ETV Bharat / offbeat

ఓవెన్​ లేకుండా - సూపర్​ టేస్టీ "కొబ్బరి బిస్కెట్లు, నాన్​ ఖటాయ్​" - ఇంట్లోనే చేసుకోండిలా! - COCONUT AND NAN KHATAI BISCUITS

-బిస్కెట్లంటే పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు - బయట కొనకుండా ఇంట్లోనే చేసుకోండి, సూపర్​ టేస్ట్​!

Coconut Biscuits
Coconut Biscuits (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : June 20, 2025 at 11:35 AM IST

3 Min Read

Tatsy and Healthy Biscuits: 'బిస్కెట్లు' చిన్న పిల్లల ఫేవరెట్​ ఐటమ్​. ఇక వీటిల్లో కూడా ఎన్నో రకాల ఫ్లేవర్లు ఉన్నాయి. అందుకే బయటికి వెళ్లారంటే, కచ్చితంగా రెండు మూడు రకాల ఫ్లేవర్స్​ కలిగిన ప్యాకెట్లు కొనాల్సిందే. ఇక వీటిని కొద్దిమంది టీ లేదా పాలలో ముంచుకుని తింటే, మరికొద్దిమంది నేరుగా తింటుంటారు. ఎలా తిన్నా వీటి టేస్ట్​ అద్దిరిపోతాయి. అయితే ఇకపై బిస్కెట్లు తినాలనిపించినప్పుడు బయట మార్కెట్లో కొనకుండా ఇంట్లోనే చాలా సింపుల్​గా ప్రిపేర్​ చేసుకోవచ్చు. అందుకు మీకోసం రెండు రకాల బిస్కెట్​ రెసిపీలు తీసుకొచ్చాం. వీటి టేస్ట్​ అద్దిరిపోతాయి. మరి లేట్​ చేయకుండా ఆ బిస్కెట్లు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.

కొబ్బరి బిస్కెట్లు:

కావలసినవి:

  • మైదా - అర కప్పు
  • వెన్న - అర కప్పు
  • పంచదార పొడి -అర కప్పు
  • ఎండు కొబ్బరి తురుము - అర కప్పు
  • ఉప్పు - చిటికెడు
  • బేకింగ్‌ పౌడర్‌ - చెంచా
  • మిల్క్‌ పౌడర్‌ - 3 టేబుల్‌ స్పూన్లు
  • చిక్కటి పాలు - 3 చెంచాలు
Icing Sugar
Icing Sugar (Getty Images)

తయారీ విధానం:

  • ఓ ప్లేట్​లోకి బటర్​, షుగర్ పౌడర్​​ వేసి 5 నిమిషాల పాటు హై స్పీడ్​లో బీట్​ చేయాలి.
  • ఆపై అందులోకి మైదా, కొబ్బరి తురుము, మిల్క్‌ పొడి, పాలు, బేకింగ్‌ పౌడర్, ఉప్పు వేసి బాగా మిక్స్​ చేసుకోవాలి.
  • బేకింగ్​ ట్రే లేదా ఓ స్టీల్​ ప్లేట్​ తీసుకుని లైట్​గా బటర్​ అప్లై చేయాలి.
  • ఆ తర్వాత ఐస్‌క్రీమ్‌ స్కూప్‌తో చిన్న ఉండల్లా తీసి బిస్కెట్లుగా చేయాలి. ఇలా చేసిన బిస్కెట్స్​ను ఎండు కొబ్బరి తురుములో డిప్​ చేసి రెండువైపులా కోట్​ చేయాలి.
Coconut
Coconut (Getty Images)
  • ఇలా కోట్​ చేసిన బిస్కెట్లను బటర్​ అప్లై చేసిన ప్లేట్​ లేదా ట్రేలో ఉంచాలి. మిగిలిన పిండితో కూడా ఇలానే చేసి ప్లేట్​లో పెట్టుకోవాలి.
  • అవెన్‌ను 170 డిగ్రీల వద్ద ప్రీహీట్‌ చేసి 18 నిమిషాలు బేక్‌ చేయాలి. అదే ఓవెన్​ లేకుండా అయితే స్టవ్​ ఆన్​ చేసి అడుగు మందంగా ఉన్న పాన్​ పెట్టి అందులో ఒక లేయర్​ వరకు ఇసుక లేదా ఉప్పు పోసుకోవాలి.
  • ఆపై దాని మధ్యలో స్టాండ్​ లేదా ప్లేట్​ ఉంచి మూత పెట్టి హై ఫ్లేమ్​లో పది నిమిషాలు ప్రీహీట్​ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మూత తీసి కొబ్బరి బిస్కెట్లు ఉన్న ప్లేట్​ను స్టాండ్​ మీద ఉంచి మూత పెట్టి సిమ్​లో 25 నుంచి 30 నిమిషాలు కుక్​ చేసుకోవాలి.
  • బిస్కెట్లు రెడీ అయిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి ఓ 5 నిమిషాల తర్వాత మూత తీస్తే తియ్యటి కొబ్బరి బిస్కెట్లు రెడీ.
Coconut Biscuits
Coconut Biscuits (Getty Images)

నాన్‌ ఖటాయ్‌

కావలసినవి:

  • గోధుమపిండి - పావు కేజీ
  • నెయ్యి - 125 గ్రాములు
  • యోగర్ట్‌ - 125 గ్రాములు
  • ఐసింగ్‌ షుగర్‌ - పావు కప్పు
  • శనగపిండి - 125 గ్రాములు
  • యాలకుల పొడి - అర చెంచా
  • డ్రై ఫ్రూట్స్‌ పలుకులు - గుప్పెడు
Ghee
Ghee (Getty Images)

తయారీ:

  • మిక్సింగ్‌ బౌల్‌లోకి గోధుమపిండి, నెయ్యి, యోగర్ట్​, పంచదార పొడి, శనగపిండి, యాలకుల పొడి వేసి బాగా మిక్స్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు బేకింగ్​ ట్రే లేదా ఓ స్టీల్​ ప్లేట్​ తీసుకుని లైట్​గా బటర్​ అప్లై చేయాలి.
  • పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొద్దికొద్దిగా తీసుకుని గుండ్రటి బిస్కెట్లు చేయాలి. ఆ బిస్కెట్ల మధ్యలో లైట్​గా గాటు పెట్టి డ్రై ఫ్రూట్స్‌ పలుకులు చల్లి బేకింగ్‌ ట్రేలో సెట్​ చేసుకోవాలి. ఒకదానికొకటి తగలకుండా కొంచెం ఖాళీ ఉండాలి.
  • అవెన్‌ను ప్రీహీట్‌ చేసి 180 డిగ్రీల వద్ద 18 నిమిషాలు బేక్‌ చేయాలి. అదే ఓవెన్​ లేకుండా అయితే స్టవ్​ ఆన్​ చేసి అడుగు మందంగా ఉన్న పాన్​ పెట్టి అందులో ఒక లేయర్​ వరకు ఇసుక లేదా ఉప్పు పోసుకోవాలి.
Besan Flour
Besan Flour (Getty Images)

  • ఆ తర్వాత మూత తీసి బిస్కెట్లు ఉన్న ప్లేట్​ను స్టాండ్​ మీద ఉంచి మూత పెట్టి సిమ్​లో 20 నుంచి 25 నిమిషాలు కుక్​ చేసుకోవాలి.
  • బిస్కెట్లు రెడీ అయిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి చల్లారాక చూస్తే నాన్​ ఖటాయ్​ రెడీ. నచ్చితే మీరూ ఈ బిస్కెట్లను రెడీ చేసి పిల్లలకు పెట్టండి.
Nan Khatai
Nan Khatai (Getty Images)

క్రిస్పీ అండ్​ టేస్టీ "వంకాయ పకోడీ" - ఇలా చేసుకుంటే 15 రోజులు నిల్వ! - నూనె పీల్చవు!

ఓవెన్, ఈస్ట్ లేకుండానే "దిల్​పసంద్"- ప్రిపరేషన్ వెరీ ఈజీ - బేకరీ స్టైల్ టేస్ట్​ పక్కా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.