ETV Bharat / offbeat

ఒంట్లో వేడిని తగ్గించే "మజ్జిగ చారు" - ఈ పద్ధతిలో చేస్తే ఘుమఘుమలాడే రుచి! - తినడమే కాదు తాగేస్తారు! - SUMMER SPECIAL MAJJIGA CHARU RECIPE

-ఆరోగ్యానికి మేలు చేసే మజ్జిగ చారు -ఈ టిప్స్ పాటిస్తే సూపర్ టేస్ట్ పక్కా!

Majjiga Charu Recipe
Majjiga Charu Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 18, 2025 at 12:09 PM IST

3 Min Read

Summer Special Majjiga Charu Recipe: మజ్జిగ చారు ఎండాకాలంలో మెజార్టీ పీపుల్​ అన్నంలో పోసుకుని తింటుంటారు. అయితే దీనిని ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తుంటారు. కానీ ఎవరు ఎలా చేసినా టేస్ట్​ మాత్రం చాలా బాగుంటుంది. పైగా ఎక్కువ కష్టపడకుండా చాలా సింపిల్​గా ప్రిపేర్​ చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే మీకోసం వేరే పద్ధతిలో చేసుకునే మజ్జిగ చారు తీసుకొచ్చాం. చాలా అంటే చాలా ఈజీగా, ఎక్కువ కష్టపడకుండానే చేసుకోవచ్చు. పైగా పెద్దగా పదార్థాలు కూడా అవసరం పడదు. అంతేకాకుండా మొదటిసారి చేసే వారు కూడా అదుర్స్​ అనిపించేలా చేస్తారు. మరి లేట్​ చేయకుండా ఈ మజ్జిగ చారును ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

Curd
Curd (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • పెరుగు - 500 గ్రాములు
  • పచ్చిమిర్చి - 4
  • అల్లం ముక్క - కొద్దిగా
  • ఉప్పు- రుచికి సరిపడా
  • నూనె - 2 టేబుల్​ స్పూన్లు
  • ఆవాలు - అర టీ స్పూన్​
  • జీలకర్ర - అర టీ స్పూన్​
  • పచ్చి శనగపప్పు - అర టీ స్పూన్​
  • మినప్పప్పు - అర టీ స్పూన్​
  • దంచిన వెల్లుల్లి రెబ్బలు - 4
  • ఎండుమిర్చి - 3
  • కరివేపాకు - 3 రెమ్మలు
  • పసుపు - అర టీ స్పూన్
  • ఉల్లిపాయ - 2
Onions
Onions (Getty Images)

తయారీ విధానం:

  • మిక్సింగ్​ బౌల్​లోకి పెరుగు తీసుకుని విస్కర్​ సాయంతో బాగా చిలకాలి. పెరుగును ఎంత క్రిమీగా చేసుకుంటే మజ్జిగ చారు అంత టేస్టీగా ఉంటుంది.
  • ఇప్పుడు ఈ పెరుగులోకి రుచికి సరిపడా ఉప్పు, సరిపడా నీళ్లు పోసి బాగా కలపాలి. అయితే ఇక్కడ నీళ్ల క్వాంటిటీ అనేది మీరు తినేదానికి అనుగుణంగా కలుపుకోవాలి.
  • ఇలా పెరుగు, ఉప్పు, నీళ్లు బాగా కలుపుకున్న తర్వాత గిన్నెను పక్కన ఉంచాలి.
  • మిక్సీజార్​లో పచ్చిమిర్చి, అల్లం ముక్క వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్​ చేసుకోవాలి. రోట్లో దంచుకుంటే రుచి ఇంకా బాగుంటుంది.
  • ఈ పచ్చిమిర్చి పేస్ట్​ను పెరుగు మిశ్రమంలో కలిపి పక్కన ఉంచాలి.
Ginger Mirchi Paste
Ginger Mirchi Paste (ETV Bharat)
  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్​ హీటెక్కిన తర్వాత తాలింపు గింజలు(ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు) వేసి చిటపటలాడించాలి.
  • తాలింపు వేగిన తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఓ నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత ఎండుమిర్చి వేసి మరో రెండు నిమిషాలు వేయించిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి.
  • ఉల్లిపాయ ముక్కలను లైట్​గా ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు, పసుపు వేసి కలిపి మగ్గించిన తర్వాత కలిపి పెట్టుకున్న మజ్జిగ మిశ్రమాన్ని పోసి ఓ నిమిషం పాటు కలిపి స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • చివరగా కొత్తిమీర తరుగు వేసి సర్వ్​ చేసుకుంటే కమ్మగా ఉండే మజ్జిగ చారు రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Majjiga Charu
Majjiga Charu (ETV Bharat)

టిప్స్​:

  • మజ్జిగ చారు కోసం ఉపయోగించే పెరుగు పుల్లగా ఉంటే రుచి బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే మజ్జిగ చారు రెడీ అయిన తర్వాత రెండు చుక్కల నిమ్మరసం పిండుకుంటే సరి.
  • ఈ రెసిపీ కోసం ఉపయోగించే ఉల్లిపాయలను మరీ మెత్తగా ఫ్రై చేయకూడదు. ఒక నిమిషం వేయిస్తే సరిపోతుంది.
  • కావాలనుకుంటే తాలింపులో చిటికెడు ఇంగువ వేస్తే రుచి మరింత బాగుంటుంది.
  • పచ్చిమిర్చి, అల్లం పేస్ట్​ వేయడం వల్ల చారు మంచి రుచితో రెడీ అవుతుంది. ఒకవేళ ఈ పేస్ట్​ వద్దనుకుంటే మీ కారానికి తగినట్లుగా ఎండుకారం వేసుకుంటే సరిపోతుంది.

ఘుమఘుమలాడే "చికెన్​ మజ్జిగ పులుసు" - ఈ పద్ధతిలో చేస్తే మెతుకు కూడా మిగల్చరు!

చల్లచల్లని "మామిడికాయ మజ్జిగ పులుసు" - ట్రెడిషనల్ టేస్ట్, ట్రెండీ లుక్​లో - 5 నిమిషాల్లో రెడీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.