Tips to Avoid Mosquitoes Naturally: సాధారణంగానే దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇక వర్షాకాలంలో చెప్పక్కర్లేదు. చినుకు పడిందంటే దోమల వ్యాప్తి అధికంగా ఉంటుంది. అందుకే చాలా మంది దోమలను వెళ్లగొట్టేందుకు మస్కిటో కాయిల్స్, స్టిక్స్, రిపెల్లెంట్స్ వాడుతుంటారు. అయితే వీటి వల్ల దోమలు పోవడం అటుంచితే, మన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. అందుకే కెమికల్స్ వాడకుండా దోమలను నేచురల్‌గా తరిమికొట్టొచ్చని సూచిస్తున్నారు. అందుకోసం కొన్ని టిప్స్ పాటించమని సలహా ఇస్తున్నారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

లావెండర్ నూనెతో : దోమలను తరిమికొట్టేందుకు లావెండర్ నూనె పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇంట్లోని అన్ని రూమ్స్, ముఖ్యంగా దోమలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో లావెండర్ ఆయిల్ స్ప్రే చేయమని చెబుతున్నారు. దోమలు మరీ ఎక్కువగా ఉంటే లావెండర్ ఆయిల్‌ని చేతులు, కాళ్లకు రాసుకుంటే, దోమలు కూడా కుట్టవని చెబుతున్నారు.

కర్పూరం: పూజ గదిలో హారతి కోసం ఉపయోగించే కర్పూరంతో కూడా దోమలను తరిమికొట్టొచ్చని నిపుణులు అంటున్నారు. అందుకోసం సాయంత్రం కాగానే కిటికీలు, తలుపులు మూసి కాస్త కర్పూరం, వేపాకులు కలిపి పదిహేను నిమిషాల పాటు పొగ వేస్తే చాలంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల పొగకు దోమలు ఇంట్లోకి రావంటున్నారు. ఒకవేళ వేపాకులు లేకపోతే కర్పూరంతో పొగ వేసినా సరిపోతుందని సూచిస్తున్నారు.

కలబంద: ఇంటి చుట్టూ తులసి, వేప, యూకలిప్టస్ వంటి చెట్లు ఉంటే దోమల శాతం తగ్గుతుందని అంటున్నారు. ఇక కలబంద దోమ కాటుకి ఔషధంలా పని చేస్తుందని అంటున్నారు. ఎందుకంటే దోమ కుట్టిన ప్రాంతంలో కలబంద గుజ్జును రాస్తే వెంటనే ఉపశమనం లభిస్తుందంటున్నారు. అలాగే తులసి ఆకులు లేదంటే వేప ఆకుల పేస్ట్‌ని రాసినా ఆ ప్రాంతంలో దద్దుర్లు, దురద వంటివి రావని సలహా ఇస్తున్నారు.

సాంబ్రాణి: అరోమాల్యాంప్స్‌లో కర్పూరం, సాంబ్రాణి సహా వేప నూనె, యూకలిప్టస్ ఆయిల్, లెమన్ గ్రాస్ నూనె, లావెండర్ నూనె ఇలా వీటిలో ఏదైనా ఒకటి వేసి పెట్టుకుంటే దోమల బెడద ఉండదని నిపుణులు అంటున్నారు. పైగా రూమ్ ప్రెషనర్గానూ సూట్ అవుతుందని చెబుతున్నారు.

పెప్పర్‌మెంట్ ఆయిల్: ఇంటి నుంచి దోమలను తరిమి కొట్టేందుకు ఈ నూనె ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం ఓ స్ప్రే బాటిల్లో వాటర్ పోసి అందులో కొన్ని చుక్కలు పెప్పర్‌మెంట్ నూనె(National Library of Medicine) వేయాలి. ఒకవేళ ఇష్టమైతే ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా కలిపి బాగా షేక్ చేసి స్ప్రే చేస్తే దోమల బెడద ఉండదని చెబుతున్నారు.

వెల్లుల్లి రెబ్బలు: కూరల రుచిని పెంచేందుకు ఉపయోగించే వెల్లుల్లి, దోమలను నివారిస్తుందని నిపుణులు అంటున్నారు. కొన్ని వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి, నూనె లేదా నెయ్యితో పాటు కాస్తంత కర్పూరం వేసి వెలిగించుకుంటే ఆ పొగకు దోమలు నశిస్తాయని చెబుతున్నారు. లిక్విడ్ రీఫిల్స్, రిపల్లెంట్స్, మస్కిటో కాయిల్స్ కంటే ఈ చిట్కా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందంటున్నారు.
విమానంలో ఇప్పుడు "మోస్ట్ వాంటెడ్ సీటు 11A" - అదే రమేష్‌ను కాపాడిందా! - ఇక నుంచి భారీ డిమాండ్?
మీరు వాడే "జీలకర్ర" కల్తీది కావొచ్చు - FSSAI సూచిస్తున్న ఈ సింపుల్ ట్రిక్‌తో ఈజీగా గుర్తించండి!