మండుటెండల్లోనూ మీ ఇల్లు చల్లగా! - ఈ చిట్కాలతో మీ గదిని చల్లబరుచుకోండి!
వేసవిలో వేెడెక్కే ఇంటి వాతావరణం - సింపుల్ చిట్కాలతో కూల్‌గా ఉంచుకోవచ్చు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 20, 2025 at 3:23 PM IST
HOME COOLING TIPS IN SUMMER : వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా వాతావరణం రేయింబవళ్లు ఇబ్బందిగా ఉంటుంది. ఏసీలు, కూలర్లు లేని వారి పరిస్థితి ఇక వర్ణించక్కర్లేదు! పగటి వేళల్లో ఫ్యాన్లు వేసుకుని ఉక్కపోత నుంచి ఉపశమనం పొందినా రాత్రి వేళ కునుకు పట్టడానికి కష్టపడాల్సిందే! పగలంతా ఇంటి పై కప్పు వేడెక్కడం వల్ల రాత్రి సమయంలో ఫ్యాన్ గాలి కూడా వేడిగా ఉంటుంది. అందుకే వేసవిలో ఏసీలు, కూలర్లకు డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇల్లు వేడెక్కకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు మీ ఇల్లు చల్లగా ఉంటుంది.
పట్టు చీరలను ఇలా ఉతికి, బీరువాలో పెడితే - ఎన్ని రోజులైనా కొత్తవాటిలా మెరుస్తూ ఉంటాయి!
ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో ఇంట్లో ఎయిర్ కండిషనర్, కూలర్ లేకుంటే తట్టుకోలేం. ఒకవేళ ఏసీలు, కూలర్లు ఉన్నప్పటికీ అదే పనిగా వాటిని వినియోగించలేం. అందుకే వాటితో పని లేకుండానే ఇంటిని చల్లబరచడానికి కొన్ని మార్గాలున్నాయి. వేసవిలో వేడి గాలుల నుంచి సంరక్షించుకోవడం చాలా ముఖ్యం. వేడి గాలులు మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది ఏసీలు, కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. అని ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు.

కిటికీలను మూసి ఉంచాలి
కిటికీలు ఇంటి వాతావరణాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. ఇంట్లోకి గాలి, వెలుతురు రావడానికి కిటికీలు తెరిచే ఉంచుతాం. వాటిద్వారానే దుమ్ము కూడా ఇంట్లోకి చేరుతుంది. అందుకే వేసవిలో ఉదయం వేళలో కిటికీలను తెరిచి బయటి వాతావరణం వేడెక్కగానే తిరిగి మూసేయాలి. వాటిని అలాగే తెరిచి ఉంచడం వల్ల వేడి గాలి ఇంట్లోకి చేరి ఇంటి వాతావరణం ఉక్కపోతగా మారుతుంది. కిటికీలతో పాటు తలుపులు కూడా మూసే ఉంచితే మేలు. వీలైతే కిటికీలను కప్పి ఉంచేలా కర్టన్లు వేసుకుని వాటిపై నీళ్లు చల్లుకుంటే మంచిది.
ఓవెన్‌ను ఉపయోగించవద్దు
వంటల్లో మైక్రోవేవ్ ఓవెన్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. ఓవెన్ ద్వారా ఎంతో వేడి ఉత్పత్తి అవుతుంది. ఇది ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. అదే విధంగా వంట గది నుంచి వచ్చే వేడి ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి.
లైట్లు, బల్బులను మార్చుకోవాలి
వంటగది ఉపకరణాలు వేసవిలో ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. వాటితో పాటు బల్బులు కూడా వేడిని ఉత్పత్తి చేస్తాయి. పాత బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులు ఉపయోగించడం వల్ల విద్యుత్ ఆదా చేయడంతో పాటు ఇంట్లో ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చు.

పెడస్టల్, టేబుల్ ఫ్యాన్లను వాడుకోవాలి
సీలింగ్ ఫ్యాన్లకు బదులుగా టేబుల్, పెడస్టల్ ఫ్యాన్లను ఉపయోగించడం మంచిది. ఉదయం వేళల్లో సీలింగ్ ఫ్యాన్లు వేసుకున్నా రాత్రిళ్లు కిటికీలను తెరిచి వాటికి దగ్గర్లో స్టాండ్ ఫ్యాన్ల (pedastal) ను వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పగలంతా ఇంటి పైకప్పు వేక్కడం వల్ల సీలింగ్ ఫ్యాన్ వేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకే ఇంట్లో వేడిగాలి బయటకు వెళ్లేలా పెడస్టల్ లేదా టేబుల్ ఫ్యాన్లను ఉపయోగించాలి. వాటి ఎదురుగా ఒక గిన్నెలో చల్లని నీరు లేదా ఐస్ క్యూబ్‌లను ఉంచడం వల్ల గది వాతావరణం చల్లబడుతుంది.
రాత్రి గాలి లోపలికి రానివ్వండి
నిద్రపోవడానికి ముందుగా గది కిటికీలు తెరిచి ఉంచాలి. దాంతో బయటి నుంచి వచ్చే చల్లని గాలి ఇంట్లో వేడిని తగ్గించే అవకాశాలున్నాయి. ఇంట్లో వేడిగాలి బయటికి వెళ్లిపోయేలా చేసి మీ ఇంటిని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. తిరిగి ఉదయం బయట వాతావరణం వేడిగా మారే ముందు కిటికీలను మూసేస్తే సరిపోతుంది.
ఆహా! అనిపించే "సొరకాయ గారెలు" - ఇలా చేస్తే ఒకటికి రెండు ఇష్టంగా తింటారు!
తెల్లవారుజామున 'గుడిస'కు పర్యాటకులు క్యూ - మర్చిపోలేని జ్ఞాపకాలు అందిస్తున్న హిల్‌స్టేషన్

