ETV Bharat / offbeat

కమ్మని "దిలీప పాయసం" - పక్కా కొలతలతో టేస్ట్​ అదుర్స్​ - పైగా ప్రొటీన్​ పుష్కలం! - TASTY DILEEPA PAYASAM

-సరికొత్త రుచిలో ఎన్నడూ తినని పెసరపప్పు పాయసం -పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టంగా లాగిస్తారు!

Tasty Dileepa Payasam
Tasty Dileepa Payasam (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 16, 2025 at 10:10 AM IST

2 Min Read

Tasty Dileepa Payasam: 'పాయసం' స్వీట్​ రెసిపీలలో మెజార్టీ జనం ఎక్కువగా తినేది. పండగలు, వ్రతాలు, పూజల సమయాల్లో చాలా మంది ఈ రెసిపీని ప్రిపేర్​ చేస్తుంటారు. ఇక ఈ పాయసాన్ని కూడా చాలా మంది వివిధ రకాలుగా చేస్తుంటారు. కొందరు బియ్యంతో చేస్తే, మరికొందరు సగ్గుబియ్యంతో చేస్తారు. ఇంకొందరు సేమ్యా పాయసం చేస్తారు. మరి మీరు ఎప్పుడైనా దిలీప పాయసం తిన్నారా? చాలా రుచికరంగా ఉండే ఈ పాయసం అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతుంది. పైగా చాలా తక్కువ పదార్థాలతో తయారు చేసుకోవచ్చు. ఈ పాయసాన్నే పెసరపప్పు పాయసం కూడా అంటారు. మరి లేట్​ చేయకుండా ఈ రెసిపీపై ఓ లుక్కేయండి.

Milk
Milk (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • పెసరపప్పు - 2 కప్పులు
  • నెయ్యి - తగినంత
  • బెల్లం - రెండున్నర కప్పులు
  • యాలకుల పొడి - అర టీ స్పూన్​
  • పాలు - 3 కప్పులు
  • జీడిపప్పు - 10
  • కిస్మిస్​ - 10
Moong Dal
Moong Dal (Getty Images)

తయారీ విధానం:

  • ముందుగా పాలను బాగా మరిగించి చల్లార్చుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి మందపాటి గిన్నె పెట్టి నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నీళ్లను పెసరపప్పు ఉడకడానికి సరిపడేలా పోసుకుంటే సరిపోతుంది. అంటే రెండు కప్పుల పెసరపప్పుకు మూడు లేదా నాలుగు కప్పుల నీరు పోసుకుంటే సరిపోతుంది. ఈ నీటిని మరిగించుకోవాలి.
Jaggery
Jaggery (Getty Images)
  • ఇంకో స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. అందులోకి జీడిపప్పు, కిస్మిస్​ వేసి ఎర్రగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • అదే నెయ్యిలో పెసరపప్పు వేసి దోరగా వేయించుకుని స్టవ్​ ఆఫ్​ చేసి మరుగుతున్న నీటిలో వేసుకోవాలి.
  • పెసరపప్పును మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. పప్పు బాగా ఉడికిన తర్వాత బెల్లం తురుము వేసి కలుపుకోవాలి.
Dileepa Payasam
Dileepa Payasam (ETV Bharat)
  • బెల్లం కరిగి ఉడుకుతున్నప్పుడు వేయించిన డ్రైఫ్రూట్స్​ను కొన్ని, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.
  • పప్పు, బెల్లం బాగా ఉడికిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు ఆ పాయసంలోకి కాచి చల్లార్చిన పాలను పోసుకోవాలి.
  • ఇప్పుడు ఈ పాయసాన్ని ఓ బౌల్​లోకి తీసుకని మిగిలిన డైఫ్రూట్స్​తో గార్నిష్​ చేసుకుంటే దిలీప పాయసం రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Pesarapappu Payasam
Pesarapappu Payasam (ETV Bharat)

చిట్కాలు:

  • పప్పును వేయించుకుండానే ఓసారి కడిగి కుక్కర్​లో ఉడికించినా సరిపోతుంది.
  • పాల బదులు చిక్కటి కొబ్బరి పాలు పోసి చేసుకున్నా రుచి అద్దిరిపోతుంది.
  • కేవలం జీడిపప్పు, కిస్మిస్​ మాత్రమే కాకుండా బాదం, చిరోంజి వంటి ఇతర డ్రైఫ్రూట్స్​ కూడా యాడ్​ చేసుకోవచ్చు.

పాకంతో పని లేని "క్యారెట్ సగ్గుబియ్యం పాయసం" - ఒక్కసారి తింటే స్వీట్ కావాలన్నా ప్రతిసారీ దీనికే మీ ఓటు!

సమ్మర్ స్పెషల్ "తాటిముంజల పాయసం" - మండుటెండల్లో కూల్​కూల్​గా ఒక్కో గుటక వేస్తుంటే ఆ మజానే వేరు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.