ETV Bharat / offbeat

వెండి వస్తువులు నల్లగా మారకముందే ఇలా చేద్దాం! - దీర్ఘకాలం మెరిసిపోతూ ఉంటాయి!

-గాలిలోని తేమ కారణంగా వెండి వస్తువులు రంగు మారడం సహజం -ఈ టిప్స్ పాటిస్తే సంవత్సరాల పాటు వెండి ధగధగలే

Tips to Store Silver Items Telugu
Tips to Store Silver Items Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : January 31, 2025 at 2:22 PM IST

2 Min Read
Choose ETV Bharat

Tips to Store Silver Items Telugu: బంగారం తర్వాత స్థానం వెండిది. అందుకే, దాదాపు అందరి ఇళ్లల్లో వెండి వస్తువులు ఉంటాయి. కాళ్ల పట్టీల నుంచి చేతి బ్రాస్లెట్లు, దేవుడి విగ్రహాల వరకు చాలా రకాల వెండి వస్తువులు ఉంటాయి. అయితే ప్రకాశవంతంగా మెరిసిపోయే వెండి వస్తువులు, కొన్ని రోజుల తర్వాత మెరుపు తగ్గిపోతాయి. దీంతో చాలా మంది వాటిని తిరిగి మెరిపించేందుకు రకరకాల చిట్కాలు పాటిస్తుంటారు. అయితే అవి నల్లగా మారిన తర్వాత క్లీన్​ చేసే బదులు, ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మేలంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

  • చాలా మంది వెండి ఆభరణాలు ధరించిన తర్వాత మేకప్​ వేసుకుంటారు. కానీ అలా చేయొద్దని నిపుణులు అంటున్నారు. పూర్తిగా రెడీ అయిన తర్వాతే, అంటే మేకప్, పెర్‌ఫ్యూమ్ స్ప్రే చేసుకోవడం వంటి పనులు పూర్తైన తర్వాతే సిల్వర్ యాక్సెసరీస్ ధరించాలంటున్నారు. లేదంటే వీటిలోని రసాయనాలు ఆభరణాల మెరుపును దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు.
  • వర్షం పడుతున్నప్పుడు సిల్వర్ జ్యుయలరీ వేసుకోకపోవడమే ఉత్తమమట. ఒకవేళ అనుకోకుండా అవి తడిసినా ఇంటికి చేరిన వెంటనే ముందుగా వాటిని పొడిగా ఆరబెట్టుకోవాలని, అవసరమైతే వాటికి మరోసారి మెరుగు పెట్టించినా మంచిదే అంటున్నారు.
  • ఇంటి పనులు చేసేటప్పుడు, స్విమ్మింగ్ చేసేటప్పుడు, ఎండలోకి వెళ్లేటప్పుడు కూడా ఈ ఆభరణాలను ధరించకూడదని చెబుతున్నారు.
  • వెండితో తయారు చేసిన ఆభరణాలను శుభ్రం చేయడానికి లిక్విడ్ రూపంలో ఉన్న క్లీనర్లను ఉపయోగించకూడదని, ఎందుకంటే ఇవి ఆభరణాల సందుల్లో చేరి జ్యుయలరీ త్వరగా పాడైపోయేలా చేస్తాయంటున్నారు. కాబట్టి ఇంట్లో లభించే వెనిగర్‌, బేకింగ్‌ సోడా వంటి న్యాచురల్‌ క్లీనర్స్‌తో వీటిని శుభ్రం చేయడం మంచిదని చెబుతున్నారు.
  • పెట్టుకున్న ప్రతిసారీ వెండి ఆభరణాల్ని శుభ్రం చేయాల్సిన అవసరం లేదని, తీసిన వెంటనే వాటిని కాటన్ లేదా మస్లిన్ వస్త్రంతో శుభ్రంగా తుడిస్తే, వాటిపై చేరిన దుమ్ము, ధూళి తొలగిపోతాయంటున్నారు.

ఇలా భద్రపరిస్తే మంచిది :

  • సిల్వర్ జ్యుయలరీని గాలి తగలని, పొడి ప్రదేశంలో భద్రపరచాలి. అలాగే ఇతర ఆభరణాలతో కాకుండా వీటిని విడిగా భద్రపరచాలి. ఈ ఆభరణాలు ఉంచే ప్రదేశం మరింత పొడిగా ఉండేందుకు ఆ ప్రాంతంలో ఒక చాక్‌పీస్ లేదా సిలికా జెల్‌ సాచెట్‌ని ఉంచవచ్చు. ఇవి గాలిలోని తేమని పీల్చుకోవడం ద్వారా ఆభరణాల మెరుపు తగ్గకుండా కాపాడతాయని సూచిస్తున్నారు.
  • జిప్‌లాక్ సౌకర్యం ఉండే ప్లాస్టిక్ బ్యాగ్‌లో వీటిని భద్రపరచడం ద్వారా ఈ ఆభరణాల మెరుపు అధిక కాలం మన్నేలా జాగ్రత్తపడచ్చని చెబుతున్నారు.
  • ఈ జ్యుయలరీని భద్రపరిచే బ్యాగ్ లోపల రెండు వైపులా దూది, మెత్తని కాటన్ లేదా మస్లిన్ వస్త్రాన్ని ఉంచితే అవి వంగిపోకుండా, డ్యామేజ్‌ కాకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు.

కొత్తగా ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి!

కారు ఇన్సూరెన్స్​లో ఈ 3 యాడ్ చేసుకోండి - మీరు పైసా కూడా కట్టాల్సిన పరిస్థితి రాదు!