ETV Bharat / offbeat

ఇంట్లో చేసిన బజ్జీలు నూనె పీల్చుతున్నాయా? - ఓసారి ఇలా చేయండి - చుక్క ఆయిల్​ ఉండదు!

- అందరూ మెచ్చే మిర్చీ బజ్జీలు - సింపుల్​గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండిలా!

Tasty and Crispy Mirchi Bajji
Tasty and Crispy Mirchi Bajji (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : June 26, 2025 at 1:10 PM IST

4 Min Read
Choose ETV Bharat

Tasty and Crispy Mirchi Bajji: స్నాక్స్​లో చాలా మంది ఫేవరెట్​ అంటే "మిర్చీ బజ్జీలు" ఫస్ట్​ ప్లేస్​లో ఉంటాయి. సాయంత్రం అయ్యిందంటే చాలా మంది వీటిని ఇష్టంగా తింటుంటారు. వేడివేడి బజ్జీలను ఉల్లిపాయ స్టఫ్ఫింగ్​, టమాటా చట్నీతో తింటుంటే ఆ కిక్కే వేరు. అయితే బయట లభించే బజ్జీలతో పోలిస్తే, ఇంట్లో చేసినవి అంత పర్ఫెక్ట్​గా కుదరవు. పైగా లోపల పిండి ఉడకకపోవడమో, నూనె ఎక్కువ పీల్చడమో జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే చాలా మంది చేయాలంటే కష్టమని భావిస్తుంటారు. అయితే ఇకపై అలాంటి టెన్షన్​ లేకుండా చాలా సింపుల్​గా ఇంట్లోనే బజ్జీలు ప్రిపేర్​ చేసుకోవచ్చు. పైగా దీని కోసం పెద్దగా కష్టపడాల్సిన పనికూడా లేదు. మరి లేట్​ చేయకుండా ఈ బజ్జీలు ఎలా చేయాలో చూసేయండి.

Besan Flour
Besan Flour (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • మిరపకాయ బజ్జీలు - 20
  • శనగపిండి - అర కేజీ
  • బియ్యప్పిండి - 2 టీస్పూన్లు
  • ఉప్పు - సరిపడా
  • కారం- 1 టేబుల్​స్పూన్​
  • సాంబార్​ పొడి - 1 టీస్పూన్
  • వాము - అర టీస్పూన్​
  • పసుపు - చిటికెడు
  • బేకింగ్​ సోడా - అర టీస్పూన్​
Mirchi Bajji
Mirchi Bajji (Getty Images)

బజ్జీ స్టఫ్పింగ్​ కోసం:

  • శనగపిండి - 2 టేబుల్​స్పూన్లు
  • ఉప్పు - అర టీస్పూన్​
  • వాము - చిటికెడు
  • చింతపండు - ఉసిరికాయ సైజ్​
Rice Flour
Rice Flour (Getty Images)

తయారీ విధానం:

  • ముందుగా చింతపండును ఓ గిన్నెలోకి తీసుకుని కొన్ని నీళ్లు పోసి నానబెట్టాలి. ఈలోపు బజ్జీ మిరపకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి పక్కన పెట్టాలి.
  • ఓ గిన్నెలోకి శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, పసుపు, కారం, సాంబార్​ పొడి వేసుకోవాలి. అలాగే వామును నలిపి వేసుకుని మొత్తాన్ని మిక్స్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు కొద్దికొద్దిగా వాటర్​ పోసుకుంటూ పిండిని ఒకటే డైరెక్షన్​లో చేతితో లేదా విస్కర్​ సాయంతో మిక్స్​ చేసుకోవాలి.
  • నీళ్లు సరిపోయాయి అనుకున్న తర్వాత ఉప్పు, కారం చూసి, తక్కువైతే ఏమైనా యాడ్​ చేసుకుని మరో 5 నిమిషాల పాటు ఆపకుండా మిక్స్​ చేసుకోవాలి.
Mirchi Bajji
Mirchi Bajji (ETV Bharat)
  • ఇలా కలుపుకున్న పిండి గిన్నెపై మూత పెట్టి పక్కన పెట్టాలి. స్టఫ్పింగ్​ ప్రిపేర్​ చేసుకోవాలి. అందుకోసం నానబెట్టిన చింతపండును గట్టిగా పిండి గుజ్జు ఓ గిన్నెలోకి తీసుకోవాలి. మరో గిన్నెలోకి శనగపిండి, వాము, ఉప్పు వేసి కలిపి పక్కన ఉంచాలి.
  • ఓ మిరపకాయను తీసుకుని చివర కొద్దిగా కట్​ చేయాలి. ఆ తర్వాత మధ్యలోకి గాటు పెట్టి అందులో ఉండే గింజలు తీసేయాలి. ఇలా కాయలన్నింటిలోని గింజలను తీసేయాలి.
  • ఆ తర్వాత ముందే ప్రిపేర్​ చేసుకున్న చింతపండు గుజ్జు, శనగపిండిని స్టఫ్​ చేసుకోవాలి. అందుకోసం మిర్చీ లోపల ముందు చింతపండు గుజ్జు రాయాలి. ఆ తర్వాత శనగపిండిని లైట్​గా అప్లై చేసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. మిగిలిన అన్నింటిని కూడా ఇలానే స్టఫ్​ చేసి పక్కన పెట్టాలి.
Mirchi Bajji
Mirchi Bajji (ETV Bharat)
  • స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి డీప్​ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఆయిల్ హీటెక్కేలోపు ముందే కలిపి పెట్టుకున్న శనగపిండిలో బేకింగ్​ సోడా వేసి మరికొద్దిసేపు కలుపుకోవాలి.
  • స్టఫ్​ చేసిన ఓ మిరపకాయ తీసుకుని శనగపిండిలో ముంచి, అంచుకు రాసి ఆయిల్​లో వేసుకోవాలి.
  • ఇలా కడాయికి సరిపడా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టి రెండు వైపులా తిప్పుతూ లైట్​ గోల్డెన్​ కలర్​ వచ్చే వరకు వేయించాలి.
  • అలా కలర్​ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టాలి. మరికొన్ని మిరపకాయలను కూడా పిండిలో ముంచి నూనెలో వేయాలి. ఇవి లైట్​గా కలర్​ మారిన తర్వాత ముందు వేయించి పక్కన పెట్టిన బజ్జీలు వేసి రెండు వైపులా గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్​లో వేయించాలి.
  • ఇలా రెండు వైపులా ఎర్రగా వేగిన తర్వాత ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి. మిగిలిన పిండితో కూడా ఇలానే వేయాలి.
  • ఆ తర్వాత వీటిని ఓ ప్లేట్​లోకి పెట్టుకుని ఉల్లిపాయ, టమాటా చట్నీతో సర్వ్​ చేసుకుంటే సూపర్​ టేస్టీ మిర్చీ బజ్జీలు రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Mirchi Bajji
Mirchi Bajji (ETV Bharat)

చిట్కాలు:

  • శనగపిండిలో నీటిని ఒక్కసారే పోసుకోకుండా, కొద్దికొద్దిగా యాడ్​ చేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే ఒకటే డైరెక్షన్​లో ఎక్కువ సేపు కలపడం వల్ల బజ్జీలు పర్ఫెక్ట్​గా వస్తాయి.
  • పిండి మరీ జారుగా, మరీ గట్టిగా ఉండకూడదు. జారు అయితే నూనె ఎక్కువ పీల్చుకుంటుంది. గట్టిగా ఉంటే లోపల పిండి ఉడకదు. కాబట్టి చూసి నీళ్లు పోసుకోవాలి. అలాగే పిండిని ఓసారి కలుపుకున్న తర్వాత వేలు ముంచి చూస్తే ఎంత మందానా పట్టింది అనేది తెలిసిపోతుంది. దాన్ని బట్టి పిండి గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్లు, లూజుగా అనిపిస్తే మరికొంచెం పిండి యాడ్​ చేసుకోవచ్చు.
  • నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టి బజ్జీలు వేసుకుని వేయించుకోవాలి. అలాగే బజ్జీలను రెండు సార్లు వేయించుకోవడం వల్ల లోపలి వరకు వేగి టేస్టీగా వస్తాయి.
  • బజ్జీలు వేయడంలో మెయిన్​ ట్రిక్​ ఏంటంటే, మిరపకాయను పిండిలో ముంచిన తర్వాత కచ్చితంగా ఓ వైపు గిన్నె అంచుకు రాసి వేయాలి. ఇలా వేయడం వల్ల బజ్జీలు సరిగ్గా వేగడమే కాదు, టేస్టీగా కూడా ఉంటాయి. నూనె సరిగా కాగకపోతే బజ్జీలు నూనె పీల్చుకుంటాయి.

జొన్న పిండితో మెత్తని "ఇడ్లీలు" - అప్పటికప్పుడు చేసుకోవచ్చు! - చట్నీ ఏదైనా సూపర్​ టేస్ట్​!

అద్దిరిపోయే "పచ్చి టమాటా చట్నీ" - ఒక్కసారి తింటే ఫ్యాన్ అయిపోతారు - అన్నం, టిఫెన్స్​లోకి పర్ఫెక్ట్​!