ETV Bharat / offbeat

రెండే రెండు ఉల్లిపాయలతో కిర్రాక్​ "చట్నీ" - బ్రేక్​ఫాస్ట్​ ఏదైనా పర్ఫెక్ట్ కాంబినేషన్​​ - నిమిషాల్లో రెడీ!

- ఇంటిల్లిపాదీ మెచ్చే సూపర్ పచ్చడి - కేవలం నిమిషాల్లోనే రెడీ!

Tasty and Instant Onion Chutney
Tasty and Instant Onion Chutney (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 14, 2025 at 7:06 PM IST

2 Min Read
Choose ETV Bharat

Tasty and Instant Onion Chutney: బ్రేక్​ఫాస్ట్​ ఏదైనా అందులోకి కాంబినేషన్​గా చట్నీ ఉండాల్సిందే. అయితే మెజార్టీ జనాలు టిఫెన్స్​లోకి పల్లీ చట్నీ చేస్తుంటారు. రెగ్యులర్​గా అదే తినాలంటే కాస్త బోర్​ కొడుతుంది. కొత్తగా ఏదైనా పచ్చడి చేయొచ్చు కదా అని అమ్మలను అడుగుతుంటారు. దీంతో టిఫెన్స్​లోకి ఏం చేయాలా అని తెగ ఆలోచిస్తుంటారు. అయితే ఇకపై అలా ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఈ పచ్చడి చేసుకోండి. అదే ఉల్లిపాయ పచ్చడి. ఈ పచ్చడిని చాలా రకాలుగా చేసి ఉంటారు కానీ, ఓసారి ఈ పద్దతిలో చేసుకోండి. టిఫెన్​ కన్నా పచ్చడే ఎక్కువ తినేస్తారు. పైగా ఈ పచ్చడి కోసం ఎక్కువ ఉల్లిపాయలు అవసరం లేదు. జస్ట్​ రెండు ఉల్లిపాయలు చాలు. చేసుకోవడం కూడా నిమిషాల్లో పని. మరి లేట్​ చేయకుండా ఈ ఆనియన్​ చట్నీ ఎలా చేయాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

  • నూనె - 2 టీస్పూన్లు
  • ఉల్లిపాయలు - 2(మీడియం సైజ్​)
  • ఎండుమిర్చి - 10
  • వెల్లుల్లి రెబ్బలు - 15
  • చింతపండు - ఉసిరికాయ సైజ్​
  • ఉప్పు - రుచికి సరిపడా

తాలింపు కోసం:

  • నూనె - 2 టీస్పూన్లు
  • ఆవాలు - అర టీస్పూన్​
  • జీలకర్ర - అర టీస్పూన్​
  • శనగపప్పు - అర టీస్పూన్​
  • మినపప్పు - అర టీస్పూన్​
  • కరివేపాకు - 2 రెమ్మలు
Instant Onion Chutney
Instant Onion Chutney (ETV Bharat)

తయారీ విధానం:

  • ముందుగా ఉల్లిపాయల పొట్టు తీసేసి పొడుగ్గా, మీడియం సైజ్​లో కట్​ చేసుకుని పక్కన ఉంచాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి పెట్టుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు వేసి అవి సెపరేట్​ అయ్యేంతవరకు వేయించాలి.
  • ఉల్లిపాయలు లైట్​గా మగ్గిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి లో ఫ్లేమ్​లో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత తొడిమలు తీసేసిన ఎండుమిర్చి వేసి కలిపి మరో నిమిషం వేయించుకోవాలి.
Instant Onion Chutney
Instant Onion Chutney (ETV Bharat)
  • చివరగా చింతపండు వేసి ఓ నిమిషం సేపు వేయించి స్టవ్​ ఆఫ్​ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
  • ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీజార్​లో వేసి ముందుగా కచ్చాపచ్చాగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఆ తర్వాత కొద్దిగా వాటర్, ఉప్పు వేసి​ వీలైనంత మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి. అలాగే నీళ్లను మరీ ఎక్కువగా, మరీ తక్కువగా కాకుండా పోసుకోవాలి.
Instant Onion Chutney
Instant Onion Chutney (ETV Bharat)
  • ఇలా గ్రైండ్​ చేసిన పచ్చడిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. ఆయిల్​ హీటెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి లో ఫ్లేమ్​లో ఎర్రగా వేయించాలి.
  • ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసి క్రిస్పీగా వేయించి స్టవ్​ ఆఫ్​ చేయాలి. చివరగా ఈ తాలింపును పచ్చడిలో కలుపుకుంటే సూపర్​ టేస్టీగా ఉండే ఉల్లిపాయ చట్నీ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Instant Onion Chutney
Instant Onion Chutney (ETV Bharat)

చిట్కాలు:

  • ఈ పచ్చడి కోసం ఉల్లిపాయలు పెద్దది అయితే ఒకటి, మీడియం సైజ్​వి అయితే రెండు తీసుకోవాలి.
  • మీరు తినే కారానికి అనుగుణంగా ఎండుమిర్చి తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఎండుమిర్చి లేకపోతే ఉల్లిపాయలను గ్రైండ్​ చేసే ముందు ఎండు కారం అయినా కలుపుకోవచ్చు.
  • ఉల్లిపాయలను నూనెలో వేయించేటప్పుడు అవి మరీ రంగు మారకూడదని గుర్తించుకోవాలి. లైట్​గా మగ్గితే చాలు.
  • మీకు పచ్చడి పల్చగా కావాలనుకుంటే నీళ్లు ఎక్కువ కలుపుకోవచ్చు. కానీ ఈ పచ్చడి కాస్త గట్టిగా ఉంటేనే రుచి బాగుంటుంది.
Instant Onion Chutney
Instant Onion Chutney (ETV Bharat)

క్యాటరింగ్​ స్టైల్​ "టమాటా పచ్చడి" - పుల్ల పుల్లగా అద్దిరిపోతుంది - అన్నం, టిఫెన్స్​లోకి పర్ఫెక్ట్​!

అమ్మమ్మల కాలం నాటి కమ్మని "పెసరపప్పు పచ్చడి" - సమ్మర్​లో ఒంటికి చలువ, పొట్టకి హాయి!