ETV Bharat / offbeat

ఘాటు ఘాటుగా "అల్లం చారు" - ఈ సీజన్​లో ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

- ఇంటిల్లిపాదికీ ఎంతో మంచిది - చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు

Tasty Allam Charu Recipe
Tasty Allam Charu Recipe (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : August 31, 2025 at 4:02 PM IST

3 Min Read
Choose ETV Bharat

Tasty Allam Charu Recipe : వర్షాకాలంలో మారిన వాతావణం కారణంగా చాలా మంది జ్వరం, జలుబు, దగ్గు వంటి సీజనల్ ప్రాబ్లమ్స్​తో బాధపడుతుంటారు. దాంతో నోటికి ఏం తిందామన్నా రుచికరంగా అనిపించదు. అలాగే, మరికొందరు చల్లని వేళ ఊరించే కూరలెన్నున్నా, కమ్మగా చారుతో తినడానికి ఇష్టపడుతుంటారు. అలాంటి వారందరి కోసం సింపుల్​గా ప్రిపేర్​ చేసుకునే ఒక సూపర్ రసం రెసిపీని తీసుకొచ్చాం. అదే, స్పైసీ అండ్ టేస్టీ "అల్లం చారు". ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీ వేడివేడి అన్నంలో రోజూ తినే దానికంటే నాలుగు ముద్దలు ఎక్కువే లాగిస్తారు! పిల్లలకు కూడా ఈ చారు చాలా బాగా నచ్చుతుంది. మరి, ఘాటు ఘాటుగా ఘుమాయించే ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Tasty Allam Charu Recipe
అల్లం (Getty Images)

అవసరమైన పదార్థాలు :

  • మూడు చెంచాలు - కందిపప్పు
  • రెండు - కరివేపాకు రెబ్బలు
  • పావుచెంచా - పసుపు
  • ఒకట్రెండు - టమాటాలు
  • చెంచా - మిరియాలు
  • అంగుళం ముక్క - అల్లం
  • ఆరు - వెల్లుల్లి రెబ్బలు
  • చెంచా - జీలకర్ర
  • అరచెంచా - ధనియాలు
  • రెండు చెంచాలు - కొత్తిమీర తరుగు
  • మూడు చెంచాలు - నిమ్మరసం
  • రుచికి తగినంత - ఉప్పు

ఘుమఘుమలాడే "టమాటా రసం" - ఇలా చేస్తే ఫ్యామిలీ మొత్తం రుచికి ఫిదా!

Tasty Allam Charu Recipe
కందిపప్పు (Getty Images)

తయారీ విధానం :

  • సింపుల్​గా చేసుకునే ఈ చారు తయారీ కోసం అరగంట ముందుగా ఒక గిన్నెలో కందిపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి.
  • అరగంట తర్వాత బాగా నానిన కందిపప్పుని కుక్కర్ గిన్నెలోకి తీసుకొని పసుపు, కరివేపాకు, టమాటా ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి నాలుగైదు విజిల్స్ పాటు ఉడికించుకోవాలి.
  • పప్పు మిశ్రమం మెత్తగా ఉడికి ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి అందులో అరలీటర్ నీళ్లను పోసి కలిపి ఒకసారి మిశ్రమాన్ని మెత్తగా మెదుపుకోవాలి.
  • ఆపై ఆ మిశ్రమాన్ని మరో గిన్నెలోకి వడకట్టి పలుచటి పప్పు నీళ్లని మాత్రమే తీసుకోవాలి.
Tasty Allam Charu Recipe
మిరియాలు (Getty Images)
  • ఇప్పుడు చిన్న మిక్సీ గిన్నెలో మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, ధనియాలు వేసుకొని కచ్చాపచ్చాగా పొడిలా మిక్సీ పట్టుకొని పక్కనుంచాలి.
  • అనంతరం చారు తయారీకి స్టవ్‌ మీద వడకట్టుకున్న పప్పు నీళ్లు ఉన్న గిన్నె పెట్టి స్టవ్​ను లో ఫ్లేమ్​లో ఉంచి అందులో టేస్ట్​కి సరిపడా ఉప్పు, కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న మిరియాలు-అల్లం మిశ్రమాన్ని వేసుకుని ఒకసారి బాగా కలపాలి.
  • ఆపై లో టూ మీడియం ఫ్లేమ్​లో ఆ మిశ్రమం ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి.
  • ఆ మిశ్రమాన్ని బాగా మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో నిమ్మరసం యాడ్ చేసుకొని కొత్తిమీర తరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఆ చారుకు తాలింపును సిద్ధం చేసుకోవాలి.

కమ్మని "పుదీనా టమాటా పచ్చడి" - పచ్చిమిర్చి స్పెషల్ - రైస్, టిఫెన్లకు చక్కటి జోడి!

Tasty Allam Charu Recipe
నిమ్మరసం (Getty Images)

తాలింపు కోసం :

  • నూనె - ఒకట్రెండు చెంచాలు
  • ఆవాలు - అరచెంచా
  • మెంతులు - పావు చెంచా
  • ఎండుమిర్చి - రెండు
  • ఇంగువ - చిటికెడు
  • కరివేపాకు - రెండు రెబ్బలు
Tasty Allam Charu Recipe
పోపు దినుసులు (Getty Images)
  • ఇందుకోసం స్టవ్ మీద చిన్న పాన్ పెట్టుకొని అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, మెంతులు వేసి వేయించాలి.
  • అవి లైట్​గా వేగాక ఎండుమిర్చి తుంపలు, కరివేపాకు, ఇంగువ వేసుకొని పోపును చక్కగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • అనంతరం మంచిగా వేగిన తాలింపును ముందుగా ప్రిపేర్ చేసుకున్న చారులో వేసుకొని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకుంటే చాలు. అంతే, కమ్మని రుచితో నోరూరించే "అల్లం నిమ్మకాయ చారు" రెడీ అవుతుంది!

అన్నం వార్చిన గంజితో సూపర్ టేస్టీ "అట్లు" - అప్పటికప్పుడు నిమిషాల్లోనే చేసుకోవచ్చు!