Summer Special Mango Kulfi: సమ్మర్ అంటే మామిడికాయల సీజన్. ప్రస్తుతం మార్కెట్లో పచ్చి మామిడికాయలతో పాటు పండ్లు కూడా లభిస్తున్నాయి. ఇక చాలా మంది పండ్లను నేరుగా తింటుంటారు. మరికొందరేమో మిల్క్‌షేక్, జ్యూస్‌లు, ఐస్‌క్రీమ్‌లు చేసుకుంటుంటారు. అయితే పండ్లతో ఇవి మాత్రమే కాకుండా క్రిమీగా ఉండే కుల్ఫీలు కూడా చేసుకోవచ్చు. పైగా వీటిని ప్రిపేర్ చేసుకునేందుకు పాలు, స్టవ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. పిల్లలైతే ఒకటికి రెండు ఇష్టంగా తినేస్తారు. మరి లేట్ చేయకుండా ఈ మ్యాంగో కుల్ఫీలు ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:
- మామిడి పండు - 1
- పంచదార - పావు కప్పు
- జీడిపప్పు - పావు కప్పు
- పాల మీగడ - పావు కప్పు
- బ్రెడ్ స్లైస్‌లు - 2
- యాలకుల పొడి - పావు టీ స్పూన్
- డ్రైఫ్రూట్స్ పలుకులు - కొద్దిగా

తయారీ విధానం:
- వేడి నీటిలో జీడిపప్పును సుమారు అర గంట సేపు నాననివ్వాలి.
- మామిడి పండును శుభ్రంగా కడిగి పై తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బ్రైడ్ స్లైస్ల్లో బ్రౌన్ కలర్ తీసేసి ముక్కలుగా చేసుకోవాలి.
- జీడిపప్పులు నానిన తర్వాత కుల్పీ ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం మిక్సీ జార్‌లోకి మామిడి ముక్కలు, పంచదార, నానబెట్టిన జీడిపప్పు, బ్రైడ్ స్లైస్‌లు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- అనంతరం పాల మీగడ, యాలకుల పొడి వేసి మధ్యమధ్యలో ఆపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

- కుల్ఫీ మౌల్డ్స్ తీసుకోవాలి. వాటి అడుగు భాగంలో డ్రైఫ్రూట్స్ పలుకులు కొన్ని వేసుకోవాలి. ఆపై మ్యాంగో మిశ్రమాన్ని వేసుకోవాలి. పైన కూడా మరికొన్ని పలుకులు వేసుకుని చిన్నగా నేలకు ట్యాప్ చేయాలి. ఇలా చేయడం వల్ల మధ్యలో గ్యాప్ ఏమైనా ఉంటే సెట్ అవుతుంది.
- ఇలా మ్యాంగో మిశ్రమం ఉంచిన తర్వాత మౌల్డ్‌ను బటర్ పేపర్ లేదా అల్యుమినియం ఫాయిల్‌తో క్లోజ్ చేసి ఐస్‌క్రీమ్ స్టిక్ ఉంచాలి. ఇలా మౌల్డ్స్ అన్నింటిని ప్రిపేర్ చేసుకోవాలి.

- ఒకవేళ మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ లేకపోతే స్టీల్ గ్లాస్‌లలో ఈ మిశ్రమం పోసి ఫాయిల్‌తో కవర్ చేసి స్టిక్ ఉంచాలి.
- ఇలా ప్రిపేర్ చేసుకున్న అన్నింటిని ఫ్రీజర్‌లో హై కూలింగ్‌లో సుమారు 8 గంటల పాటు ఉంచాలి. వీలైతే రాత్రంతా ఉంచినా సరిపోతుంది.
- ఆ మరుసటి రోజు వాటిని డీమౌల్డ్ చేసి కూల్‌కూల్‌గా తింటే అద్దిరిపోతుంది. చూశారుగా నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు.
టిప్స్:
- మామిడి పండు స్వీట్‌కు తగినట్లుగా పంచదారను అడ్జస్ట్ చేసుకోవాలి.
- పాల మీగడ లేకపోతే కాచి చల్లార్చిన పాలను పోసుకున్నా సరిపోతుంది. మీగడైతే కుల్ఫీ క్రీమిగా వస్తుంది.
- యాలకులు పొడి బదులు లైట్గై వెనీలా అసెన్స్ వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది.

మిల్క్ పౌడర్, క్రీమ్ లేకుండానే - మధురమైన ఐస్‌క్రీమ్ మీ ఇంట్లో! - కూల్ కూల్‌గా తినేయండి
నార్త్ స్పెషల్ "మలాయ్ కుల్ఫీ" - ఇలా ప్రిపేర్ చేస్తే కుమ్మేస్తారు!