పరచాలి. ఆపై వాటి మీద ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్​ని కొద్దిగా అప్లై చేసుకోవాలి.
  • అనంతరం స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక కొత్తిమీర పేస్ట్ అప్లై చేసిన టమాటా స్లైసులను ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో డిప్ చేసి కాగుతున్న ఆయిల్​లో వేసుకోవాలి.
  • ఆపై హై-ఫ్లేమ్ మీద బజ్జీలు క్రిస్పీగా, గోల్డెన్ కలర్​లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే సూరత్ స్పెషల్ "మసాలా టమాటా స్లైస్ బజ్జీలు" రెడీ!
  • వీటిని వేడిగా ఉన్నప్పుడే తినాలి. లేదంటే చల్లారితే మెత్తబడి అంత రుచికరంగా ఉండవని గుర్తుంచుకోవాలి.

రోజూ అదే ఉప్మా పెడితే ఎలా తింటారు? - ఈసారి "బ్రెడ్ ఉప్మా" పెట్టండి - కిర్రాగ్గా కుమ్మేస్తారు​!